ఉత్తరాయణం

విలువగల సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1) మంచి ఆరోగ్యపలవాట్లు బెంచుయెపుడు
గాలి, ఆహారమన్నది కల్తిలేక
నీరు, నిర్మల తత్వంబు నిలువలుంచి
మేలు గూర్చెడి భావాలు మేప చాలు!
2) ధూమపానంబు మనిషికి దోషమొసగు
మధ్యపానంబ, నారోగ్యమందజేయు!
నాశ నత్యాసగామార్చ? నాశనంబె!
మనసు కల్మషమందకే మనుగడుంచు!
3) ఇంట, పరిసర మంతట కంటబడిన
చెత్తకుప్పల నూడ్చుము చేటు దొలగు!
మురికి కాలువ కుంటలో ముసురుకొన్న
దోమ నిర్మూలనంబులే క్షేమ మొసగు!
4) నేడు ప్రపంచ ఆరోగ్య తోడు గలిపి
పాల భాగాన వ్రాతను బాగుపరచి
సౌఖ్యమందగించగలిగిన సమయ మనుచు
తెలుపు సందేశ వాక్యాలె! విలువలొసగు!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
ఒకవైపు సవాలు మరోవైపు రభస
ఆమధ్య రాహుల్ లండన్‌లో ఒక సంస్థను ప్రారంభిస్తూ ఆ సందర్భంగా జరిగిన న్యాయ కోవిదుల సమావేశంలో తాను బ్రిటిష్ పౌరుడనని చెప్పుకున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి దిల్లీలో ప్రకటించి రాహుల్ వివరణ కోరాడు. దానికి రాహుల్ అవుననిగాని కాదని గాని చెప్పకుండా విచారణ జరుపుకొని దమ్ముంటే తనని జైల్లో పెట్టమని ఛాలెంజ్ చేశాడు. మరి లోక్‌సభ స్పీకర్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదిస్తే స్పీకర్ చర్య వివక్ష కాదా అంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. నేషనల్ హెరాల్డ్ విషయంలోనూ దమ్ముంటే కేసు పెట్టుకోమని సవాల్ విసిరిన కాంగ్రెస్ తీరా కేసు పడ్డాక పార్లమెంటుని స్తంభింపజేసిం ది. ఛాలెంజ్ చేసేది వారే! రభస చేసేదీ వారే. తామేం చేసినా చెల్లుతుందన్న ధోరణి కాంగ్రెస్‌కు తగదు.
- ప్రసాద్, గొడారిగుంట
కాంగ్రెస్ కపట నాటకం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంటులో ప్రస్తావించి కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు చందాన ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నూతిలో తోసేసి పైకి రావడానికి దారం వదులుతున్నట్లు కాంగ్రెస్ చేస్తున్న కపట నాటకాలను చూస్తుంటే కాంగ్రెస్ నాయకులపై మరింత ఏహ్యభావం కలుగుతుంది. తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణా ఇవ్వడం తప్పుకాదు కాని అదే సమయంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం, వౌలిక వసతుల రూపకల్పన, వివిధ రకాల పన్నురాయితీలు వంటి అంశాలేవి లేకుండా బిల్లు రూపొందించి, ఆ బిల్లు ఆమోదాన్ని దేశ ప్రజలు వీక్షించకుండా ప్రసారాలు ఆపుచేసి, పార్లమెంటు తలుపులు మూసి, ఆంధ్ర పార్లమెంటు సభ్యులను కొట్టి తెలంగాణా ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. సమైకాంధ్రకు కట్టుబడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఆశయాన్ని కూడా కాంగ్రెస్ తుంగలో తొక్కింది. ప్రత్యేక తెలంగాణా ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ కేసీఆర్‌కు ఇచ్చి కాంగ్రెస్‌ను తెలంగాణా ప్రజలు ఛీకొట్టడంతో ఇప్పుడు జాగ్రత్తగా ఆంధ్రలో మళ్లీ పుంజుకోవాలని ఈ కపట నాటకాలు ప్రారంభించటం ఆంధ్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చిరంజీవి, రఘవీరారెడ్డి, కెవిపి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలుచేసినా ఏకపక్షంగా ఆంధ్ర ప్రజల గుండెలపై అతి పెద్ద గాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజానీకం క్షమించే ప్రశే్నలేదు.
- కొవ్వూరి జగా శ్రీనివాసరెడ్డి, కొంకుదురు
సరీగ్గా రూపొందని విభజన చట్టం
ఏపీ అభివృద్ధికి విభజన చట్టంలో అన్నీ పొందుపరిచామని కాని ఎన్డీయే ప్రభుత్వం అమలుచేయడం లేదని ఎంపీ కెవిపి అన్నారు. అయితే విభజన చట్టం ప్రకారం ఏపి ఉన్నత విద్యామండలి మాది అంటూ తెలంగాణ ప్రభుత్వం దాని ఖాతాలను స్తంభింపజేస్తే హైకోర్టు ఆమోదించింది. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విభజన చట్టం సరిగా రూపొందించనందువల్లే హైకోర్టు పొరపడింది. ఖాతాల్లోని సొమ్ముని రెండు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని తీర్పు చెప్పింది. అలాగే ప్రత్యేక హోదా విభజన చట్టంలో చేర్చకుండా నాటకాలాడి ఇప్పుడు హోదాకోసం ఎన్డీయేని నిందిస్తోంది.
- సాహిత్యదీప్తి, రమణయ్యపేట