సంపాదకీయం

విశ్రమించని ఉగ్ర మృగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్య-ఐఎస్‌ఐఎస్-జిహాదీ ముఠాకు చెందిన హంతకులు బ్రెస్సెల్స్‌లో మంగళవారం సాగించిన భయంకర బీభత్సకాండ అంతర్జాతీయ నిఘా వైఫల్యానికి మరో నిదర్శనం. బ్రెస్సెల్స్ నగరం బెల్జియం దేశానికి రాజధాని మాత్రమే కాదు, ఐరోపా సమాఖ్యకు కేంద్రస్థానం కూడ..అంతకుమించి అంతర్జాతీయ రక్షణ దళంగా వ్యవహరిస్తున్న ఉత్తర అట్లాంటిక్ సైనిక సమాఖ్య-నాటో-కు సైతం బ్రెస్సెల్స్ ప్రధాన స్థావరం. అందుల్ల బ్రెస్సెల్స్‌పై దాడి ఐరోపాపై కక్షతీర్చుకునే ఐఎస్‌ఐఎస్ ప్రతీకార వ్యూహంలో భాగం. ఈ ప్రతీకారం ఊహించనిది కాదు. ఎందుకంటే సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై ఐరోపా దేశాల సైనిక దళాలు దాడులు మొదలు పెట్టిన వెంటనే ప్రతీకార చర్యలు మొదలైపోయాయి. రష్యాకు, ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా ఐఎస్‌ఐఎస్ విరుచుకుపడుతూనే ఉంది. అయినప్పటికీ అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు కాని, ఐరోపా దళాలు కాని బ్రెస్సెల్స్ విమానాశ్రయం దాడులకు గురికాకుండా నిరోధించలేకపోయాయి. బెల్జియం... జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సముద్ర జలాలకు, నెదర్లాండ్‌కు మధ్య నెలకొని ఉన్న సురక్షిత సీమ. బెల్జియంలోకి చొరబడడానికి బీభత్సకారులు ఈ నాలుగు దేశాల అంతరిక్ష, సముద్ర, భూతల నిఘాలను తప్పించుకొని పోగలగాలి. అలా పోగలగడం తమకు సాధ్యమేనని బ్రెస్సెల్స్‌లో హత్యాకాండ కొనసాగించడం ద్వారా ఐఎస్‌ఐఎస్ ముష్కరులు నిరూపించగలిగారు. తమ బీభత్స బలాన్ని మరోమారు చాటుకున్నారు. బ్రెస్సెల్స్‌లోని మెట్రోరైలు స్టేషన్‌ను, విమానాశ్రయాన్ని బాంబులు పేల్చి ధ్వంసం చేయడం ద్వారా ముప్పయికి పైగా నిండు ప్రాణాలను బలిగొన్నారు. బీభత్స ఘటన జరిగిన తర్వాత ఇరవైనాలుగు గంటల లోగా నిఘా విభాగాలవారు పేలుళ్లకు పాల్పడిన ముగ్గురు నరపిశాచులను గుర్తించగలిగారట. ఈ హంతకులలో ఒకడిని నిర్బంధించారట. ఈ ఘనత గురించి గొప్పగా ప్రచారం జరుగుతోంది. ఇంతటి ఘనత కలిగిన బెల్జియం భద్రతా విభాగాలవారు, నాటో నిఘాలవారు ఈ భయంకర దుర్ఘటనను నిరోధించలేకపోవడమే విస్మయకరం. ఇన్ని నిండు ప్రాణాలు బలైపోవడం, రెండు వందలమంది క్షతగాత్రులు కావడం హృదయ విదారక విపరిణామం. సిరియాలో జరుగుతున్న సంఘర్షణకు సంకుల సమరానికి ప్రతీకారంగా ఐఎస్‌ఐఎస్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఐరోపా దేశాల్లో భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయన్నది కేవలం ప్రచారమేనన్నది ఇప్పుడు ధ్రువపడింది. జనసమ్మర్ధం గల రైల్వేస్టేషన్లను, బస్టాండ్‌లను, విమానాశ్రయాలను జిహాదీ హంతకులు ముట్టడిస్తారన్నది ఐరోపా దేశాలవారు స్పష్టంగా గ్రహించిన వ్యవహారం. రైలుస్టేషన్‌లోను,విమానాశ్రయంలోను భద్రతా కుడ్యానికి కన్నాలు పడివుండటం వాస్తవం. ఈకన్నాలగుండా బీభత్సకారులు మరోమారు చొరబడిపోయారు.
గత సంవత్సరం నవంబరు 14వ తేదీన జిహాదీ నరమృగాలు ఫ్రాన్స్‌పై విరుచుకు పడ్డాయి. వెంటనే బెల్జియం దేశమంతటా పెద్ద ఎత్తున గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్టు ప్రచారమైంది. బెల్జియం ప్రభుత్వం బ్రెస్సెల్స్‌లోని రైలు సర్వీసులను రద్దు చేసింది. మెట్రో రైలు స్టేషన్లను అనేక రోజులపాటు మూసివేసింది. వివిధ దేశాల మధ్య బ్రెస్సెల్స్‌లో జరుగవలసిన ఫుట్‌బాల్ క్రీడా స్పర్ధలను రద్దు చేసింది. జనం రైలుస్టేషన్లకు, బస్టాండ్‌లకు, విమానాశ్రయాలకు వెళ్లరాదని, ఇళ్లల్లోనే ఉండిపోవాలని బెల్జియం ప్రభుత్వం అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు వారం రోజులపాటు ఇలా జనజీవనాన్ని స్తంభింపజేయడం భద్రతను పెంపొందించడంలో భాగం. ‘‘అనేకమంది సాయుధులు పేలుడు పదార్థాలను ప్రయోగించి నగరం మధ్యలో ఒకేసారి అనేక చోట్ల పేలుళ్లు జరుపుతారన్న ప్రమాదం గురించి మేము చర్చిస్తున్నాము..’’అని అప్పట్లో బెల్జియం ప్రధా ని ఛార్లెస్ మిహాయిల్ ప్రకటించాడు. ఈ అప్రమత్తత క్రమంగా అంతరించిపోయింది. అప్పటినుంచి పొంచి ఉన్న జిహాదీ మృగాలు ఇప్పుడు దూకాయి. ఒకేసారి రెండు చోట్ల పేలుళ్లు జరుపగలిగాయి. ఈ పేలుళ్ల ధ్వనులు మనదేశంలో కూడ ప్రతిధ్వనిస్తుండడం ఐఎస్‌ఐఎస్ జిహాదీ ముఠావారి బీభత్స కలాపాల తీవ్రతకు, దుష్ప్రభావ విస్తృతికి నిదర్శనం. మనదేశంలోని అన్ని విమానాశ్రయాలలోను, భద్రతను అప్రమత్తం చేయడం దుష్ప్రభావం విస్తరిస్తోందనడానికి సాక్ష్యం. ఇలా అప్రమత్తం కావడం అనవసర భయం కాదు. మంగళవారం నాడు జెట్ విమాన సంస్థకు చెందిన ఒక గగనవాహనంలో బాంబులు పెట్టినట్టు ప్రచారమైంది. బుధవారం నాడు ఇండిగో సంస్థవారి విమానాన్ని న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక గంటలపాటు తనిఖీకి గురిచేయాల్సి వచ్చింది..
కనిపించే శత్రువుతో యుద్ధం చేయడం సులభం. కానీ ఐఎస్‌ఐఎస్ కనిపించని శత్రువు. అందువల్లనే ఐరోపా దేశాలు నెలల తరబడి ప్రయత్నించినప్పటికీ సిరియాలో ఐఎస్‌ఐఎస్ స్థావరాలను ధ్వంసం చేయలేకపోయాయి. గత ఏడాది సెప్టెంబర్ 30 నుంచి రష్యా సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. నెల తిరిగేలోగా ఐఎస్‌ఐఎస్ ప్రతీకారం తీర్చుకున్నది. రష్యావారి పౌరవిమానాన్ని ఈజిప్టులో పేల్చి కూల్చివేసింది. మొత్తం 224 మంది ప్రయాణికులు ఆహుతై పోయారు. గత సవంత్సరం సెప్టెంబర్ 27న ఫ్రాన్స్ వైమానిక దళాలు సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై దాడులు మొదలుపెట్టాయి. నవంబరు 14వ తేదీన దుండగులు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరుచోట్ల, ఐఎస్‌ఐఎస్ బాంబుపేలుళ్లకు పాల్పడింది. 129మంది బలయ్యారు, దాదాపు మూడువందల యాభైమంది క్షతగాత్రులయ్యారు. ఫ్రాన్స్ చరిత్రలోనే అదొక భయంకర బీభత్సకాండ. గత ఏడాది జనవరిలో కూడ జిహాదీలు పారిస్‌లో పేలుళ్లు జరిపారు. అయినప్పటికీ ఫ్రాన్స్ అప్రమత్తం కాలేకపోయింది. సిరియాలో తమపై దాడులు చేస్తున్నందువల్లనే తాము ఐరోపా దేశాలపై దాడులు చేస్తున్నామన్న ఐఎస్‌ఐఎస్ వాదం అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశించినది. ఎందుకంటే జిహాదీ బీభత్సకాండ స్వభావాత్మకమైంది, ప్రతిక్రియాత్మకమైనది కాదు. భారతదేశంలో ఐఎస్‌ఐఎస్ కలాపాలు విస్తరించడం ఇందుకు తిరుగులేని సాక్ష్యం. ఇరాక్‌లో ముప్పయి తొమ్మిది మంది భారతీయులను ఐఎస్‌ఐఎస్ అపహరించుకొని పోయింది. ఈ అపహరణ జరిగి ఏడాదిన్నర గడిచినా బంధితులకు విముక్తి లభించలేదు. మనదళాలు ఇరాక్‌కు గాని, సిరియాకు గాని వెళ్లి ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై దాడులు జరపలేదు. అయినప్పటికీ ఐఎస్‌ఐఎస్ వారు మనదేశానికి వ్యతిరేకంగా తమ కలాపాలను ఉధృతం చేస్తున్నారు. అందుల్ల జిహాదీ బీభత్సకాండ ప్రతిక్రియత్మకం కానేకాదు. ఇతర మతాలవారిని హత్య చేయడం శతాబ్దులుగా జిహాదీల సహజ స్వభావం..
ఐఎస్‌ఐఎస్‌ను ఇతర జిహాదీ సంస్థలను పాకిస్తాన్, కతార్, సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలు నడిపిస్తున్నాయన్న వాస్తవం నానాటికీ ప్రస్ఫుటిస్తోంది. అందువల్ల ఇలాంటి దేశాల ప్రభుత్వాలను బీభత్స వ్యవస్థలుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించగలగాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీన బ్రెస్సెల్స్‌కు వెడుతున్నారు. బీభత్స వ్యవస్థలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని సంఘటితం చేసే ప్రక్రియకు ఈ పర్యటన మరింత దోహదం చేయగలగాలి..