ఉత్తరాయణం

జనరిక్ మందులకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాసుపత్రులలో జన సంజీవని పథకం క్రింద ప్రారంభించిన జనరిక్ మందుల షాపులు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. తొలుత ప్రచారం చేసినట్లుగా కాకుండా ఈ మందులు ఇతర బ్రాండెడ్ కంపెనీ మందుల వలే చక్కగా పనిచేస్తుండడమే కాకుండా వాటి ధరలలో 50 శాతానికే లభించడంవలన పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి వెసులుబాటుగా వుంటోంది. అయితే ఈ జెనెరిక్ మందులు నకిలీ మందులని సాగుతున్న దుష్ప్రచారంవల్ల అనేక మంది వాటిని కొనడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం వీటికి మంచి ఆదరణ కల్పించడంకోసం పెద్దఎత్తున అవగాహనలు కల్పించాలి. ప్రతీ పట్టణం, గ్రామంలోనూ జెనెరిక్ మందుల షాపులను ప్రారంభించి ప్రజలందరికీ వీటిని అందుబాటులోనికి తేవాలి!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
అవినీతిని రక్షిస్తున్నదెవరు?
అవినీతిని నిర్మూలిస్తాం. నల్లధనం వెలికితీస్తాం అని ఆర్భాటించిన భాజపా ఆ దిశగా ఏమీ చేయలేదని కాం గ్రెస్ విమర్శిస్తూనే ఉంటుంది. వాద్రా సంస్థలపై పన్నుల శాఖ దాడి చేస్తే సోనియా అల్లుడినని వేధిస్తున్నారు అంటాడు అమాయక చక్రవర్తి వాద్రా. కాంగ్రెస్ బాసటగా నిలుస్తుంది. చిదంబరం పుత్రుడు కార్తి చిదంబరం, అతని మిత్రుల సంస్థలపైన వాసన్ ఐకేర్ మీద ఈడీ దాడి చేస్తే డొంక తిరుగుడెందుకు? నేరుగా ననే్న విచారించవచ్చుగా అని ఎగురుతాడు చిదంబరం. వంత పాడుతుంది కాంగ్రెస్. అవినీతిని రక్షిస్తున్నదెవరు?
- చైతన్య, వాకలపూడి
చేవచచ్చిన హిందువులు
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు మనుధర్మశాస్త్ర ప్రతులను తగులబెడతామని ప్రతినబూనారట. భగవద్గీత, ఇతర హిందూ శాస్త్ర పురాణాలపై చిన్నచూపు, పురాణాలలోని రాక్షసులకు, ఉగ్రవాద దాడులు చేసే టెర్రరిస్టులకు వర్ధంతులు, జయంతులు జరపడం, దుర్గామాతను సెక్స్‌వర్కరుగా చిత్రీకరించడం, భగవద్ స్వరూపాలను చెప్పుల మీద, అభ్యంతర దుస్తుల మీదా ముద్రించడం - యివన్నీ బుద్ధిమాంద్యం, అతి తెలివైనవారు చేసే వికృత చర్యలు. ఇవన్నీ చేస్తున్నది హిందువులే అని తెలిసి బాధ కలుగుతున్నది. వీరు ఇతర మత గ్రంథాలను గాని, వారి ఆరాధ్యదైవాల మీద గాని అణుమాత్రం విమర్శ చేయగలరా? చేయలేరు. అంత ధైర్యం లేదు. హిందువులు, వారి మత గ్రంథాలే లోకువ. తల్లి పాలుతాగిన హిందువులారా, ఆమె రొమ్మును గుద్దకండి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
భారతమాతను గౌరవించాలి
మెడపై కత్తిపెట్టి డిమాండ్ చేసినా భారత్‌మాతాకీ జై అనను అని ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. భారతదేశం మనందరికీ మాతృమూర్తి. తల్లిని గౌరవించి, వందనం సమర్పించడం, తల్లి పట్ల ప్రేమానురాగాలు, భక్తి నరనరాలలో జీర్ణించుకొని విధేయులమై వుండడం ఆ తల్లి కన్నబిడ్డలుగా, భారతీయులుగా, సనాతన భారతీయ సత్సంప్రదాయాలకు వారసులుగా మనందరి కనీస ధర్మం. కన్నతల్లిని చీదరించుకొని బయటకు నెట్టేయడం పాశ్చత్యుల సంస్కృతి కావచ్చేమో కాని ముమ్మాటికీ భారతీయుల సంస్కృతి ఎంతమాత్రం కాదు. మేము భారత మాతాకీ జై అని చెప్పబోము అని సదరు పెద్దమనిషి, అందునా మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలోనే రా జకీయవేత్తగా ఎదిగిన వ్యక్తి వ్యాఖ్యానించటం, అం దుకు సెక్యూలరిజం పేరిట కొన్ని రాజకీయ పక్షాలు వత్తాసు పలకడం దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను ప్రతీ భారతీయుడు ఎలుగెత్తి ఖండించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
పంటి డాక్టర్ల దోపిడీ
రెండు తెలుగు రాష్ట్రాల డెంటల్ డాక్టర్లు పళ్ళ రోగులను నిలువుదోపిడి చేస్తున్నారు. పన్ను పీకితే ధర తక్కు వే. కాని పెట్టుడు పన్నుపెట్టాలంటే ఒక్కొక్క పంటికి 30, 40 వేలు గుంజుతున్నారు. పన్ను పీకిన చోట కృత్రిమ పన్ను బిగించకపోతే అటు పళ్లు ఇటు పళ్లు దగ్గరకు జరుగుతాయని అవి కూడ ఉడిపోతాయని రోగిని భయభ్రాంతుణ్ణి చేసి, వేలు లక్షల రూపాయలను గుంజుతున్నారు. గుండె మార్పిడికి కూడ ఇంత ఖర్చు కాదు. అట్లా దగ్గరకు జరిగేది చాలా కొద్దిమందికి మాత్రమే. అది కూడ చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే అది ఏమి ప్రమాదం కాదు. ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరిపి, అటువంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని రోగులను కాపాడాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ