మెయన్ ఫీచర్

మన ‘ధ్యాస’ కూడ మనకు పెరగాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలికిరణం మొలకలెత్తి
పులకించెను భువనతలం
ఎలకోయిల కొమ్మలెక్కి
పలుకుతోంది మధుగీతం
యుగయుగాల ప్రస్థానపు
ప్రగతికి ఇది సంకేతం...
శుభ వసంత శోభల
సుమ పరిమళాల సంస్కారం
చైత్రం నుండి ఫాల్గునం వరకు పనె్నండు నెలలున్నాయన్న అనాది జాతీయ ధ్యాసకు అధికాధికులు దూరవౌతుండడం ఉగాది ఆగమనానికి విచిత్రమైన నేపథ్యం. ఉగాది ఈ ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వస్తోంది అన్నది వర్తమానపు జీవనరీతి. ఉగాది చైత్ర శుక్ల పాడ్యమి నాడు వస్తోందన్న వాస్తవం విద్యాధికులకు పట్టని వ్యవహారం! ఉగాది కొన్ని మతాలు ప్రజలు మాత్రమే జరుపుకునే పండగ అన్నది ధ్యాసకు చెందిన మరో వైపరీత్యం. ఉగాది ఆద్యంత రహితమైన కాలాన్ని కొలిచేందుకు భారతీయులు అనాదిగా ఉపయోగిస్తున్న కొలమానం అన్న ధ్యాస అడుగంటిపోతోంది. ఉగాది మిగిలిన పండగల వలె ఒక పండగ అన్న ధ్యాస మిగిలి ఉంది. ఉగాదినాడు కొత్త సంవత్సరం మొదలౌతోందన్నది చాలామంది మరచిన వాస్తవం. ‘‘న్యూ ఇయర్ జనవరి ఒకటవ తేదీన వస్తోంది..’’ అని తెలిసిన వారికి, ‘‘అయ్యా! తెలుగువారికి భారతదేశంలోని అనేక ప్రాంతాల వారికి కొత్త సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమినాడు వస్తోంది..’’ అని చెప్పి చూడండి. మనకు ‘‘నాగరికతా స్పృహ లేదని’’ నవ్వుకుంటారు. ‘‘న్యూయియర్ జనవరి ఫస్టునే వస్తుంది సార్...ఉగాదినాడు ఎందుకు వస్తుంది?’’ అని డిసెంబర్ 31న ‘క్వార్టర్’ కొట్టేసిన వారు మనల్ని నిలదీస్తారు. నగరాలలోని బస్తీలలో మట్టిపని చేసేవారు, ఆటోలు నడిపేవారు, పండ్లు కూరలు అమ్మేవారు తెలుగు- చాంద్రమానం-కొత్తవత్సరం గురించి మరచిపోయారు. విద్యాధికులైన వారు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, రాజ్యాంగ వ్యవహారాల విశే్లషకులు రచయితలు, వ్యాసకర్తలు, కవులు... ఇత్యాది మేధావులలో అధికాధికులు ఈ ఉగాదితో మొదలయ్యే కొత్త సంవత్సరం ‘‘పాతదనానికి ప్రతీక’’ అని భావిస్తున్నారు. ‘‘ప్రపంచీకరణ యుగంలో మన్మథ, దుర్మిఖి అని అంటున్నారు ఈ విచిత్రాలేమిటండీ?’’ అని వాపోతున్నారు..కొందరు లోలోపల, మరికొందరు బాహాటంగాను..!!
క్రీస్తుశకం పుట్టి రెండు వేల ఏళ్లకు పైబడింది. ఈ శకం మనదేశానికి వచ్చింది ఆంగ్లేయుల పాలన నడికొన్న తరువాత మాత్రమే! ఐరోపా వారి దురాక్రమణకు ముందు మన దేశంలో కాలాన్ని ఎలా లెక్కపెట్టేవారు? అన్న సందేహం అధికాధిక భారతీయ మేధావులకు కలుగకపోవం విస్మయకరం. ఈ విస్మయం అతికొద్ది మందికి మాత్రమే కలుగుతోంది. మిగిలిన వారికి ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ ఉన్న సంవత్సరాల గురించి తెలుసుకోవడం ఆధునికతకు భంగకరమైన వ్యవహారం! ‘‘స్ప్రింగ్, వింటర్, ఆటమ్, సమ్మర్’’ అన్న నాలుగు ఋతువులే ఉన్నాయన్న పాశ్చాత్యుల అజ్ఞానం మన దేశంలోని విద్యావంతుల కాలగణనానికి కొలమానం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అన్న ఆరు మార్పులు ప్రకృతిలో సంభవిస్తున్నాయన్న వాస్తవం భారతీయులకు అనాదిగా తెలుసునని వర్తమాన విద్యాధికులలో ఎందరికి తెలుసు? క్రీస్తుశకం పుట్టక ముందు పాశ్చాత్య దేశాలలోను, ప్రపంచ దేశాలలోను కాలాన్ని ఎలా లెక్కించేవారు? ఇప్పుడు క్రీస్తునకు పూర్వం 323వ సంవత్సరం అని అంటున్నారు. కానీ క్రీస్తు పుట్టక ముందు 323లోనో 1323లోనో ప్రజల తమ కాలాన్ని ఎలా గుర్తించారు? క్రీస్తు అప్పటికి పుట్టలేదు. పుట్టబోతాడని ఆనాటి చరిత్రకారులకు తెలీదు. ఈ ప్రశ్నలకు సమాధానం పాశ్చాత్యులు చెప్పలేదు, చెప్పలేరు...్భరతీయులు చెప్పారు. ఎందుకంటె అనాదిగా భారతీయులు కాలగణం స్పష్టగతమైన సనాతన వాస్తవం ప్రాతిదపదికగా జరుగుతోంది. మతాలతో ముడివడిన కాలగణన పాశ్చాత్యులకు ప్రధానం..
భారతీయులు కాలగణనం మతాలతో ముడివడి లేదు. ఈ దేశపు మట్టి నుంచి వికసించిన జాతీయ జీవనంలో అనాదిగా భాగమై ఉంది. సృష్టిగత మైన వాస్తవాలను సమాజసిద్ధంగా సంతరింప జేసుకున్న రీతి, ఈ సనాతనమైన భరత జాతిది మాత్రమే. ‘చిత్ర’ నక్షత్రం విశ్వవ్యవస్థలో భాగం. చంద్రుడు ప్రకృతికి దీపం. అలాగే భూమి, భూమిని ఇతర గ్రహాలను వెలిగిస్తున్న సూర్యుడు శాశ్వతమైన అంటే సనాతనమైన అంతరిక్ష రూపాలు. ‘చిత్ర’ నక్షత్రానికీ చంద్రుడికీ ముడివడి ఉన్నది చైత్ర మాసం. అంటే భారతీయులు మూఢ విశ్వాసంతో మాసాలను సృష్టించలేదు. ఖగోళ స్థితమైన శాశ్వత సత్యాన్ని గుర్తించారు, ఆవిష్కరించారు. ‘చిత్ర’ నక్షత్రంతో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల చైత్రమాసమైంది. ‘చిత్ర’కు సంబంధించినది ‘చైత్రం’.. ఆంగ్లేయులు మన నెత్తికెత్తిపోయిన నెలలకు ఇలాంటి శాస్ర్తియమైన ప్రాతిపదిక లేదు. అంతరిక్షంలోని ఇరవై ఏడు నక్షత్రాలు భూమినుంచి దర్శించినప్పుడు ప్రతి రోజు ఉదయిస్తున్నాయి, ప్రతిరోజు అస్తమిస్తున్నాయి. అలాగే సూర్య చంద్రులు, ఇతర గ్రహాలు కూడ భూమి నుండి చూసినప్పుడు ఉదయించినట్టు, అస్తమించినట్టు దృశ్యమానమవుతున్నారు. ఇదంతా భూమికి సాపేక్షమైన అంటే సంబంధమైన -రిలెటివ్-అంతరిక్ష వ్యవస్థ. ప్రతి రోజు వివిధ సమయాలలో ఉదయించే చంద్రుడు ప్రతిరోజు ఏదో ఒక నక్షత్రంలో కలసి ఉదయిస్తున్నాడు. ‘‘ఈరోజు హస్తనక్షత్రం’’ అని అంటే చంద్రుడు ‘హస్త’తో కలిసి ఉదయించాడు. ‘‘ఈ రోజు ‘చిత్ర నక్షత్రం’ అని అంటే చంద్రుడు చిత్రతో కలిసి భూమిమీద కనిపిస్తున్నాడు.
ఒక్కొక్క నక్షత్రానికీ ఇతర నక్షత్రాలకు మధ్య కొన్ని వందలు వేలకోట్ల మైళ్ల దూరం ఉంది. చంద్రునికీ ఆయా నక్షత్రాలకూ మధ్య అంతే దూరం ఉంది. సూర్యునికీ సౌర కుటుంబంలోని గ్రహాలకూ, నక్షత్రాలకు మధ్య కూడ ఇలా కోట్లాది యోజనాల దూరం ఉంది. అలాంటపుడు కలసి ఉదయించడం ఎలా సాధ్యమన్నది హేతుబద్ధమైన సందేహం..నిజా నికి వారు కలవరు. భూమినుంచి చూసినప్పుడు ఒకే సమయంలో ఆ నక్షత్రాల, గ్రహాల సూర్యచంద్రుల ఉదయం భాసించడమే కలసి ఉదయించడం. పౌర్ణమి రోజున చంద్రుడు గుండ్రంగా ఉదయించే సమయంలోనే ‘చిత్ర’ నక్షత్రం కూడ భూమిమీద కనిపించడమే కలసి ఉండటం. చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రంతో కలిసి ఉదయిస్తున్నాడు. ఇరవై ఏడు నక్షత్రాలతో కలిసి ఉదయించే సరికి ఇరవైఏడు రోజులు పూర్తవుతోంది. ఇరవై ఎనిమిదవ రోజున మళ్లీ మొదటి నక్షత్రంతో పాటు కనిపిస్తాడు. మొదటిది అశ్వనీ నక్షత్రం...చివరిది రేవతి. పౌర్ణమి, చంద్రుడు, నక్షత్రం ప్రాతిపదికగా పనె్నండు నెలలకు పేర్లు ఏర్పడడం భారతీయ సమాజం సృష్టితో అనుసంధానమై ఉందనడానికి సనాతన సాక్ష్యం. మనది సమగ్ర దృష్టి..‘వర్గ’ దృష్టి కాదు. ఈ సమగ్ర తత్వంలోని ‘సర్గ’లు అసంఖ్యాక వైవిధ్యాలు. కాలగణంలో కూడ మనకు వైవిధ్యాలున్నాయి. చంద్రునితో ముడివడినది చాంద్రమానం. సూర్యుడికీ నక్షత్రాలకూ మధ్య గల సంబంధంతో ముడివడినది సౌరమానం. చంద్రుడు, ప్రతి రోజు ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి మారుతాడు. అంటే ఒక నక్షత్రంతో ఒక రోజు కలిసి ఉదయిస్తాడు. సూర్యుడు పదమూడు లేదా పదునాలుగు రోజులపాటు కలసి ఉదయిస్తాడు. ఇలా సూర్యుడు అన్ని నక్షత్రాలతో కలసి ఉదయించడం పూర్తయ్యే సరికి మూడువందల అరవై రోజుల ఆరుగంటల, సౌరమాన సంవత్సరం పూర్తవుతోంది. ఇది సౌరమానం. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు, పనె్నడు రాసులుగా అంతరిక్షంలో విభక్తమై ఉన్నాయి. అశ్వని, భరణి, నక్షత్రాలతోను, కృత్తిక లోని నాలుగింట ఒకభాగంతోను కూడినది మేషరాశి. ఇలా మీనం వరకు పనె్నండు నెలలు. సూర్యుడు ఒక రాసితో కలిసి ఉదయించడం ఆరంభమైన రోజున సౌరమానం ప్రకారం కొత్త మాసం ఆరంభవౌతోంది. అలా సూర్యుడు అశ్వనితో కలసిన రోజున మేష మాసం మొదలుతోంది. సౌరమానం పాటించే తమిళనాడులోను, ఇతర చోట్ల ఆరోజున నూతన సంవత్సరాది ఉత్సవం జరుగుతోంది. బృహస్పతి గ్రహం ఒక రాసితో కలసి సంవత్సర కాలం పాటు ఉదయిస్తుంది. అందువల్ల బృహస్పతిగ్రహం రాసి మారినప్పుడు విధ్య పర్వతానికి ఉత్తరాన ఉన్న భారత దేశంలో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇది ‘బార్హసత్యమాసం’ ఇవన్నీ భారతీయుల కాలగణనంలోని వైవిధ్య రీతులు..ఇంకా నక్షత్రమాసం వంటివి కూడ ఉన్నాయి. వైవిధ్యాలను వైరుధ్యంలేని రీతిలో సమన్వయం చేసికొనడం పరిరక్షించి వైవిధ్యాలను పెంపొందించడం అన్నది హైందవ జాతీయతా స్వభావం. చంద్రుడు రోజూ ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రం లొకి మారుతున్నాడు. సూర్యుడు రాసి మారినప్పుడు కొత్తనెల అంటే సౌరమానపుమాసం పుడుతోంది. బృహస్పతి రాసి మారినప్పుడు కొత్త సంవత్సరమే ఆరంభమవుతోంది. వైవిధ్యాలు సమాంతరంగా వికసించడం భారతీయత. ఒక నాగరిగతను ధ్వంసం చేసి మరొకటి వికసించడం పాశ్చాత్యుల స్వభావంలో భాగం...
తెలుగువారమైన మనం పాటిస్తున్న చాంద్రమానం కర్నాటకలోను, మహారాష్టల్రోను, టిబెట్‌లోను కూడ అమలులో ఉంది. అనాదిగా టిబెట్ భారతదేశంలో భాగమన్న సత్యానికి ఇది కూడ ఒక సాక్ష్యం. ఇలా పౌర్ణమినాడు చంద్రుడు చిత్రతో కలిసి ఉదయించే నెల చైత్రమాసం..ఇదీ చాంద్రమానం. ‘విశాఖ’తో కలసి చంద్రుడు పూర్ణమినాడు ఉదయిస్తే ఆ నెలపేరు వైశాఖం. ఇలా జేష్ఠతోకలిసి ఉదయిస్తే అది జేష్ఠమాసం..శ్రవణంతో కలిస్తే శ్రావణ మాసం. ఇంకా ‘్భద్ర’తో భాద్రపదం, అశ్వనితో ఆశ్వయుజం, కృత్తికతో కార్తీక, మృగశీర్షతో మార్గశీర్ష, పుష్యమితో పౌష్యం, మఘతో మాఘం! చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వ ఫల్గునితో కాని, ఉత్తర ఫల్గునితో కాని కలిసి ఉదయిస్తే ఫాల్గునమాసం ! ఇవీ భారతీయుల పనె్నండు నెలలు. అన్ని భారతీయ భాషలలోను ఇవే పేర్లు! ఫాల్గునం తరవాత చైత్రం వస్తోంది. శిశిరం తరువాత వసంతం ఉదయిస్తోంది. అలాగే కలియుగం తరవాత కృయుగం పునరావృత్తం అవుతోంది. ఈ పునరావృత్తి ఆద్యంతరహితమైన కాలం..ప్రస్తుత కలియిగంలో ఇప్పటికి 5117 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవి గతాబ్దములు. దుర్ముఖి ఉగాది రోజున 5118వ సంవత్సరం మొదలవుతోంది. ఉగాదితో చైత్రం మొదలు, వసంతం మొదలు, కొత్త సంవత్సరం మొదలు!
అరుణ తరుణ సుమపరిమళ
సరములు సభలను తీర్చె
అమలిన సౌందర్యకాంతి
కరములతో ముంచెత్తె
కాల ప్రగతి రథం విశ్వ
ప్రస్థానపు కొలమానం..
విశ్వహితం కోరు భరత
జీవన శుభ సంస్కారం..

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352