సంపాదకీయం

‘నల్ల’ కోటకు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు ఘరానాలు వ్యూహాత్మక వౌనం పాటిస్తున్నారు, మరికొందరు ప్రముఖులు పొంతన కుదరని వివరణలు ఇచ్చుకుంటున్నారు. విస్ఫోటన ప్రకటంపనల తాకిడికి దిమ్మదిరిగిన వారు చేష్టలుడిగి పడి ఉన్నారు. కొందరు మాత్రం తేరుకొని నంగి నంగిగా మాట్లాడుతూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలలో నిక్షిప్తమై ఉన్న నల్లడబ్బు పుట్టలు వికృత ధ్వనులతో పగిలిపోతుందడడం ఈ విస్ఫోటనం. పనామా దేశం దక్షిణ అమెరికాకు ఉత్తర అమెరికాకు మధ్య నెలకొని ఉన్న చిన్నదేశం. ఈ దేశంలోని మోసక్ పోన్‌సెకా అన్న న్యాయ వ్యవహారాల వాణిజ్య సంస్థవారు ఈ విస్ఫోటనాన్ని రగిలించారు. ప్రపంచంలోని వేలాది మంది పెద్దలు అక్రమంగా విదేశాలలో దాచిన డబ్బు గురించి ఈ సంస్థవారు బయటపెట్టేశారట. ఈ గుట్టు వివిధ మాధ్యమాల ద్వారా సంస్థల ద్వారా విస్తరించి సోమ మంగళ వారాల్లో భయంకరమైన రట్టుగా మారిపోయింది. అందువల్ల నల్లడబ్బు దాచిన వారికి నిద్దరలు పట్టకపోవడం అత్యంత సహజం. పేర్లు బయటవారు కొందరు ఖండించాలన్న ధ్యాస కూడ లేక లోలోపల మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ‘‘మేము విదేశాలలోనూ డబ్బు పెట్టుబడి పెట్టి ఉన్నాము. చట్టాలలోని నియమావళి ప్రకారమే ఇలా నిధులను విదేశాలకు తరలించి పారిశ్రామిక కలాపాలను నిర్వహిస్తున్నాము..’’ అని నంగి నంగిగా సమర్థించుకుంటున్నారట. ఇలాంటి నల్లడబ్బు ఘరానాలు మనదేశంలో కూడ ఐదువందల మంది దాకా ఉన్నట్టు వెంటనే రట్టయిన గుట్టు...ఇంకా ఎంతమంది ఉన్నారో మరి. బయట పడిన పదిహేను లక్షల దస్త్రాలలోని వివరాలన్నీ వెంటనే ప్రచారం కావు...అందువల్ల సమయం గడిచే కొద్దీ మనదేశానికి చెందిన నల్లడబ్బు తరలించిన వారి సంఖ్య వేలకు విస్తరించినట్టయితే ఆశ్చర్యం అక్కరలేదు..ఇలా విదేశాలలో నల్లడబ్బు దాచిన వారిలో ఆరువేల ఐదువందల కోట్ల రూపాయల కంటె ఎక్కువ ఆస్తి ఉన్నవారు ఇరవై తొమ్మిది మంది మాత్రమే నన్నది కూడ బహుశా ప్రాథమిక అంచనా కావచ్చు. మనదేశపు వార్షిక ఆదాయ వ్యయం దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు...పనామా సంస్థ వెల్లడించిన ప్రాథమిక వివరాలవల్ల వివిధ దేశాలలో పదిహేను వందల యాబయి లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు నక్కి ఉంది. అంటే ఇలా ఇప్పుడు రట్టయిన నల్లడబ్బు విలువ మన వార్షిక వ్యయం కంటె దాదాపు డెబ్బయి ఎనిమిది రెట్లు ఎక్కువ. అంటే ఈ నల్ల నిధుల విలువ మన డెబ్బయి ఎనిమిది వార్షిక వ్యయాల మొత్తానికి సమానం. ఇది కాక ఇంకా ఎన్ని లక్షల కోట్లు నల్లడబ్బు ఇప్పటికీ బయటపడకుండా నక్కి ఉందో..’’ బహుశా అన్ని దేశాల వారికీ మిగిలిన అన్ని దేశాల లోను నల్లడబ్బు ఉండవచ్చు. బ్యాంకులలోను సంస్థలలోను పెట్టుబడుల రూపంలోను ఇంకా వివిధ రూపాలలో కూడ ఈ డబ్బంతా సురక్షితంగా ఉంది. ప్రపంచీకరణ ఇలా అవినీతిని పెంచిందన్నది మరోసారి ధ్రువపడింది. 1977 నుంచి నల్లడబ్బు వివిధ దేశాల నుంచి విదేశాలకు తరలిపోయిందట.
ఇంతటి బృహత్ అవినీతి సామ్రాజ్యం నలబయి ఏళ్లపాటు అజ్ఞాతంగా మనగలగడమే దిగ్భ్రాంతికరమైన వాస్తవం. వివిధ దేశాల నిఘా విభాగాలు, ప్రభుత్వాలు కనిపెట్టలేకపోయాయా? కనిపెట్టగలిగి ఉండీ పట్టించుకోలేదా? ప్రపంచీకరణ మొదలుకాక పూర్వం రాజకీయవేత్తలు ప్రధానంగా ప్రభుత్వాల నిర్వాహకులు ఇలా పట్టించుకొనకపోవడానికి కారకులు. ప్రపంచీకరణ తరువాత వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాలను నియంత్రిస్తున్నారు, నిర్దేశించగలుగుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు, నేరస్థులు, దేశద్రోహులు సైతం రాజకీయ జీవుల రూపం ఎత్తి ఉండడం ప్రపంచీకరణ వికృతులకు పరాకాష్ఠ. అందువల్ల నల్లడబ్బును వెలికి తీయడానికి నిఘా విభాగాలు పూనుకోలేదన్నది స్పష్టం. మనదేశంలో సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం నల్లడబ్బు వెలికితీతకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కానీ అనేక దేశాలలో ప్రభుత్వాలు నల్లడబ్బును పసికట్టడానికి ప్రయత్నించలేదని ఈ స్వచ్ఛంద ఆవిష్కరణ వల్ల స్పష్టమైంది. ఇప్పుడు అవినీతి పుట్టలోనుంచి నల్లడబ్బు కీటకాలు అతి వికృతంగా బయటికి దూసుకు వస్తుండడానికి కారణం ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వేతర సంస్థల కృషి మాత్రమే.
ఈ పనామా న్యాయ వ్యవహారాల సంస్థకు ఈ కోటి పైచిలుకు పత్రాలు, దస్త్రాలు ఎలా లభించాయన్నది మాత్రం వెల్లడి కావడం లేదు. నలబయి రెండు దేశాలలో ఈ సంస్థకు అనుబంధ కార్యాలయాలు, పరిశోధనా విభాగాలు ఉన్నాయట. ఏమయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో దస్త్రాల జాడను ఈ సంస్థ పసికట్టడం పరమాద్భుతం... ఈ సంస్థవారు ఈ దస్త్రాలను జర్మనీలోని ఒక వార్తాపత్రికకు వెల్లడించారట. ఆ పత్రికవారు, వివిధ దేశాలకు చెందిన పరిశోధన పత్రికా ప్రతినిధులకు ఈ దస్త్రాలను పంపించారట. ఈ ‘అంతర్జాతీయ పరిశోధక పత్రికా ప్రతినిధుల సమాఖ్య’- ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ -ఐసిఐజె- వారు ఈ దస్త్రాలను అధ్యయనం చేసి రహస్యాల చిట్టాను ఆవిష్కరించారు. అయితే ఈ న్యాయవ్యవహారాల పనామా సంస్థకు ఈ దస్త్రాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి? నల్లడబ్బు దాచిన వారందరూ ఈ సంస్థ ద్వారా న్యాయసేవలను పొందారా? ప్రపం చ ప్రయోజనాల దృష్ట్యా ఈ సంస్థ తన వినియోగదారుల అక్రమాలను బయటకు పొక్కనిచ్చిందా? అలా అయితే ఇన్ని దశాబ్దుల పాటు ఈ పనామా సంస్థ ఎందుకని ఈ గుట్టు రట్టు చేయలేదు? ఫోన్‌సెకా సంస్థ వద్ద ఉన్న సమాచారం మీకు ప్రసారం చేస్తాను- అని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు జర్మనీ పత్రిక ‘సూడెశ్చ్ ఝీటుంగ్’ వారికి తెలియజేశాడట. తన ఆచూకీని మాత్రం బయటకు పొక్కనివ్వరాదని, అలా పొక్కినట్టయితే తనకు ప్రాణాపాయమని, ఆ ‘అజ్ఞాత సహాయకుడు’ లేదా ‘సహాయక’ పత్రిక వారిని కోరడం ఈ సాహస కృత్యంలోని నిగూఢతకు నిదర్శనం. ఈ వెల్లడి ప్రక్రియ మొత్తం ఇలా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా కార్యక్రమం అన్నది ఇప్పటి వరకు నిర్ధారణ జరిగిన వాస్తవం!
మనదేశంలోని ఐదువందల మంది నల్ల డబ్బు కామందు లెవ్వరో పసికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం రంగ ప్రవేశం చేయడం నేరస్థులకు నిద్ర పట్టనివ్వని మరో ప్రకంపనం...కేంద్ర ప్రభుత్వం వివిధ నిఘా విభాగాలతో కూడిన విస్తృత పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేయడం భారతీయ జనతాపార్టీ వారి ఎన్నికల వాగ్దానానికి అనుగుణమైన వ్యవహారం..దేశాలలోని బ్యాంకులలో నల్లడబ్బు దాచిన వారిని పట్టి న్యాయస్థానాల ముందు నిలబెట్టనున్నట్టు భాజపా 2014లోక్ సభ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసింది. ఇందుకోసం ప్రత్యేక పరిశోధక బృందాన్ని-సిట్- ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ ఆదేశాన్ని నాటి ప్రధాన మంత్రి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 వరకు పాటించక పోవడం చరిత్ర..బాధ్యతను స్వీకరించిన వెంటనే నరేంద్రమోదీ ప్రభుత్వం వారు సిట్ ఏర్పాటునకు అంగీకరించారు. కానీ ఈ ఇరవై రెండు నెలలో జరిగిన కృషి మాత్రం అంతంతమాత్రమే...