ఉత్తరాయణం

ప్లాస్టిక్‌తో అనర్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్, పాలిథీన్ వస్తువులు మన సమాజంలో వికృతంగా మారి ఈసారి ఏకంగా గణతంత్ర దినోత్సవంరోజు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ జెండాలే దర్శనమిచ్చాయి. కాగితం జెండాల స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేసింది. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ప్రైవేటు స్థలాల్లో జాతీయ పతాకాలు ఎగురవేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే అలంకరణకోసం తోరణాలుగా కట్టిన ప్లాస్టిక్ జెండాలు కిందపడి చెత్తాచెదారంలో చేరిపోతున్నాయి. సాధారణ జనం కాళ్ళకిందపడి నలిగిపోతున్నాయి. ఈ పరిస్థితి జాతీయ జెండా గౌరవానికే భంగకరంగా తయారయింది. స్తంభాలు, ద్వారాలు, భవనాలు మొదలగు వాటికి అలంకరించిన జెండాలను రోజుల తరబడి తొలగించకపోవడం వలన వాతావరణం, ఇతర కారణాలవలన ఈ జెండాలు నేలపైబడి ముక్కలవుతున్నాయి. ఇది చాలా పెద్ద తప్పనే విషయం చాలామందికి తెలియకపోవడం బాధాకరం. కాగితపు జెండాలవలే ప్లాస్టిక్ జెండాలు జీవ విచ్ఛిన్నాలు కావు. ఇవి దీర్ఘకాలంలో కూడా నాశనం కావు. గణతంత్ర వేడుకల తర్వాత సాధ్యమైనంత వరకు ఉపయోగించిన జెండాలను వాటి గౌరవానికి భంగం కలగని రీతిలో తొలగించి, ప్రత్యేక ప్రదేశంలో వదిలివేయాలి. ఈరోజుల్లో గ్రామాల్లో, పట్టణాల్లో కుల సంఘాలవారు, ఆటోడ్రైవర్ల యూనియన్లు తదితరులు జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నారు. అయితే వారికి జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించకూడదన్న సున్నిత విషయాలు తెలియవు. గౌరవప్రదంగా నిర్వహించే ఇట్లాంటి కార్యక్రమాల మీద వారికి అవగాహన కల్పించేట్లు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. కాగితంతో చేసిన జెండాలను మాత్రమే (ప్లాస్టిక్‌వి కాకుండా) వినియోగించే విధంగా జాతీయ పతాక నియమావళి (్ఫ్లగ్ కోడ్) గురించి అధికారులు ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు తగు ఆదేశాలు జారీచేయాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్
అక్కడ రోగులకు రక్షణ లేదు
రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి, కోస్తాంధ్ర జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని అయిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అధికారులు, వైద్యులు, సిబ్బందిల నిర్లక్ష్యం కారణంగా రోగులు నానాఅవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం మాట అటుంచి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కూడా లేకుండాపోతోంది. పుట్టిన పసిబిడ్డలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నా కుక్కలు, పందులు, ఎలుకలు పసికందులను కొరికి గాయపరుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా వుండి ఆస్పత్రి ప్రాంగణం, వార్డులు మురికి కూపాలను తలపిస్తున్నాయి. ఇక దొంగలు వార్డుల్లో సామానులు, చైన్‌స్నాచింగ్‌లు చేసి దర్జాగా తప్పించుకుంటున్నారు. ఆస్పత్రిలో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన సి.సి టీవి కెమెరాలు పనిచెయ్యడం లేదు.
- ఎం.కనకదుర్గ, తెనాలి
భయపెడుతున్న బోరు బావులు
అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న బోరుబావుల సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఎన్నో పసిప్రాణాలు అనంతవాయువుల్లో కలిసినా ప్రజలు, అధికారులు అప్రమత్తం కాకపోవడం దురదృష్టకరం. నీటికోసం బోరుబావులను త్రవ్వ డం, నీరు పడలేదనో ఇంకేదో కారణాలవల్ల వాటిని మూ సివేయకుండా అలానే వదలివేయడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఇలాంటివి మళ్ళీమళ్ళీ పునరావృత్తం కాకుండా యజమానులు, అధికారులు చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న యువత
ఫ్యాషన్ పేరిట నేటి యువత కార్లు, మోటారు బైక్‌లకు వాహన హెడ్‌లైట్లు స్టిక్కర్లు వేయించుకోవడం లేదు. మోటారువాహనాల యాక్టును ఇది ఉల్లంఘనే అయినా అటు పోలీసులు గాని, ఇటు రవాణాశాఖ గాని పట్టించుకోవడం లేదు. అట్లాగే రహదారులలో అనేక భారీ వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారు. సిగ్నల్ లైట్లు పనిచెయ్యకపోవడం, వెనుక రేడియం స్టిక్కర్లులేకపోవడం వలన వెనుక స్పీడుగా వచ్చే వాహన చోదకులు అదుపుతప్పి వీటిని గుద్దేస్తున్నారు. జాతీయ రహదారుల్లో రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఉన్నప్పటికీ తరుచుగా లైన్లుమార్చడమో లేక రాంగ్ రూట్‌లోనే వస్తూ ప్ర మాదాలకు కారణవౌతున్నారు. హెడ్‌లైట్ స్టిక్కర్లు లేకపోవడంవలన వాహనాల లైటు కాంతి ఎదుటి వాహనాల చోదకుల కళ్లలో పడి, ఏమీ కనిపించనందున వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన హెల్మెట్ ధారణ నిబంధన అమలులో ఎక్కడా నోచుకోవడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
రాయలసీమకు అన్నీ కష్టాలేనా?
గతంలో నాగార్జునసాగర్‌కన్నా ముందుగా నిర్ణయమైన సిద్దేశ్వరం ప్రాజెక్టును రాయలసీమ నాయకులంతా తుంగ లో తొక్కారు. ఇప్పుడు తిరుపతి స్మార్ట్ సిటీ అవకాశం కొద్ది తేడాతో తప్పినదని అంటున్నారు. వరంగల్ ఒక పాయింట్ తేడాతో తప్పిందని అంటున్నారు. తిరుపతికి పాయింట్లు తెలియజేయలేదు. రాబోయే కాలంలోనైనా రాయలసీమకు మేలు చేపడతారని ఆశిస్తున్నాను. సర్కా రు జిల్లాలకు కల్పించిన వసతులు, ప్రాజెక్టులు రాయలసీమకు కూడా సగం కల్పించాలి. అన్ని విషయాల్లో నష్టాల పాలైన రాయలసీమను ఆదుకోవాలి.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు