ఉత్తరాయణం

విజ్ఞత పాటించని ఎంఐఎం నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఎంఐఎం నేత ఒవైసీ మెడపై కత్తిపెట్టినా భారత్‌మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించడం కడు విచారకరం. ఆయన మెడపై కత్తిపెట్టి ఆ మాటలు అనమని చెప్పేవారు ఎవ్వరూ ఇక్కడ లేరని ఒవైసీ గుర్తించడం మంచిది. ముందుగా ఆయన భారతీయ పౌరుడా లేక మరే ఇతర దేశ పౌరుడా వ్యాఖ్యానించాలి. ఈ దేశంలో లౌకిక వాదం ఉన్నంతకాలం ఇటువంటి ప్రకటనలనకు స్వేచ్ఛ ఉంటుందని ఆయన మననం చేసుకోవాలి. ఈ దేశంలో కొన్ని శతాబ్దాలుగా హిందువులు, మస్లింలు తర తమ భేదాలు మరిచి ఐక్యతతో మెలగడం ఒవైసీకి తెలియదా? పైపెచ్చు రాజ్యాంగంలో భారత్ మాతాకీ జై అని అనాలని ఎక్కడా లేదని వ్యాఖ్యానించడం ఆయన అవివేకతనాన్ని తెలియజేస్తుంది.
రాజ్యాంగంలో ఎక్కడా చికెన్ బిర్యానీ తినాలని గానీ సాంబారు తాగాలని కాని రాయకపోవడంపై ఆనాటి రాజ్యాంగ పరిషత్తులవారిని ఏమనాలో మాన్యులు ఒవైసీ తెలపాలి. ఎంపీగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదు. పైపెచ్చు ఇటువంటి వ్యాఖ్యానాలు హిందు ముస్లింల ఐక్యతకు విఘాతకాలే. ఈ గాలి నీరు తాగేవారు ఈ దేశానికి భక్తి భావంతో కృతజ్ఞతా భావంతో మెలగాలి కానీ కృతఘ్నలుగా వుండకూడదు.
-కొలుసు శోభనాచలం, గరికపర్రు
దిగజారిన చదువులు
ఫీజు వాపసు పథకం నుంచి సొమ్ము చేసుకోడానికి బోలెడు ఇంజినీరింగ్ కాలేజీలు వెలిశాయ. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే అక్కడ చదివిన వాళ్లని ఇంటర్వ్యూలకు కూడా పిలవడం లేదు. ఐటి కంపెనీలు గతంలో వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివిన వారిపై రాడికల్స్ అనే ముద్రపడి ఉద్యోగాలిచ్చే వారు కాదు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, జెఎన్‌యూ విద్యార్థులు ఆ ఖ్యాతిపొందుతున్నారు. వామపక్షాలు, జీహాదీలు, కాంగ్రెస్ వారి పుణ్యమాని వాళ్లకు ఉద్యోగాలు దొరక్కపోవచ్చు. అందుకే ప్రయివేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలన్న స్లోగన్ అందుకున్నారు. అదే జరిగితే కంపెనీలన్నీ విదేశాలకు పోయే ప్రమాదముంది.
- సత్య, కరప
జనాభాలెక్కలు సేకరించాలి
తెలంగాణ ప్రాంతంలో సర్వే సెటిల్‌మెంటుతో జనాభా లెక్కను ఈ దిగువనుదహరించిన విషయ సేకరణతో జరిపినట్లయతే ప్రభుత్వ పరిపాలన సులభమవుతుంది. 1. ఇంటి పేరు, పేరు, 2. తండ్రి, భర్త, భార్య పేరు, 3.వయస్సు 4. చరాస్థి వివరములు 5. స్థిరాస్థి వివరములు, గ్రామం పేరు. 6. చదువు, 7.వృత్తి, 8. కులము 9. ఆదాయము 10. జిల్లా పేరు, 11. ఈ వివరాలను సేకరించి ఒక ప్రతిని ఓటరునకు ఇచ్చి మరొక ప్రతిని ప్రభుత్వం వద్ద భద్రపరచుకోవాలి. సదరు వివరాలు భవష్యత్తులో ప్రభుత్వానికి మరియు వ్యక్తులకు ఎంతో ఉపయోగపడతాయ.
- సామినేని ప్రకాశరావు, హైద్రాబాదు
విద్యావిధానాన్ని ప్రక్షాళన చేయాలి
పాశ్చాత్య సంస్కృతి, నాగరికత మన భారతీయ సమాజంపై ముప్పేట దాడి చేస్తున్న తరుణంలో విలువలతో కూడిన విద్యను అందిస్తూ, విద్యార్థులలో క్రమశిక్షణ, నైతికత, నిజాయితీ వంటి అత్యున్నత విలువల పెంపొందిస్తున్న సత్యసాయి విద్యాసంస్థలను ప్రతీ గ్రామంలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత వుంది. మానవతా విలువలు విద్యలో భాగంగా వుండాలన్న సత్యసాయి విద్యాసంస్థల సదాశయం గర్వించదగినవి. క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి, ఆధ్యాత్మికత, యోగాశక్తి ప్రధానాంశాలుగా విద్యాబోధన చేస్తున్న ఈ విద్యాసంస్థల అవిశ్రాంత కృషి ప్రశంసనీయం. ఇదే విధంగా మరిన్ని విద్యాసంస్థలను ప్రారంభించడంతోపాటు కనీసం రాష్ట్ర స్థాయిలో ప్రాథమిక విద్యను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుంది. విలువలు లేని చదువు కారణంగానే సమాజంలో అశాంతి, ఆందోళన ఎక్కువౌతున్నాయన్న విషయం అందరూ గ్రహించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
విజయవాడపై నిర్లక్ష్యమేల?
ఆంధ్ర రాజధానిని పచ్చని పంటచేలల్లో ఏర్పాటు చేశారు. ఇక రైల్వేజోన్ విషయంలో విశాఖపట్టణం జోన్ కావాలని కోరుతున్నారు. నిజానికి విశాఖలో ఉన్న పరిశ్రమలు ఆంధ్రలోని ఏ నగరంలో లేవు. అందువల్ల విజయవాడ జోన్‌కోసం యత్నించాలి. విజయవాడ విమా నాశ్రయాన్ని మరింత అభివృద్ధి పరచాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ సాంస్కృతిక రాజధానిగా వెలుగొం దింది. అటువంటి ఈ నగరానికి తగిన ప్రాధాన్య తనివ్వాలి.
- బి.ఎస్. నారాయణ,విజయవాడ