ఉత్తరాయణం

విద్యార్థులకు ఎండలతో ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రమయ్యాయ. ఇక పదవ తరగతి పరీక్షల సమయంలో భానుని ఉగ్ర రూపం ఎట్లా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తున్నది. ఈసారి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తోడు, ప్రచండమైన ఎండలతో కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చల్లని మంచినీటి సదుపాయం అన్ని పరీక్షా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతిరోజూ నిమ్మరసమో, చల్లని మజ్జిగనో లేదా చలువచేసే పండ్ల రసాలో అంతటా పరీక్ష రాసే విద్యార్థులకు అందిస్తే వడదెబ్బనుంచి పిల్లల్ని కాపాడవచ్చు.
- సిరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఎస్‌జిటి విధానం వద్దు
పాఠశాలల్లో ఎస్‌జిటి విధానాన్ని రద్దు చేయాలి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చెప్పడం వల్ల పిలల్లకు బోరు కొట్టి చదువుపై శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది. గంటల తరబడి, ఒకే ఉపాధ్యాయడు తరగతి గదిలో ఉంటే విద్యార్థులకి మానసిక అలసట కలిగి శ్రద్ధ దెబ్బతింటుంది. అలా కాకుండా రెండు సబ్జెక్టులకు ఓ ఉపాధ్యాయుడు వారి డిగ్రీలను బట్టి నియమించాలి. పైగా ఒక ఉపాధ్యాయుడు ఏడు సబ్జెక్టులు చెప్పగలడా? అది అసంభవం. ఉదాహర ణకు గణిత నేపథ్యం గల ఉపాధ్యాయుడు ఇంగ్లీషు గ్రామరు చెప్పలేడు. అలాగే ఇంగ్లీషు చదువులు చదివిన వ్యక్తి లెక్కలు చెప్పడం అంతకంకంటె సాధ్యం కాదు. అందువల్ల రెండు సబ్జెక్టులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. అధికార్లు ఒక పద్ధతిని అమలు జరిపే సమయంలో అది ఎంతవరకు సముచితమో గుర్తించకపోతే వచ్చే ఇబ్బందులే ఇవి.
- అన్నపూర్ణ, విశాఖపట్టణం
సహించరాని నేరం
పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు చట్టబద్ధంగా శిక్ష విధించబడింది. అటువంటి దేశద్రోహిని సమర్థించి, అతనికి అనుకూలంగా మాట్లాడేవారు, ఎవరైనా దేశద్రోహు లే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. దేశద్రోహులకు అనుకూలంగా ఉన్నత విద్యలు అభ్యసించే వారు అసలు మాట్లాడకూడదు. అట్లా చేస్తే అది క్షమించరాని నేరం. కేవ లం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని సహించరాదు.
- గర్నెపూడి రత్నాకర్ రావు, హనుమకొండ
ప్రభుత్వ వైఖరి మారాలి
అక్రమార్కుల ప్రకృతి విరుద్ధమైన పోకడలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు కడు ప్రమాదకరం. అభినవ రావణాసురులు యధేచ్చగా గంధపు చెక్కలను విదేశాలకు తరలిస్తూ వందల కోట్లను తమ సొంతం చేసుకుని చట్టానికి చుట్టాలై విర్రవీగుతూ మన మధ్యే తిరుగుతున్నారు. ఇసుకాసురులు ఆధునిక బకాసురులవలే తమ ఇష్టానుసారంగా సైకత భోజనాల్ని ఆరగిస్తూ అడ్డు అదుపు లేకుండా ధనార్జన చేసి విదేశీ బ్యాంకులలో తమ ధనాన్ని పదిలపరుస్తున్నారు. వీరు భూగర్భ జలాలను భూస్థాపితం చేసి నీటి ఎద్దడికి కారణమవుతున్నా జీవచ్ఛవాల వలె చూస్తూ ఏదో చేస్తారని ఊహించుకుంటు తమ జీవితాలను నిస్సారంగా నిస్తేజంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది. దీని వెనుక ప్రభుత్వ వైఫల్యం అధికార గణ ఉదాసీన వైఖరి కారణమై వున్నాయనడం నిర్వివాదాంశం. ఇకనైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించి చిత్తశుద్ధితో నిరూపించుకుంటుందని ప్రజా ధనాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి ఆకలి చావులకు చరమగీతం పాడాలి.
-అల్లాడి వేణుగోపాల్, నెల్లూరు