ఉత్తరాయణం

అసహనం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య భావ ప్రకటనా స్వేచ్ఛపై వాదోపవాదాలు చాలా జరుగుతున్నాయ. ప్రభుత్వంలో ఉన్న పార్టీవారు అసహనంతో ఉన్నారంటూ నిందిస్తున్నారు. ఈమధ్య కన్నయ్యకుమార్ సభలో ఒక యువకుడు భారత్ మాతా కీ జై అని నినదించినందుకు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. అంటే అసహనం ఎవరికి ఉన్నదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది తమకుమాత్రమే ఉన్నదని, ఉండాలని సోకాల్డ్ ఉద్యమ కారులు భావించడం సరైనది కాదు. భారత్ మాతా కీ జై అన్న వ్యక్తిమీద దాడి చేయడం దారుణం. బాధ్యతా యుతమైన పౌరులంతా దీన్ని ఖండించాలి.
- ఎల్లంకి హనుమంత రావు, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా
ట్రాఫిక్ ఇబ్బందులు
అసలే మండుడున్న ఎండలు...కాలు బయట పెట్టా లంటే భయం. దానికి తోడు నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్. భాగ్యనగరమంటే బిజీ, బిజీ..ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఇక్కడ జీవితం. లేదంటే అంతే. అలాంటి బిజీ నగరంలో ఓవైపు మెట్రోపనులు, మరోవైపు, డ్రైనేజీ, కేబుల్, విద్యుత్ శాఖవారి రోడ్ల తవ్వకాలు..ఉదయం లేచింది మొదలు సగం జీవితం ట్రాఫిక్‌లోనే గడచి పోతున్నది. దీనికి అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయం కనుక్కోవాలి. లేదంటే ముందు ముందు ప్రజలకు తిప్పలు తప్పవు. ఓ వైపు పెరుగుతున్న కాలు ష్యం, మరోవైపు పేరుకుపోతున్న చెత్తా చెదారం, రోగాల బారిన పడుతున్న జనం జీవనం దుర్భరం కాకముందే... ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి. మన పరిసరాలను మనే శుభ్రంగా వుంచు కోవాలి. మన సమస్యలను మనమే పరిష్కరిం చుకోవాలి. లేదంటే తప్పదు భారీ మూల్యం.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
నీచ రాజకీయాలు తగదు
‘‘కోసిన ముక్కులు కనిపిస్తాయ కానీ, కూసిన కూతలు వినబడవు’’ అని ఒక సామెత. హెచ్‌సియులో ఇటీవల విద్యార్థుల, అధ్యాపకుల అరెస్టులపై ‘అమ్నెస్టీ ఇంటర్నే షల్ శాఖ’ ప్రకటనలు, ఉద్యమం పేర దాడులు, ముట్ట డాలు, విధ్వంసం సృష్టించిన విద్యార్థి బృందాలకు మద్ద తుగా సానుభూతిగా, ‘జీవన్మృత పార్టీ’ నేతల బృందం కారాగారానికి చేరడం నేటి రాజకీయాలు ఎంత నైత్యానికి దిగజారాయో, పబ్బం గడుపు కొందుకు ఎంత నీచరాజకీయ ఎత్తుగడలు పన్నుతున్నామో, మేధావులం అనుకునే వారెంత అనాలోచిత నిర్ణయాలకు ప్రాధాన్యత నిస్తారో అనేందుకు అద్దం పట్టడం సిగ్గుచేటైన విషయం.
మనమంతా భారతీయులం. భరతమాత ముద్దు బిడ్డలం, మాతల్లికి వందనం, మా భరత మాతకు జయం అనుకోవడంలో, అనడంలో దోషమేముంది? ఇది నేర మా? కన్నతల్లిని గౌరవించడం నేర్పవలసిన పెద్ద మనుషులు, అగౌరవ పరచేందుకు సిద్ధపడే ఆకతాయల కు వత్తాసు పలకడం ఎంత నైత్య రాజకీయం? విశ్వవిద్యా లయ ప్రాంగణంపై దాడిచేసి, విధ్వంసం సృష్టించిన నేరగాళ్ల ముఠా రౌడీ చర్యలు, అమ్నెస్టీలకీ, అమృత పారీట పెద్దలకీ కనబడదా? నేరస్థులకి సహకారమం దిస్తా మనే వాళ్లని మేధావులుగా, నేతలుగా మనం అంగీకరిం చాలా?
బ్రాహ్మణవాదం, హిందూ ఫాసిజం అని నెత్తీ నోరూ పగిలేలా మొత్తుకునే ఈ అభ్యుదయ వాదులకు ప్రపంచాన్నంతా కలవరపెడుతున్న ఇస్లాం మత ఉగ్రవాదం, కనబడటం లేదా? కవ్విస్తున్న తీవ్రవాదం కనులకానడం లేదా? వీళ్లసలు సిసలైన నిజయతీగల మేధావులు, రాకీయ నేతలు అయతే తమ శక్తిని ఈ నేరగాళ్ళను, సంస్కరించేందుకు ధారపోయాలి. కుయు క్తులు కుహకాలు, వ్యర్థ నిందారోపణలతో పాలక పక్షాన్ని పడదోసే నీచ పద్ధతులు విడనాడాలి.
- దినకర్, హైదరాబాద్
గ్యాస్ సబ్సిడీ దుర్వినియోగం
ధనవంతులందరూ ఎల్.పి.జి సబ్సిడీని వదులుకోవాలంటూ కేంద్ర మంత్రులు ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నారు. ఈ ఆదాయం వంటగ్యాస్ సబ్సిడీ పొందలేని నిరుపేద కుటుంబాలకు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే దేశంలో లక్షలాది అక్రమ గ్యాస్ కనెక్షన్లు వున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ జాయింట్లు అక్రమంగా సబ్సిడీ గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. అనుమతి లేకుండా కార్లు, ఆటోలలో ఎల్.పి.జి. కన్వర్షన్ కిట్‌లను ఉపయోగిస్తున్నారు. వీరందరిపై కూడా ప్రభుత్వం కొరడా ఝుళిపించాలి. అట్లే వాహనాలలో ఉపయోగించే డీజిల్ కంటె కమర్షియల్ అవసరాలు అంటే ఫంక్షన్లు, సభలు, జెనరేటర్లకోసం వాడే డీజిల్ ధర ఎక్కువగా విధించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టగలిగితే ఫలితం వుంటుంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి