సబ్ ఫీచర్

‘వట్టికోట’ కాదు ‘గట్టికోట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మించి శతవత్సరాలు, మరణించి 55 సంవత్స రాలు గడిచి, తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు రెండు వసంతాలు పూర్తయనా గుర్తింపునకు నోచ ని తెలంగాణ తొలి నవలా కారుడు వట్టికోట అళ్వారు స్వామి. నిజాం సర్కారు దమ న నీతిని దునుమాడుతూ, అక్షరానే్న ఆయుధంగా సంధిం చి అళ్వారు చేసిన అక్షర యుద్ధమే ఆయన్ను ‘ప్రజల మనిషి’గా నిలిపింది. రజాకార్ల పిత, హిందూ వ్యతిరేక చర్యలకు నిస్సిగ్గుగా పూనుకొని, పేద ముస్లింల రక్తాన్ని కూడా రుచి మరిగిన వ్యాఘ్రంలా పరిణమించిన నాటి నిజాం పాలన ఎందుకు వద్దో ముందుగానే పసికట్టి చేసిన ప్రజాయుద్ధానికి అక్షర రూపం ఇచ్చిన ప్రజల మనిషి అని చెప్పక తప్పదు. తరతరాల బూజు, మా నిజాం ..నీ పాలన మాకొద్దు’ అని తిరగబడ్డ తెలంగాణ వీరుల వారసులు బ్రతికుండగానే నేటి పాలకులు ‘మా నిజాం మా దొడ్డ మనసున్నదొ, వారి కాల్కి మొక్తం’ అనడం వీరుల త్యాగానికి తీరని అవమానం.
నాటి అధికారభాషగా వెలుగొందిన ఉర్దూను, నేడు హైదరాబాదులో అనధికార అధికార భాషగా చెలామణి చేయస్తూ, తెలుగుకు సమాధి నిర్మించే క్రమంలో అత్యంత శ్రమ పడుతున్న నేటి నేతాశ్రీలకు, నాటి హైదరాబాద్ స్టేట్‌లో ‘గోలకొండ’ ఆధారంగా, ‘జైలులోపల’, ‘జీవన రాగం’, పాడి ‘కనువిప్పు’ కలిగిస్తూ ‘దేశోద్ధారక గ్రంథమాల’ను వెలు వరిస్తూ ‘తెలంగాణం’ చేసిన అళ్వారు స్వామి రచనలు ఈనాటి ప్రజా ప్రభుత్వాలకూ వర్తిస్తాయ. తెలంగాణలో ఆంధ్రభాష బ్రతికి బట్టకట్టడానికి కృషి చేసిన ఎందరో మహానుభావుల్లో అళ్వారు ఒకరు. ఇంతటి ఆంధ్రభాషాభిమానులే లేకపోతే తెలంగాణ పేరు ఉర్దూగాణా/ ఆంగ్లగాణగా మారి ఉండేదేమో?
అళ్వార్ వంటి రచయతల గోటికి చాలని ఎంతో మంది రాజకీయ కారణాలతో సత్కరించబడుతూ, పూజ్యులు విస్మరింపబడుతున్నారు. కవి, గాయకుల్లో, ఒకరిద్దరికి పట్టం కడితే అది భాషాభిమానం అనిపించుకోదు. భావి తరాలకు స్పూర్తి కల్గించేలా భాషావేత్తలను, గౌరవించాలి. అనర్హులైన వందిమాగధులకు పురస్కారాలు పంచిపెడితే, కొంతకాలానికి రాజకీయ క్రీడలో భాగంగా పురస్కారాలను, తిరస్కరిస్తూ తాము ఆకాశంలో సగం కాదు ఆలోచనల్లో శూన్యం అని ఋజువు చేసుకుంటూ సాహిత్యలోకం పరువు తీసే ప్రమాదం పొంచి ఉంది. నాటి నిజాంను నిరంతరం పొగిడే నేటి పాలకులు, నైజాంకు వ్యతిరేకంగా వెళ్లిన అళ్వారును గౌరవించడం అనుమానమే. తెలంగాణ రచయతల వేదిక వంటి వారు వట్టికోటను ‘గట్టికోట’గా గుర్తించాలి. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లోను ఆంధ్రభాషకు పట్టంకట్టలేదు. నాటి సాహిత్యకారులకు కాదుకదా, నేటి శంకుస్థాపనల్లో కూడ ఆంధ్ర భాషకు అథమ స్థానం కట్టబెట్టడాన్ని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌ను అసలైన ఆంధ్ర చిరునామాగా భాషాభిమానులు మలచాలి. దీనికి ఏపీ ముఖ్యమంత్రి మద్దతు పూర్తి స్థాయలో ఉంటుందని భావిద్దాం. ‘ఆంగ్ల ప్రదేశ్’ దిశగా ‘ఆంధ్ర ప్రదేశ్’ ప్రయాణాన్ని ప్రజలు అంగీకరించరు.

- పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు