సంపాదకీయం

జాతీయ వాణిజ్య మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారుల ఆధునీకరణకు, విస్తృతీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్ పథకాలను ఆవిష్కరిస్తుండడానికి అతుకుల గతుకుల హడలెత్తిస్తున్న ప్రమాణాలు ప్రధాన నేపథ్యం. దేశమంతటా విస్తరించి ఉన్న క్షిప్రగమన పథాల-ఎక్స్‌ప్రెస్‌హైవేస్-మాత్రమే ఈ గతుకులకు మినహాయింపు. బహుదూరపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో భారత జాతీయ రాజపథ నిర్వహణ అధికార మండలి వారు ఇప్పుడు మరో పథకాన్ని ఆవిష్కరించడం హర్షణీయం. ప్రతి పాతిక కిలోమీటర్లకు ఒక వౌలిక అవసరాలను తీర్చగల సౌకర్య పాంగణాలను జాతీయ రాజపథాల-నేషనల్ హైవేస్-పక్కన ఏర్పాటు చేయనున్నారట. విస్తృత సౌకర్య ప్రాంగణాలను కనీసం ప్రతి యాబయి కిలోమీటర్లకు ఒక చోట ఏర్పాటు చేయనున్నట్టు భారత జాతీయ రాజపథ నిర్వహణ అధికార మండలి-ఎన్‌హెచ్‌ఏఐ-వారి నూతన ఆవిష్కరణ ద్వారా వెల్లడైంది. ఈ సౌకర్యాల ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికై నిర్వహణ మండలి వారు ఆయా ప్రదేశాలలో భూమిని కూడ సేకరించనున్నారని విధాన ఇతివృత్త పత్రం-పాలసీ కాన్‌సెప్ట్‌పేపర్-లో వెల్లడి చేశారు. ప్రతి ఇరవైఐదు కిలోమీటర్లకు ఒకచోట శౌచాలయాలను, మంచినీటి వ్య వస్థను, బహుళ వస్తువుల దుకాణాలను, వాహనాలను ఆపి ఉంచే స్థలాలను ఏర్పాటు చేయడం విధానపత్రంలోని ప్రధానాంశం. ప్రతి యాబయి కిలోమీటర్లకు ఒకచోట స్నానశాలలను, వాహన చోదకులకు విశ్రాంతి శాలలను, భోజన శాలలను, అల్పాహార విక్రయ కేంద్రాలను, వాహనాలను నిలిపి ఉంచడానికి వీలైన బృహత్ ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారట. వెడల్పైన ఈ రహదారుల వెంట ప్రస్థానం సాగించే దూర ప్రయాణీకులకు, వాహన చోదకులకు ఈ సౌకర్యాలు ఎంతో ఉపయోగకరం. స్వతంత్ర భారతదేశంలో ఏడు దశాబ్దాలుగా ఈ సౌకర్యాలు లేక నానా కడగండ్లకు గురైన ప్రయాణీకులకు ఎడారిలో హరిత ప్రాంతాల వలె ఈ సౌకర్య ప్రాంగణాలు ఎంతో ఊరట కలిగించగలవు. రహదారులను హరిత పథాలుగా మార్చడానికి దోహదం చేయగల విధానాన్ని 2015, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించి ఉంది. తొలి ఏడాది ఆరువేల కిలోమీటర్ల మేరకు ఆకుపచ్చని రాజబాట-గ్రీన్ ఫీల్డ్ హైవే-లను ఏర్పాటు చేయనున్నట్టు హరిత క్షేత్ర పథ విధాన పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వపు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అప్పుడు చెప్పి ఉన్నారు. ఇప్పుడు సౌకర్యాల రహదారుల విధానం ఆవిష్కృతం కావడం మరో ముందడుగు!
ఈ సౌకర్యాల విధానం, హరిత మార్గాల విధానం ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యంతో ముడివడి ఉండడం ప్రపంచీకరణ వ్యవస్థ ప్రభావం. గత సెప్టెంబర్‌లో విడుదల విధానం ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా పదహారు ఆకుపచ్చని రహదారులను నిర్మించనున్నట్టు నితిన్ గడ్కరీ గత డిసెంబర్‌లో లోక్‌సభకు తెలియజేశారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలను అనుసంధానం చేయడానికి, మారుమూల ప్రాంతాలకు ఆర్థిక లాభం చేకూర్చడానికి వీలుగా ఈ హరిత మార్గాలను నిర్మిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉన్న జాతీయ మార్గాలను ‘క్షిప్ర పథాల’ను హరిత మార్గాలుగా మార్చనున్నారా? లేక కొత్త మార్గాలను నిర్మిస్తారా అన్నది స్పష్టం కాలేదు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలను అనుసంధానం చేయడానికి మారుమూల ప్రాంతాలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా హరిత మార్గాలను నిర్మిస్తామన్నది విధానం. జాతీయ మార్గాల వల్ల క్షిప్ర పథాల వల్ల ఇలా వెనుకబడిన ప్రాంతాలు అనుసంధానం జరిగిందా? జరగలేదా? అనుసంధానం జరిగి ఉండినట్టయితే ఇరుపక్కలా బోసిగా ఉన్న రహదారుల పక్కన ఆకుపచ్చని అందాలను సమకూర్చడం ద్వారా ఇప్పటికే రాకపోకలకు ఉపయోగపడుతున్న రాజ మార్గాలనే హరిత పథాలుగా మార్చవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రధానమైన రహదారుల వల్ల వెనుకబడిన ప్రాంతాల అనుసంధానం జరిగి ఉండకపోయినట్టయితే కొత్తగా ఆకుపచ్చని బాటలను నిర్మించాలి. ఈ విషయం సామాన్య ప్రజలకు స్పష్టం కావడం లేదు. పార్లమెంటులో సభ్యులు వివరణ కోరినట్టయితే మంత్రులు స్పష్టీకరణ ఇస్తారు. అదేమీ జరగలేదు. కొత్త మార్గాలను నిర్మించినప్పటికీ ఆకుపచ్చదనానికి దూరంగా ఎండలకు ఎండిపోతున్న బాటల పక్కన చెట్లను మొక్కలు పెంచిన అటవీ హరిత శోభలు అలముకున్నట్టయితే గాయపడిన ప్రకృతి మళ్లీ స్వస్థతను సంతరించుకోగలదు.
ఇలాంటి హరిత మార్గాలు స్వచ్ఛ భారత్ పునర్ నిర్మాణానికి, పరిసరాల సమతుల్యానికి తప్పక దోహదం చేయగలవు. కానీ ఈ ఆకుపచ్చనితనం వెనుకనుండి, సౌకర్య ప్రాంగణాల చాటునుంచి వాణిజ్య అక్రమ ప్రయోజనాలు తొంగిచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యం-పిపిపి- ఇప్పటికే జాతీయ మార్గాలను వాణిజ్య మార్గాలుగా మార్చివేసింది. ఈ మార్గాలపై సగటున వంద కిలోమీటర్లకు ఒక చోట ఏర్పడి ఉన్న శుల్కాల ద్వారాలు-టోల్ గేట్స్- వాహన యజమానులను దోపిడీ చేయడానికి ఏర్పాటయిన కేంద్రాలు. ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించిన ప్రభుత్వేతర సంస్థలు తమ పెట్టుబడులకు పదింతల లాభాన్ని గుం జుకుంటుండడం, ప్రపంచీకరణ ప్రభావం. ఇప్పు డు పాతిక కిలోమీటర్లకు, యాబయి కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పడనున్న సౌకర్యాల ప్రాంగణాలను కూడ ప్రభుత్వేతర భాగస్వామ్యం లోనే కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేయనున్నారు. అందువల్ల ఈ సౌకర్యాల కేంద్రాలు కూడ ప్రభుత్వేతర సంస్థలకు భారీగా లాభాలను చేకూర్చిపెట్టే వాణిజ్య వాటికలుగా మారనున్నాయి. స్థలం సేకరించి పెట్టే ప్రభుత్వం ఇరవై తొమ్మిదేళ్లపాటు నిర్మాణ నిర్వహణ అధికారాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అప్పజెప్పనున్నాయి. అవసరమైతే మరో ఇరవైతొమ్మిదేళ్లపాటు కూడ ఈ సౌకర్యాల ప్రాంగణ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు అప్పజెబుతాయట. ప్రభుత్వేతర సంస్థలు విదేశీయ సంస్థలు కూడా కొనవచ్చునన్నది ప్రపంచీకరణ ఏర్పాటు చేసిన మార్గదర్శక సూత్రం.
రహదారుల వెంట సౌకర్యాలను కల్పించడంలో మన దేశంలో అనాదిగా ప్రభుత్వాలకంటె ప్రభుత్వేతరులే ముందున్నారు. అయితే ఆ ప్రభుత్వేతరులు వాణిజ్య లాభాలను కోరలేదు. సంపన్నులు నిరుపేదలు సైతం తమ ధనాన్ని శక్తిని, సమయాన్ని వెచ్చించి బాటల పక్కన చెట్లు నాటారు, బావులు తవ్వారు, సత్రాలు కట్టారు. ఉచిత భోజనాదులను ఏర్పాటు చేశారు. విదేశీయుల పాలనలో సత్రాలు, బావులు పాడుపడినాయి. ఉచిత భోజనశాలలు అన్న విక్రయశాలలుగా అవతరించాయి. బాటల పక్కనున్న చెట్లు మాత్రం మిగిలాయి. ఆ చెట్లను ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించిన ప్రభుత్వేతర సంస్థలు కొట్టిపడేశాయి. పోకమార్గానికీ, రాక మార్గానికీ మధ్యనున్న నడవలో చెట్లు పెంచుతారని ప్రచారమైంది. కానీ ప్రభుత్వేతర సంస్థలు చెట్లను పెంచలేదు. చిన్నచిన్న మొక్కలను పెంచుతున్నారు. చెట్లను పెంచి ఉండినట్లయితే గత పదిహేను ఏళ్లుగా ఆవి పెరిగి ప్రస్తుతం హరిత మార్గాలు ఏర్పడి ఉండేవి. రోడ్డు మధ్యలోని ‘నడవ’లో చెట్లను ఎందుకు పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వం వారు పదిహేనేళ్లుగా ప్రభుత్వేతరులను ఎందుకని నిలదీయలేదు?