ఉత్తరాయణం

దుర్వినియోగమవుతున్న స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ దేశ సార్వభౌమత్వానికి కళంకం కలిగించే విధంగా వ్యాఖలు చేయడం క్షమార్హం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించి చట్టసభలో ప్రతినిధిగా ఉన్నవారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇతరులను వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ముమ్మూటికీ తప్పు. ప్రతి పౌరుడు తన మాతృభూమి పట్ల భక్తి, విధేయతలతో, దేశ పరిరక్షణకు అంకితం కావాలి. భారత్‌మాతాకీ జై అని ఎలుగెత్తి నినదించడమే కాక దేశంవైపు ఎవరైనా కనె్నత్తి చూస్తే సాయుధుడై ఎదిరించే విధంగా స్ఫూర్తి కలిగి వుండాలి. అటువంటి దేశభక్తులకు బాధ కలిగించే విధంగా అత్యున్నత చట్ట సభలలో ప్రజాధనంతో అన్ని సదుపాయాలు పొందుతూ, భారత మాతను అవమానించే విధంగా ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడం తప్పు.
-సి. ప్రసాద్, శ్రీకాకుళం
అంత జీతాలు అవసరమా?
గతంలో తమంతట తాము ప్రజలకు పనికి వచ్చే సేవ చేయాలన్న సదుద్దేశంతో కొందరు విద్యాధికులు, సామాన్యులు త్యాగనిరతితో సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేసేవారు. అలాంటి వారిని పార్టీలు గుర్తించి వారి అభీష్టం మేరకు పార్టీలో చేర్చుకొని ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టడం జరిగేది. ప్రజలు కూడా సేవాభావం కలిగిన మంచి వారికే తమ ఓటు వేసి గెలిపించుకునేవారు. ఆనాడు తమ కులపువాడని, వర్గం వాడని ప్రలోభాల జోలికి పోక సరైన వారికి ఓట్లు వేసి గెలిపించుకునేవారు. ప్రభుత్వం వారి అవసరాల మేరకు నామమాత్రంగా గౌరవవేతంగా చెల్లించేవారు. ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలకంటె విలాసవంతమై జీవితాన్ని కోరుకునేవారు కాదు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించేవి కావు. ఒక ఉన్నతాధికారి కంటె రెట్టింపుకు పైగా శాసనసభ్యులకు, మండలి సభ్యులకు జీతాలు ఇవ్వాలనే త్రిపాదన చేయడం సరైంది కాదు. పైగా వీరికి అనేక రాయితీలు ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒక్కసారి ఎన్నికల్లో గెలుపొందితే వీరికి జీవితాంతం కుటుంబానికి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నారు. ఒక్కసారి ఏ ఉద్యోగం లేక ఆస్తులు లేక దినదిన గండంగా అధికధరలతో అర్థాకలితో నానా అవస్థలు పడుతున్న లక్షలాది మంది మధ్యతరగతి ప్రజల జీవితాల్ని పరిశీలించండి. నెలకు రూ.3.25 లక్షల వేతనమంటే విజ్ఞులు ఒక్కసారి ఆలోచించాలి. తమ చేతులో ఉన్నది కదా అని ఎడాపెడా జీతాలు పెంచేసుకోవడం ఎంతవరకు సమంజసం?
- గర్నెపూడి వెంకట రత్నాకర్ రావు, వరంగల్
మాతృభాషపై మక్కువ అవసరం
తల్లి తన బిడ్డకు ఉగ్గుపాలతో భాషను రంగరించి పోస్తుంది. అందుకే దానిని మాతృభాష అని అభివర్ణించారు. ఏవిషయమైనా అమ్మ భాషలో రాయడం వికాసానికి దోహదం చేస్తుంది. మానవుల జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మాతృభాష నేటి తరానికి కాని భాషగా, అక్కరలేని భాషగా మారడం దారుణం. పసి ప్రాయంలో మాతృభాషకు దూరమవుతుండడం తెలుగునాట కనిపిస్తున్న దారుణ పరిణామం. పిల్లలు మాట్లాడటం మొదలు పెట్టగానే ఇంగ్లీషును బలవంతంగా రుద్దుతూ, తెలుగు మాట్లాడితే పెద్ద అపరాధం జరిగిపోయినట్లు భావించే నేటి ఆధునిక తల్లిదండ్రులు ఈ వైపరీత్యానికి కారణం. ఇంట్లో ప్లాస్మా టి.వి. ఎసిలు, మొబైల్స్, ఉంటాయ కాని, తెలుగు పుస్తకం మచ్చుకైనా కనిపించడం లేదు. తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఎందుకూ పనికిరాని వారిగా తయారవుతారన్న తల్లిదండ్రుల అనాగరిక ఆలోచనా విధానం వల్ల, ఇంగ్లీషు బళ్లు వీధివీధిలో వెలుస్తున్నాయి. ప్రాథమిక విద్య మాతృభాషలో చేస్తేనే ఉపయోగమని, మాతృభాషలో విద్యార్జన చేసిన వారు, అనేక రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని మేధావులు, మానసిక శాస్తవ్రేత్తలు నెత్తీ నోరూ బాదుకున్నా నేటి తల్లిదండ్రులకు తలకెక్కడం లేదు. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడ తెలుగు భాషాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం బాధాకరం. తల్లిదండ్రుల్లో ఇంతటి మార్పుకు అసలు కారణం, మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే తమ పిల్లలకు భవి ష్యత్తు ఉండదన్న భావన. కేవలం ఇది అపోహ మాత్రమే. నేడు ఉన్నత స్థితిలో ఉన్న అనేక మంది అధికార్లు, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు చిన్నతనంలో అమ్మ భాషలో అభ్యసించిన వారే. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సత్యం.
- సి. సాయిమనస్విత, విజయవాడ
కల్తీ నిరోధంపై నిర్లక్ష్యం తగదు
కల్తీ నూనెలను తయారుచేసేవారిని గుర్తించి ఫ్యాక్టరీలు సీల్ చేస్తారనుకుని కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు లేవని చెప్పవచ్చు.