సంపాదకీయం

విద్రోహపు ‘లాఠీ’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతమాతను దిగ్భ్రాంతికి గురి చేస్తున్న దృశ్యాలివి...్భరతీయులు విస్మయ నయనాలతో వీక్షిస్తున్న వికృత చిత్రాలివి! భరత మాతకు జయం కోరబోమని నిర్లజ్జగా నిర్భయంగా ప్రకటిస్తున్న వారి ముందు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చతికిలపడి ఉన్న దృశ్యం మొదటిది..ఈ దృశ్యం వివిధ రాష్ట్రాలలో ఆవిష్కృతమవుతోంది! భరతమాతకు జయనాదం చేస్తున్న వారిని పోలీసులు చితకబాదేసిన దృశ్యం రెండవది, జమ్ము కశ్మీర్ రాజధానిలో ఈ పోలీసుల దౌష్ట్యం దర్శనమిచ్చింది! జమ్ము కశ్మీర్‌ను కల్లోలితం చేస్తున్న ప్రమాదాలలో పోలీసులలోని అధికాధికులు పాకిస్తాన్ తొత్తులుగాను, మాతృదేశ ద్రోహులుగాను మారి ఉండడం అతి భయంకరమైనది! పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ-పిడిపికి చెందిన మెహబూబా ముఫ్తి జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన వెంటనే ఈ భయంకర ప్రమాదం ప్రస్ఫుటించింది! పిడిపి విధానాలు, భారతీయ జనతాపార్టీ విధానాలు పరస్పరం విరుద్ధమైనవి! అందువల్ల భాజపా వారు పిడిపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జాతీయతా నిష్ఠను నీరుగార్చిన పరిణామం! ముఫ్తి మెహబూబా జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తరువాత రెండురోజులు గడువక ముందు పోలీసుల దేశద్రోహ ప్రవృత్తి ఇలా మరోసారి ప్రస్ఫుటించింది! శ్రీనగర్‌లోని జాతీయ సాంకేతిక ఉన్నత విద్యా సంస్థ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిట్ ప్రాంగణంలో దేశ విద్రోహ కలాపాలకు పాల్పడినవారిని పోలీసులు నిరోధించలేదు. దేశద్రోహుల కలాపాలను నిరశించిన విద్యార్థులను నిరోధించ యత్నించిన విద్యార్థులను మాత్రం జమ్ము కశ్మీర్ పోలీసులు చితకబాదారు! ఇలా జమ్ము కశ్మీర్ కొత్త ప్రభుత్వం రెండు నేరాలకు ఒడిగట్టింది! నిట్ ప్రాంగణంలో దేశద్రోహ కలాపాలకు పాల్పడిన విద్యార్థుల ముసుగులోని జిహాదీ బీభత్సకారులను శిక్షించడానికి చర్యలు తీసుకొనకపోవడం మొదటి నేరం...్భరత జాతీయ పతాకాన్ని ధరించి ప్రదర్శనలు జరిపిన దేశభక్తులైన విద్యార్థుల తలలు పగలగొట్టించడం రెండవ నేరం! ముఫ్తి మెహబూబా ఏప్రిల్ నాలుగవ తేదీన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారప్రమాణం చేసింది. పాలనా బాధ్యతలను స్వీకరించింది! ఈ పరిపాలన ఐదవ తేదీన నిట్ ప్రాంగణంలోని భరతమాత వరాల బిడ్డల తలలను పోలీసులు పగలకొట్టడంతో ఆరంభమైంది! ఇలా పిడిపి వారి దేశ వ్యతిరేక స్వభావం పరిపాలనలో మరో సారి ప్రస్ఫుటించింది! ముఫ్తిమహమ్మద్ సరుూద్ గత ఏడాది మార్చి ఒకటవ తేదీన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యాడు, భాజపా, పిడిపిల తొలి సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహించాడు!పదవీ బాధ్యతలను స్వీకరించిన మొదటిరోజుననే ముఫ్తి సరుూద్ పాకిస్తాన్‌ను ప్రశంసించడం చరిత్ర! పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించినందువల్లనే 2014 డిసెంబర్‌నాటి జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నది సరుూద్ చెప్పిన మాట!
ఆ చరిత్ర ఇప్పుడు పునరావృత్తమైంది. ముఫ్తి మహమ్మద్ సరుూద్ కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఇలా తన తండ్రి మాటలకు తన చేతల ద్వారా పునరావృత్తిని కల్పించింది! దేశభక్తులైన విద్యార్థుల తలలను జమ్ము కశ్మీర్ పోలీసులు పగులకొట్టడం ఈ పునరావృత్తి! శ్రీనగర్‌లోని జాతీయ సాంకేతిక ఉన్నత విద్యా సంస్థ ప్రాంగణంలో చదువుకుంటున్నవారిలో ముప్పయి శాతం జమ్ముకశ్మీర్‌కు చెందినవారు, డెబ్బయి శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు...కశ్మీర్‌లోయ ప్రాంతానికి చెందిన విద్యార్థులలో అధికాధికులు దేశ వ్యతిరేకులన్నది ఇప్పుడు మరోసారి ధ్రువపడింది. మార్చి 31వ తేదీన మన దేశానికి దాపురించిన క్రీడా పరాజయం ఈ కశ్మీరీ విద్యార్థులకు హర్షదాయకం కావడం ఇందుకు నిదర్శనం. వెస్ట్ ఇండీస్ జట్టుతో టి-20 ప్రపంచ కప్పు క్రికెట్ పోటీలో 31వ తేదీన ఆడిన మన జట్టు ఓడిపోయింది. ఈ ఓటమిని నిట్ ప్రాంగణంలోని ఈ కశ్మీరీ విద్యార్థులు హర్షించారు, ఉత్సాహంగా భారత పరాజయోత్సవాలను జరుపుకున్నారు. స్థానిక విద్యార్థుల ఈ దేశద్రోహ కలాపాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు నిరోధించలేదు, పట్టించుకోలేదు.కానీ ఏప్రిల్ ఒకటవ తేదీన జరిగిన ఈ విద్రోహపు వేడుకను రెండవ తేదీనుంచి స్థానికేతర విద్యార్థులు నిరసిస్తున్నారు. దేశద్రోహులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఊరేగింపు జరిపారు. పోలీసులు చర్య తీసుకోనందుకు నిరసన యాత్రలు చేసారు. ఐదవ తేదీన నిట్ ప్రాంగణం-క్యాంపస్‌నుండి వెలుపలకి వచ్చి విద్రోహాన్ని నిరసించడానికి యత్నించిన దేశభక్తులైన విద్యార్థులను పోలీసులు చితక్కొట్టారు. ముప్పయిమందికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయట, మొత్తం గాయపడిన విద్యార్థుల సంఖ్య రెండువందలకు పైనే!
ఇలా విద్యార్థులపై బీభత్సకాండను జరిపిన పోలీసులపై నిజనిర్ధారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిందట...కేంద్రం కోరే వరకూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తనంత తానుగా రాజ్యాంగబద్ధమైన విధి నిర్వహణకు పూనుకోక పోవడం విస్మయకరం కాదు, పిడిపి పార్టీ వారురాజ్యాంగ నిబద్ధతను నటిస్తున్న దేశ విద్రోహకర శక్తులు. పిడిపి ఆవిష్కరించి ప్రచారం చేస్తున్న స్వయంపాలన సిద్ధాంతం ఇందుకు నిదర్శనం! జమ్ము కశ్మీర్‌కు భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తి-స్పెషల్ స్టేటస్-లభించింది. కశ్మీర్‌లోయలో విచ్ఛిన్న శక్తులు, పాకిస్తాన్ తొత్తులు విజృంభించడానికి ఈ ప్రత్యేక ప్రతిపత్తి ఆరున్నర దశాబ్దులుగా దోహదం చేసింది! దీన్ని రద్దు చేయాలని భాజపా దశాబ్దులుగా కోరుతునే ఉంది. ఇలా జాతీయ నిష్ఠ కల భాజపా పిడిపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే దేశ ప్రజలకు విస్మయకరం. ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి-అటానమీ-ని కోరుతోంది. ప్రత్యేక ప్రతిపత్తికంటే, స్వతంత్ర ప్రతిపత్తి కంటె మరింత దేశ వ్యతిరేకమైనది పిడిపి కోరుతున్న స్వయంపాలన-సెల్ఫ్ రూల్! ఈ స్వయంపాలన పథకాన్ని పదేళ్ల క్రితం మొదట ప్రతిపాదించినవాడు పాకిస్తాన్ సైనిక నియంత పరవేజ్ ముషారఫ్...పిడిపి సైద్ధాంతిక మూలాలు ఎక్కడ ఉన్నాయన్నది దీనివల్ల ఎప్పుడో స్పష్టమైంది! అందువల్ల దేశభక్తులైన విద్యార్థులను కొట్టి గాయపరిచిన పోలీసులపై మెహబూబా ముఫ్తి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు!
విద్రోహాన్ని నిరసించిన విద్యార్థులకు భద్రత లేకపోవడం పట్ల కేంద్రం ఆందోళన చెందడం సహజం. కానీ విద్రోహానికి పాల్పడిన విద్యార్థుల రూపంలోని జిహాదీలను గుర్తించి వారిని విచారించి శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకని కశ్మీర్ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఆదేశించలేదు? పోలీసులలో పాకిస్తాన్ అనుకూలురు, జిహాదీలు చేరి ఉండడం గురించి 1990 దశకం ఆరంభంలోనే అప్పటి కశ్మీర్ గవర్నర్ జగ్‌మోహన్ హెచ్చరించి ఉన్నాడు. ఇలాంటి పోలీసులను గుర్తించి శిక్షించే కార్యక్రమాన్ని కశ్మీర్ ప్రభుత్వం పట్టించుకోదు. అందువల్ల పట్టించుకోవలసింది కేంద్రం మాత్రమే! సైనిక దళాలు నెలకొని ఉన్నాయి కనుకనే కశ్మీర్‌లో పాకిస్తానీ తొత్తులు మరింతగా పేట్రేగడంలేదు. అందువల్లనే కశ్మీర్‌లో సైనిక దళాలు ఉండరాదని, ఉన్న దళాలను ఉపసంహరించాలని పాకిస్తాన్ అనుకూలురు కోరుతున్నారు!