ఉత్తరాయణం

అన్నీ వాస్తవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 12న ప్రచురితమైన ‘ఉన్నమాట’లో ప్రతి మాట వాస్తవాల మూటే. ఇతర మతాలవారిని ఏ స్వల్ప కారణం గా నైనా నిందారోపణ చేస్తే అది నిప్పుకణమై దేశానే్న దహించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఇతర మతాలవారు దన్నుగా నిలుస్తారు. కాని పెద్ద దురదృష్టమేమంటే హిందూమతమే హిందువులతో సహా అందరకూ లోకు వైపోయంది. ఈ హిందూ అనైక్యతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి పరపాలనపాలు చేసిందని చరిత్ర చాటి చెబుతోంది. ‘‘హిందువుల్లారా ఏకం కండి’’ అని వేడుకునే ఖర్మ పట్ట డం ఎంత అవమానకరమో, ఇతరులకు ఎంత చులకన అవుతున్నమో ప్రతి హిందువూ తెలుసుకోవాలి. లేకుంటే కొన్ని దశాబ్దాల తరువాత భారతదేశంలో హిందువుల మనుగడ ప్రశార్ధకమవ గలదు.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాదు
దిద్దుబాటు చర్యలు అవసరం
జెఎన్‌యు డ్రామాయణం కళ్లకు కట్టినట్టు ఎంవిఆర్ శాస్ర్తీగారు వివరించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, విజాయతీయుల పుణ్యమాని సరస్వతీ విద్యా నిలయం మార్క్స్‌వాదుల, అఫ్జల్ గురు లాంటి విద్రో హుల వేదికగా మారడం శోచనీయం. వినయానికి కాణాచి అయన విద్యాలయం విదేశీ తొత్తుల స్థావరంగా మారింది. భారత్‌మాతాకీ జై, వందేమాతరం నినాదాలకు బదులు అఫ్జల్‌గురు జిందాబాద్, కాశ్మీరుకి స్వతంత్ర ప్రతిపత్తి వంటి విద్రోహక నినాదాలు వినవస్తున్నాయ. కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను జెఎన్‌యులో స త్వరమే చేపట్టాలి.
- పి. మారుతీరాం, సికింద్రాబాద్
ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్
మొన్నీమధ్యనే హైదరాబాద్‌లో ఓ మంత్రి వర్యులు సుపుత్రుడి నిర్వాకం బయటపడింది. ఓ బురఖాలో వున్న మహిళను కారులో వెంబడించడం ఆమెని వేధించడం మీడియాలో చూసి సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. అదంతా అధికార బలంతో వచ్చిన డబ్బుతో ఒళ్ళు కైపెక్కి దురహంకారంతో చేసిన చర్య. తనకు జరిగిన అవమానాన్ని ధైర్యంగా ముందుకొచ్చి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన ఆ మహిళను మెచ్చుకోవాలి. అదే ఆమె సిగ్గుతోనో, భయంతోనో వౌనంగా దిగమ్రింగుకుని వుండిపోయినట్లయితే వాళ్ళు మహారాజుల్లా మరింత బరితెగించి ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడి ఉండేవారేమో. ఆమె నిండుగా బురఖావేసుకుంది కాని ఏ పాశ్చాత్య డ్రెస్సో వేసుకుని రెచ్చగొట్టలేదు కదా. ప్రజలు తిరగబడ్డారు కాబట్టి వాళ్ళు దిగి వచ్చారు. నిందితుణ్ణి శిక్షించారు. ఇది ప్రజల విజయం. అన్యాయాన్ని ఎదుర్కొని విజయం సాధించారు. హ్యాట్సాఫ్ టు ది మహిళ! ఆడపిల్లలందరి తరఫున అభినందనం. జరిగిన దానికి నిందితులు సిగ్గుపడాలి. అవమానంతో కృంగిపోవాలి తప్ప ఆమె కాదు.
- పి.షహనాజ్, అనంతపురం
ఆంధ్రలో మాఫియాల జోరు
భూదందాల మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందన దుంగల మాఫియా, కాల్‌మనీ, హాల్‌మని లాంటి సంఘటనలు జోరుగా సాగుతున్నాయన్న విషయం వార్తల్లో వింటున్నాం. నిజానికి మధ్యాంధ్రలో వీటి తీరు తీవ్రంగావుంది. తెలంగాణలో కూడ ఇలాంటి మాఫియాలలో ధనిక వ్యాపారులు, తమతమ వ్యాపారాలకోసమే తెలంగాణ విడిపోకుండా వుండడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. వీరికి ఆంధ్రలోను, తెలంగాణాలోను వున్న సామాన్య జనులతో పనిలేదు. వీరికి వీరి వ్యాపార దంధాలే ముఖ్యం. గత్యంతరం లేని పరిస్థితిలో చంద్రబాబు సి.ఎం. అయ్యారు. తెలంగాణలో మళ్లీ 2019లో కే.సి.ఆర్. సి.ఎం. అవకాశాలుండవచ్చు కానీ చంద్రబాబు చేసే భూదందాలవల్ల మళ్లీ 2019లో వచ్చే అవకాశం లేదు. ఆయనగారు గద్దెదిగిబోయేరోజు ఎంతోకాలం జరగదు.
- ఎస్.బి.అలీ, హైదరాబాద్
అహేతుక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు చేయాల్సిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అహేతుకం. పులిమీద పుట్రలా ఈ చార్జీలను రోగులే భరించాలన్న నిర్ణయం దారుణం. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు సంస్థలు అవసరం వున్నా లేకపోయినా టెస్టులు చేయించే ప్రమాదం వుంది. బంగారు తెలంగాణ కోసం చేస్తున్న యత్నాలు ఇటువంటి చర్యలవలన బెడిసి కొడతాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలకోసం వౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఆయా ఆసుపత్రులలోనే మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తే ప్రజలకు ముఖ్యంగా పేద వారికి ఎంతో మేలు కలుగుతుంది.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ