సంపాదకీయం

‘ఉత్తర’ సంక్షోభం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరఖండ్ ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం బుధవారం జారీ చేసిన తాత్కాలిక ఆదేశం ఒక అనిశ్చిత స్థితిని తొలగించింది, మరో అనిశ్చిత స్థితిని సృష్టించింది! ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఈ వైచిత్రి కొనసాగనుండడం ఊపిరాడని ఉత్కంఠకు ప్రాతిపదిక...శాసనసభల చరిత్రలో అపూర్వమైన అద్భుతాన్ని ఉత్తరఖండ్ ఉన్నత న్యాయమూర్తి యు.సి.్ధ్యని మంగళవారం నాడు ఆవిష్కరించడం రాజ్యాంగ నిపుణులను సైతం గందరగోళానికి గురి చేసిన విపరిణామం! న్యాయమూర్తి ధ్యాని ఉత్తరువును ఉన్నత న్యాయస్థానానికి చెందిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తాత్కాలికంగా నిలిపివేయడం గందరగోళానికి గురి అయిన వారికి కొంత ఉపశమనం కలిగిస్తున్న వ్యవహారం! కానీ ఈ ఘటనాక్రమం ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదు. సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం అనివార్యమన్నది నిరాకరించజాలని నిజం! ఈ అనివార్యం ఏప్రిల్ ఐదవ తేదీ తరువాత ఏర్పడనుందా? ముందుగానే సంభవిస్తుందా? అన్న అనిశ్చిత స్థితి ఉత్కంఠను మరింతగా పెంచుతోంది! ఏమయినప్పటికీ ఉత్తరఖండ్‌లో రాష్టప్రతి పాలన కొనసాగుతుందా? తొలగిపోతుందా? అన్నవి ప్రశ్నలు గానే మిగిలి ఉన్నాయి! రాజకీయమైన సంక్షోభం, పరిపాలనా పరమైన సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం, ప్రజాస్వామ్య సంక్షోభం అన్న పదజాలం విస్తృత ప్రచారానికి గురి అవుతుండడం ఉత్తరఖండ్ నాటకంలో ప్రస్తుత ఘట్టం! హరీశ్ రావత్ ముఖ్యమంత్రిత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తొమ్మిదిమంది సభ్యులు మార్చి నెల 18న మద్దతును ఉపసంహరించుకొనడంతో ఈ నాటకం మొదలైంది! అప్పటి నుంచి బుధవారం సాయంత్రం హైకోర్టు ధర్మాసనం వారు శాసనసభలో బలపరీక్షను వాయి దా వేసే వరకూ రకరకాలుగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిపోవడం నాటకంలోని విచిత్ర రసావిష్కరణ. రాజ్యాంగ నియమావళి ఉల్లంఘనకు గురికాకుండా నిరోధించవలసిన ఉన్నత న్యాయమూర్తి ఒకరు స్వయంగా రాజ్యాంగ ప్రక్రియను ఊపిరాడని స్థితికి గురి చేయడం వైచిత్రికి పరాకాష్ట! చట్టసభలలో సభ్యుల అనర్హతను ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు గతంలో కూడ చర్చించాయి, తీర్పులిచ్చాయి, రాష్టప్రతి పాలన విధింపును, శాసనసభల రద్దును సమీక్షించాయి. శాసనసభలలో బలపరీక్షలకు ఆదేశించాయి. అందువల్ల చట్టసభల వ్యవహారాలలో న్యాయ వ్యవస్థ ప్రమేయం ఇప్పుడు ధ్రువపడిన రాజ్యాంగ సంప్రదాయం! కానీ న్యాయమూర్తి యు.సి.్ధ్యని ఇచ్చిన విచిత్ర రీతిలో ఇంతవరకూ న్యాయ నిర్ణయాలు వెలువడకపోవడం చరిత్ర...
న్యాయమూర్తి ధ్యాని మంగళవారంనాటి తీర్పు ద్వారా విస్మయకరమైన విపరీత స్థితిని సృష్టించారు! మార్చి 28న కేంద్ర ప్రభుత్వం ఉత్తరఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను ఆయన రద్దు చేయలేదు. కానీ రాష్టప్రతి పాలన ఫలితంగా రద్దయిన ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ప్రభుత్వానికి శాసన సభలో మద్దతు ఉన్నదీ లేనిదీ మార్చి 31న నిర్ధారణ జరగాలని ఆయన ఆదేశించారు! ముఖ్యమంత్రి లేనప్పుడు సభ విశ్వాసాన్ని ఎవరు కోరాలి? రాష్టప్రతి పాలనను రద్దుచేసి రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండినట్టయితే ధ్యాని చర్యకు కొంత రాజ్యాంగ నిబద్ధత ఏర్పడి ఉండేది. ఎందుకంటే రాష్టప్రతి పాలన విధింపును సమీక్షించే అధికారం ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలకు ఉంది...ఉందని సర్వోన్నత న్యాయస్థానం గతంలో 1994లో తీర్పు చెప్పి ఉంది! కానీ ధ్యాని ఈ సమీక్షను తార్కికంగా ముగించకుండా శాసనసభలో బలపరీక్షకు ఆదేశించారు. హైకోర్టు ధర్మాసనం ఈ విచిత్ర ఆదేశాన్ని బుధవారం నిలిపివేసింది, లేనట్టయితే గురువారం సభకు సంబంధించి మరింత గందరగోళం ఏర్పడి ఉండేది. తాత్కాలికంగా పనిచేయని శాసనసభ ఎలా సమావేశం అవుతుంది? సమావేశం జరగాలంటే రాష్టప్రతి పాలన రద్దు కావాలి! న్యాయమూర్తి ధ్యాని ఇలా గుర్రం కంటె ముందు బండిని నిలబెట్టడం ద్వారా వినూతన రాజ్యాంగ సంక్షోభానికి శ్రీకారం చుట్టాడు.
హైకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరుగా ఇస్తున్న తీర్పులను విస్తృత ధర్మాసనాలు సమీక్షించడం న్యాయబద్ధమైన రాజ్యాంగ ప్రక్రియ కావచ్చు! కానీ న్యాయమూర్తులు ఒకే రాజ్యాంగ అంశంపై పరస్పరం ఇలా విభేదిస్తుండడం ఇటీవలి కాలంలో తరచు సంభవిస్తోంది. అందువల్ల సమీక్షకు గురి అయి రద్దయిన తీర్పులను ఇచ్చిన న్యాయమూర్తులు తీవ్రమైన పొరపాట్లు చేసినట్టు భావించడం అతార్కికం కాదు. రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా లేవా? లేక న్యాయమూర్తుల అవగాహనలో స్పష్టత లోపిస్తోందా? చట్టసభల అధికార పరిధిలోకి, కార్యనిర్వాహక శాఖ మంత్రివర్గం వారి పాలనా పరిధిలోకి న్యాయస్థానాలు చొచ్చుకొని వస్తున్నాయన్నది రాజకీయవేత్తలు పదే పదే చేస్తున్న ఆరోపణ. కానీ రాజకీయ వేత్తలది ఈ విషయంలో రెండు నాలుకల ధోరణి అన్నది చరిత్ర ధ్రువపరిచిన వాస్తవం! తీర్పులు తమకు అనుకూలంగా ఉన్న సందర్భాలలో రాజకీయ వేత్తలు న్యాయస్థానం తీర్పు శిరోధార్యం...అని న్యాయ విధేయతను ప్రకటిస్తున్నారు. తీర్పులు తమ కు వ్యతిరేకంగా ఉన్న సమయంలో మాత్రం చట్టసభలదే సర్వాధికారం, చట్టసభల నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదు.. అక్రమ ప్రమేయం వద్దు! అని ఘోషిస్తున్నారు. రాజకీయ అవకాశ వాదపు అధికార విన్యాసాలు ఎలా ఉన్నప్పటికీ శాసననిర్మాణం న్యాయ వ్యవస్థ సమీక్షాధికారం నిరంతరం విస్తరిస్తున్న మాట నిజం. రాజ్యాంగపు 356వ అధికరణం ప్రకారం రాష్టప్రతి పాలనను సమీక్షించరాదన్నది 1990వ దశకానికి పూర్వం ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు చేసిన నిర్ధారణ! అందువల్ల రాష్టప్రతి పాలనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానాలు విచారణకు సైతం స్వీకరించకపోవడం చరిత్ర! ఆ తరువాత ఘట్టంలో పిటిషన్‌లను విచారించినప్పటికీ తోసిపుచ్చడం న్యాయ సంప్రదాయమైంది, క్రమంగా సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాలు రాష్టప్రతి పాలనను శాసనసభల రద్దును సమీక్షించడం ఆరంభమైంది!
బాబరీ కట్టడం కూలిపోయిన నేపథ్యంలో 1992లో కేంద్ర ప్రభుత్వం నాలుగు ఉత్తరాది రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి రాష్టప్రతి పాలనను విధించింది. ఈ రద్దు రాజ్యాంగ విరుద్ధమని ఆ తరువాత ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం శాసనసభలను మాత్రం పునరుద్ధరించలేదు! కర్నాటకలో అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మయ్ మంత్రివర్గం రద్దయిన సందర్భంలో, 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ పండితులు పదేపదే పూర్వనిర్ధారణ-ప్రిసీడెంట్‌గా ఉటంకిస్తున్నారు. గతంలో 2005లో ఝార్ఖండ్ శాసనసభలో సంయుక్త బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శిబూ సోరన్, అర్జున్ ముండా-వీరిద్దరిలో ఎవరికి సభలో బలం ఉందన్నది నిర్ధారించడానికి ఈ పరీక్ష...! ఈ న్యాయ ప్రమేయం గురించి నిర్ద్వంద్వమైన నిర్ధారణ ఇప్పుడైనా జరగడం మేలు. ఈ విషయమై రాజ్యాంగంలోని 143వ అధికరణం ప్రకారం రాష్టప్రతి సర్వోన్నత న్యాయస్థానం వారి సలహాను కోరాలి!