ఉత్తరాయణం

మత్తు వదిలేదెన్నడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావడం పలువురిని కలవరపెడుతున్నది. ఎన్ని దుర్ఘటనలు జరిగి, ఎంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలసినా వీటిని అదుపులో పెట్టలేకపోవడం అధికారుల వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనో, టోల్‌గేట్ల వద్దనో డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించినంత మాత్రాన ప్రమాదాలు ఆగిపోవు. జాతీయ రహదారులు మొదలుకొని గ్రామీణ రహదారుల వరకూ అడుగడుగునా ఈ పరీక్షలుండాలి. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారికి భారీ జరిమానాలు విధించాలి. వారి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దుచేయాలి. కఠిన శిక్షలు అమలుచేయాలి. అమాయకుల ప్రాణాలను రక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
కల్తీ
1) సరుకులందు కల్తి సంసారమే కల్తి
కట్నకానుకందు కళల కల్తి
గాలి, నీరు, కల్తి, కరుణయు కల్తీయె!
తిండి గింజ కల్తి, కరుణయు కల్తీయె!
2) విద్యయందు కల్తి! వినయంబు కల్తియె
గురువు మనసు కల్తి! పరువు కల్తి
నరుల యందు కల్తి నాణ్యత బెరిగిన?
జీవరాసి బ్రతుకు చిత్రమేగ?
3) పలుకులందు కల్తి పనులందు కల్తియె
కలియుగాన లేని కల్తియేది?
నియమ నిష్టకల్తి భయమందు కల్తియె
మేఘమాలకందు మేటి కల్తి!
4) కాయగూర కల్తి! కఠినత్వమే కల్తి!
ఆలుమగల బ్రతుకులందు కల్తి
నేటి అమ్మపాలు- చాటుగ కల్తియె
కల్తి మందులెంచ? కలియుగాగన!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
సంపద విలువ ప్రకటించాలి
తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలోని నేలమాళిగ గదులలో తేలికగా అంచనా వేయలేనంత బంగారం, ఇతరంగా విలువైన రత్నాలు మొదలైనవి ఉన్నట్లుగా మూడు సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విలువకట్టటం ప్రారంభమైంది. కాని ఇంతవరకూ ఈ విషయం గురించి వార్తలు రావటం లేదు! తిరుపతి వెంకటేశ్వరుడికి ఉన్న సంపదకన్నా పద్మనాభస్వామికి ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంకా ఎంత కాలానికి సంపద విలువను ప్రకటిస్తారో మరి. హిందువులు ఆ సంపద విలువని ప్రకటించమని ఉద్యమం ప్రారంభించాలి. ఇందువలన వాస్తవాలు వెలుగులోకి రావటమే కాకుండా హిందువులలో చైతన్యం కూడా కలుగుతుంది.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
నిరుపేద కిడ్నీ రోగులకు వరం
ప్రపంచంలో అత్యధిక కిడ్నీ రోగులు వున్న మన దేశంలో గొప్పవారి సంగతి అలా వుంచితే పేదవారికి నా ణ్యమైన వైద్యం అందించే పరిస్థితులు తక్కువగా వు న్నాయి. 90 శాతం పేదవారు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక మృత్యువాత పడుతున్నారన్న వార్తలు కలచివేస్తున్నాయి. పెద్ద నగరాలలో మాత్రమేవున్న డయాలసిస్ సెంటర్లు కోటీశ్వరుల సేవలో తరిస్తున్నాయి. ఎనభై లక్షల రోగులు మృత్యువుతో పోరాడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుచేసేందుకు నిర్ణయించడం ముదావహం. దీనికోసం వంద కోట్లు విడుదల చేయడంతోపాటు నేషనల్ డయాలసిస్ సర్వీస్ ద్వారా ప్రతీ ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుచేసే చర్య లక్షలాది కిడ్నీరోగులకు శుభవార్త! అట్లే ప్రపంచంలోనే అత్యధిక హృద్రోగులున్న మన దేశంలో విరివిగా కార్డియక్ సెంటర్లు ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి! ఇటువంటి సంక్షేమ చర్యలవలన లక్షలాది రోగగ్రస్తుల ఆశీర్వచనాలు ప్రభుత్వాలకు లభిస్తాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
నిషేధించిన మందుల అమ్మకాలు
ఇతర దేశాలు నిషేధించిన మందుల్ని సైతం మన దేశంలో యధేచ్ఛగా అమ్మేస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి మందుల కంపెనీలు. డాక్టర్ చీటీ లేకుండానే అమ్మేస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా నొప్పి నివారిణి, రొంప, దగ్గు, జ్వరం తగ్గించే మందులు. ఇంత కాలానికి ప్రభు త్వం కళ్లుతెరిచి 344 మందుల్ని నిషేధించి మరో 600 మందుల్ని పరీక్షిస్తున్నది. కాని కోర్టులు మాత్రం నిషేధంపై స్టే విధించడం సరికాదు. దీనివల్ల కంపెనీలకు లాభం. ప్రజల ఆరోగ్యానికి ముప్పు. స్టే విధించకుండానే కంపెనీల అప్పీళ్లను విచారణకు తీసుకుంటే ప్రజలకు కాస్త మేలు జరుగుతుంది. లాభాలు లేని వ్యాపారం ఉండదు. కానీ మనిషి ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఉండరాదు కదా.
- శాంతిసమీర, వాకలపూడి