సబ్ ఫీచర్

వాతావరణ దుష్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ మార్పు అభివృద్ధి నిరోధక శక్తిగా మారింది. అనేక అంతర్జాతీయ సదస్సులు జరిగినా ఫలితం వుండటం లేదు. భూతాపం పెరుగుతూనే వుంది. అభివృద్ధి వలన, ముఖ్యంగా పారిశ్రామికీకరణ వల్ల వెలువడే కర్బన్ ఉద్గారాలు ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు (ఆకస్మిక కుంభవృష్టి, దీర్ఘకాల అనావృష్టి, సముద్ర మట్టాల పెరుగుదల తీవ్ర వడగాల్పులు, భీకర తుఫానులు) ప్రస్తుతం సామాన్యమైపోయాయి. శిలా ఇంధనాల వాడకం ప్రమాద స్థాయి కి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 శాతం సంపన్నులే దాదాపు 50 శాతం కర్బన్ ఉద్గారాల విడుదలకు కారణమవుతున్నారు. వాతావరణ మార్పుకు బాగా సహకరిస్తున్న రంగాలలో ముఖ్యమైనవి ఇంధన రంగం, రవాణా రంగం. మన దేశంలో కర్బన్ ఉద్గారాల కల్పనలో ఇంధన రంగం వాటా సుమారు 38 శాతం, రవాణా రంగం వాటా 7.46 శాతం. ప్రపంచ దేశాలలో అమెరికా వాటా 28.8 శాతం. చైనా కూడా అదే స్థాయిలో వుంది. మన దేశం వాటా 3 శాతం మాత్రమే. వాతావరణ మార్పు పరిణామాలు తీవ్రంగా వున్నాయి. 2050 నాటికి నాల్గవ వంతు జీవరాశులు అదృశ్యమయ్యే ప్రమాదం వుంది. మన దేశంలో 95 శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన గాలి అందుబాటులో లేదు. గ్రామాలలో కూడా పరిస్థితి విషమిస్తున్నది. 2011 జనగణన ప్రకారం మన దేశంలో 67 శాతం కుటుంబాలు వంటకు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నారు. ఉష్ణోగ్రత పెరగడంవల్ల మన దేశంలో గోధుమ ఉత్పత్తి 70 లక్షల టన్నులు తగ్గే ప్రమాదం వుంది.
వాతావరణ మార్పుపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. మొదటిది 1992లో రియోడిజెనీరో (బ్రెజిల్)లో జరిగింది. దీనినే ధరిత్రి సదస్సు అన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై నిర్ధిష్ట కాల నిబంధనలు రూపొందించారు. 172 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనుగడల అభివృద్ధికి కృషిచేయాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. 1997 డిసెంబర్‌లో జపాన్‌లోని క్యోటో నగరంలో జరిగిన సదస్సు ఒక ఒప్పందానికి వచ్చింది. ఇది 2005 ఫిబ్రవరి 16నుండి అమలులోకి వచ్చింది. అయితే అమెరికా దీనికి దూరంగా వుంది. 2009 డిసెంబర్‌లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగన్‌లో మరొక సదస్సు జరిగింది. ఇదే కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 15. దీనిలో 193 దేశాలు పాల్గొన్నాయి. 2010లో కాన్‌కూన్‌లో జరిగిన సమావేశంలో 10,000 కోట్ల డాలర్లతో హరిత వాతావరణ నిధిని ఏర్పాటుచేయాలని అంగీకారం కుదిరింది. 2011లో డర్బన్‌లో జరిగిన సదస్సు కర్బన్ ఉద్గారాలను నియంత్రించాలని మరొకసారి గుర్తుచేసింది. 2013లో వార్సాలో సదస్సు జరిగింది. ప్రతి దేశం వాతావరణ మార్పు విషయంలో తీసుకున్న చర్యలు వివరించాలని నిర్ణయం తీసుకోబడింది. 2014లో లిమాలో సదస్సు జరిగింది. వార్సా సదస్సు నిర్ణయాలకు మరింత స్పష్టత నిచ్చింది. కాప్ 21 పారిస్‌లో 2015 నవంబర్ 30నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. వివిధ దేశాలనుండి 196 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2030నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెలిసియస్‌కు కుదించాలని ఈ సదస్సు అభిప్రాయపడింది. పారిస్ ముసాయిదాపై భారత్ అసంతృప్తిని వెల్లడించింది. పలు కీలక అంశాలకు ఇందులో చోటు లేదని మన దేశం చెప్పింది.
పేద దేశాలు కూడా తమ వంతు కృషిచేయాలి. పునర్వినియోగ ఇంధనాలను (హైడల్, సౌర, పవన విద్యుత్తులను) ప్రోత్సహించాలి. ఖర్చు తక్కువ, పర్యావరణానికి హాని చేయవు. అంతేకాదు, మన దేశం అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుండి 33 శాతానికి పెంచాలి. నిధులు సమకూర్చుకోడానికి ప్రభుత్వాలు కర్బన పన్ను విధించడంలో తప్పు లేదు. 2010లో హరిత వాతావరణ నిధి ఏర్పాటయ్యింది. ఈ నిధికి ధనిక దేశాల సహాయం అంతంత మాత్రంగానే వుంది. వెయ్యి కోట్ల డాలర్లు సమకూర్చుకోవడం జరిగింది. 2020 నాటికి 10,000 కోట్ల డాలర్లు సమకూర్చుకోవాలి. 2005 నాటితో పోలిస్తే కర్బన ఉద్గారాలను 2025కల్లా 26-28 శాతం తగ్గిస్తామని అమెరికా, చైనా ప్రకటించాయి. ఇది శుభపరిణామమే. ఒకటి మాత్రం నిజం. వాతావరణ మార్పుకు ధనిక దేశాలే ప్రధానంగా కారణమైనా, దుష్ఫలితాలకు ఎక్కువగా గురయ్యేవి పేద దేశాలే. వాతావరణ పరిస్థితి ఇలా కొనసాగిస్తే భావి తరాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం