సబ్ ఫీచర్

లక్ష్యాన్ని చేరని గృహహింస చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబంలో భర్త, అత్తమామలు, ఆడపడుచులు ఇతర కుటుంబ సభ్యులద్వారా శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసలకు గురవుతున్న మహిళలు తమ బాధల విముక్తికోసం సివిల్‌చట్టం కింద విడాకులు, లేదా క్రిమినల్ చట్టంకింద ఐపిసి 498ఎ సెక్షన్‌ను ఆశ్రయించేవారు. గృహసింస నిరోధక చట్టం 2005 అమల్లోకి వచ్చాక భర్తనుండి విడిపోకుండా ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా అదే ఇంట్లో వుంటూ పిల్లలను చూసుకుంటూ తమపై ఎలాంటి శారీరక మానసిక ఆర్థిక లైంగిక హింసలేకుండా బతికే హక్కు స్ర్తిలకు వెసులుబాటు కలిగింది. కుటుంబ హింసనుండి రక్షణ కల్పిస్తుందీ గృహహింస నిరోధక చట్టం. కేవలం భార్యలకు మాత్రమేకాక కుటుంబంలోని కూతురు, చెల్లి, అక్క, వదిన, మరదలు, అత్త, కోడలు, మనుమరాలు వంటి స్ర్తిలు బాలికలు ఆ ఇంట్లో మగవారిచే ఎలాంటి హింసకు గురైనా రక్షించుకోడానికి ఈచట్టం అమూల్య అవకాశం కల్పిస్తుంది. ఇది సివిల్ చట్టం. సహాయం మరియు 60 రోజులు కాలపరిమితిలో మహిళలకీ చట్టం న్యాయం కల్పిస్తుంది. దశాబ్ద కాలంగా స్ర్తిల ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టమిది. కానీ ఆచరణలో లోపం వల్ల బాధిత మహిళలకు తగు న్యాయం చేయలేక గృహహింస నిరోధక చట్టం లక్ష్యాన్ని చేరుకోలేకపోయంది.
60రోజుల్లో తుది తీర్పు రావడం బాధిత మహిళలకు ఎంతో ఊరట. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరిగే శ్రమ వారికి ఉండకుండా ఓదార్పు. కుటుంబంలో జరిగిన శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక భావోద్రేక హింసలన్నిటినీ మొట్టమొదటిసారిగా ఈ చట్టం గుర్తించి అన్ని హింసలను నిర్వచించింది. కుటుంబ హింసను మానవహక్కుల ఉల్లంఘనగా ఈ చట్టం గుర్తించింది. అయతే ఈచట్టం గురించి అవగాహన లేని మహిళలు ఇంకా హింసలో మగ్గిపోతునే ఉన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు ఎంతటి విస్తృత ప్రచారం చేస్తారో దానికి పదింతలుగా క్షేత్రస్థాయినుండి వివిధ స్థాయిలలో దశలవారీగా ప్రచారం చేపట్టాల్సి వుంది. దీనికి అన్నిరకాలుగా మీడియా పూర్తి సహకారం తీసుకోవాలి.
గృహహింసపై ఫిర్యాదు చేసేదెలా? ఎవరికి ఫిర్యాదు చేయా లి? రక్షణాధికారి ఎవరు? ఎక్కడుంటారు? ఉచిత న్యాయం ఎలా పొందాలి? అన్నీ వివరించాలి. హింసనుండి వెలికి వచ్చి ఫిర్యాదు చేసే మహిళలకు అన్నిరకాలుగా అండగా నిలవాలి. షెల్టర్ హోమ్స్‌లో చేరే విధంగా అక్కడ వసతులు నివాస యోగ్యతలను పరిశీలించాలి. బాధిత మహిళలకు మానసిక స్థైర్యం ఇవ్వడానికి కౌన్సిలింగ్ సదుపాయం, న్యాయపోరాటానికి, ఉచిత న్యాయ సహాయం, అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు గుర్తించాలి. చట్టంలో పొందుపరచబడిన అన్ని అంశాలను, సౌకర్యాలను, ఉపశమనాలు గురించి పరిష్కారం గురించి పెద్దఎత్తున ప్రచా రం జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
క్రిమినల్ చట్టాల్లో కుటుంబ హింస ప్రస్తావన వుంది. కానీ సివిల్ చట్టాలలో ఈ ప్రస్తావన లేదు. అందుకే గృహహింస నిరోధానికి ప్రత్యేక సివిల్ చట్టం అవసరాన్ని, గృహహింస నిరోధక చట్టం 2005 తీర్చగలిగింది. క్రిమినల్ చట్టాలు (ఐపిసి సెక్షన్లు) ప్రతివాదులకు, శిక్షలు వేయించడానికే, ఉద్దేశించినవి. కానీ గృహహింస నిరోధక చట్టం 2005 మాత్రం మహిళలకు ఊరటనిచ్చేది..స్వాంతననిచ్చేది. ప్రతివాదులను శిక్షించడం ద్వారాకాక బాధిత మహిళను గృహహింసనుండి వెంటనే ఉపశమనం పొందేందుకు మాత్రమే గృహహింస నిరోధక చట్టం ఉద్దేశించబడింది. ప్రతివాది కోర్టు తీర్పును ఉల్లంఘించినపుడు మాత్రమే శిక్ష అవసరమవుతుంది. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్ల ను దండించడం కాకుండా బాధిత స్ర్తిలకు ఉపశమనం కల్పించడానికే ఈ చట్టం ఏర్పడింది. భర్త మాత్రమే కాదు అత్తింటివారే గాక పుట్టింటి మగవారు కొడుకుతో సహా జరిపే హింస ఎటువంటిదైనా మహిళలకీ చట్టం రక్షణ కల్పించడానికే ఏర్పాటైంది. హింస జరిగిన చోటినుండే బాధిత మహిళలు రక్షణకై పోరాడే అవకాశం కల్పించిన చట్టమిది. మేజిస్ట్రేటు హింసకు కారకుడైన వ్యక్తికి హింస లేకుండా ఆయా స్ర్తిలను సరిగా చూచుకోమని హెచ్చరిక చేస్తారు. ఆ ఉత్తర్వులు అమలు చేయనపుడు ఉత్తరువుల ధిక్కారాన్ని, నేరంగా పరిగణించి శిక్షించే అధికారం ఈ చట్టం కల్పించింది. నొప్పి, హాని, గాయం చేయడం, ప్రాణహాని తలపెట్టడం, తన్నడం, నెట్టడం వంటివి శారీరక హింస, బలవంతంగా సంభోగం, ఇష్టం లేకుండా లైంగిక సంబంధానికి బలవంతం చేయడం, గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్య లైంగిక హింస! అవమాన కరంగా మాట్లాడడం, హేళన చేయడం, చిన్నబుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగబిడ్డను కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసిస్తానని బెదిరించడం, ఆమె మనసును నొప్పి స్తూ క్షోభ పెట్టడం మానసిక హింస కిందకు వస్తాయి.కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకు ఇవ్వకపోవడం, చట్టప్రకారం పొందివున్న ఆర్థిక హక్కు మీద దౌర్జన్యం చేయడం ఆమెకు చెందిన నగలు, నగదు, వనరులు, స్ర్తి ధనం ఆమెకు దక్కనీయకుండా చేయడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటినుండి గెంటివేయడం, ఆమె ఆదాయాన్ని లాక్కోవడం, అదనపు కట్నం తెమ్మని వేదించడం అన్నీ ఆర్థిక హింసే! మగవారి ద్వారా ఆ కుటుంబంలో మహిళలకు జరిగిన ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా గృహహింస అవుతుంది.
గృహహింస బాధితుల రక్షణకు, చట్టం సక్రమ అమలుకు రక్షణాధికారులు ముఖ్య పాత్ర పోషిస్తారు. బాధితులను రక్షిస్తారు కనుక వీరు రక్షణాధికారులు. స్ర్తి శిశుసంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్లను రక్షణాధికారులుగా ఏర్పాటు చేసారు. బాధితురాలికి తప్పనిసరిగా చట్టపరమైన సహాయం ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల కస్టడీ ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సదుపాయం గురించి, ఇతర సేవల గురించి సమాచారం పొందే హక్కుంది. ఈ సమాచారాలన్నింటినీ ప్రా జెక్టు/ప్రొటెక్షన్ ఆఫీసర్ బాధితురాలికి ఇవ్వాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తేనే గృహహింస నిరోధక చట్టం లక్ష్య శుద్ధి సాధించగలదు. నోటిమాట ద్వారా లేక రాతపూర్వకంగా బాధితురాలు లేక ఆమె తరఫున ఏ వ్యక్తులైనా ఫోన్‌ద్వారా నైనా సమాచారాన్ని రక్షణాధికారికి అందిస్తే రక్షణాధికారి పోలీసుల సాయంతో సంఘటనా స్థలానికి వెళ్లి నివేదిక తయారుచేసి తగిన ఆదేశాల కోసం వెంటనే మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేయాలి. మేజిస్ట్రేటు కేసు విచారణకు నిర్దేశించిన తేదీని తెలుపుతూ వాది/ప్రతివాదులకు 3రోజులు లేదా మేజిస్ట్రేట్ చెప్పిన వ్యవధిలో నోటీసులు అందేలా చూడాల్సిన బాధ్యత రక్షణాధికారిదే! దీనికి సంబంధించిన ధృవీకరణ కోర్టుకు చూపాలి. బాధితులుండే ఇంటిని రక్షణాధికారి సందర్శించి విచారణ జరిపి, బాధితురాలికి చెందిన వస్తువులు, నగలు ఆమె/వారికి ఇప్పించాలి. ఇది మేజిస్ట్రేటు ఆదేశం ప్రకారం జరుగుతుంది. అలాగే పిల్లల కస్టడీ నివాస హక్కు, ఆర్థిక ఉపశమనం వంటి ఉత్తర్వులను రక్షణాధికారి అమలు చేయాలి. కాబట్టి గృహహింస నిరోధక చట్టం అమలులో రక్షణాధికారుల పాత్ర చాలా విశిష్టమైంది.
కానీ 15 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా స్ర్తిల సంఘాలు సాధించి తెచ్చుకున్న ఈ గృహహింస నిరోధక చట్టం 2005 అమలులో రక్షణాధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి కాలయాపనల వల్ల ఈకేసులలో బాధితులు మరింతగా బాధించబడుతున్నారు. 60రోజుల్లో వెలువడాల్సిన తీర్పు 2,3 సంవత్సరాలైనా వెలువడక బాధితులు కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తున్నది. ఫామిలీ కౌన్సిలర్లను అనుభవజ్ఞులను నియమించి 2,3 కౌన్సిలింగ్‌లలో దారికి రాని కేసులను మేజిస్ట్రేటు ఈ చట్టం తుదితీర్పు 60రోజుల్లో వెలువరించాలని గ్రహించినపుడే ఈ చట్టంవల్ల బాధితులు ప్రయోజనం పొందగలుగుతారు.

- చాకలకొండ శారద