ఉత్తరాయణం

కంటితుడుపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టమేమో కాని ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమకు గురౌతూనే ఉన్నారు. రాజకీయ అవసరాలకోసం అధికార పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వ నేతలు రాజీపడిపోతూ ఆకర్షణీయమైన ప్రకటనలు, వాగ్దానాలు చేస్తూ ప్రజలను దశాబ్దాలుగా మభ్యపెడుతూనే ఉన్నారు. దశాబ్దకాలం పాటు రాష్ట్రం నుండి అత్యధిక ఎంపిలను ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సుస్థిరతకు పరోక్షంగా పాటుపడిననా రాష్ట్రానికి రావలసిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజల తలరాత మారలేదు. రెండు రాష్ట్రాలలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్దేశించిన ప్రత్యేక పథకానికి నాలుగేళ్ల క్రితం రూ.60 వేలు కేటాయించాలని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కూడా ఒక్క నయాపైసా రాలేదు. కేంద్రం నుండి నిధులు వస్తాయన్న భరోసాతో రెండు తెలుగు ప్రభుత్వాలు పోటీలు పడి పథకాలను రూపొందించుకుంటున్నాయి. కేంద్రం నుండి ఆర్థిక సాయం అందే జాడ కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేంద్రం ఈవిధంగా నిర్లక్ష్య ధోరణి అనసరిం చడం వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలను అసంతృప్తి ఆవరి స్తోంది. ఇప్పటికైనా కేంద్రం నిధులు విడుదల చేయాలి.
- సి. సాయిమనస్విత, విజయవాడ
చదువులపై చెదపురుగులు
ఒకనాడు పుస్తకాలను తినేవి చెద పురుగులు
ఈనాడు విద్యార్థుల మస్తకాలను తింటున్నాయి
రాజకీయపు చెద పురుగులు-
ఒకనాడు విద్యను బోధించే ఉపాధ్యాయులు-
ఈనాడు బోధిస్తున్నారు అవాస్తవిక విప్లవాల అధ్యాయాలు-
ఆదర్శాలతో భవిష్యత్తు దిద్దుకోవలసిన విద్యార్థులు-
అర్థంకాని ఆవేశంతో అనర్థాలవైపు వెడుతున్నారు-
విశ్వవిద్యాలయాలలోనే కాదు-
వీధుల్లో, రహదారుల్లో రాత్రింబవళ్ళు పరుగులు తీస్తున్నారు-
యువశక్తే దేశానికి భవితవ్యం-
ఆ శక్తినే చేస్తున్నాయి చెద పురుగులు నిర్వీర్యం-
ఎవరు దీనికి బాధ్యులు- నీవూ! నేనూ! అందరం-
వెరసి భారతీయ సమాజం!- ఔను! సమాజమే!-
హితము చెప్పని సాహిత్యం- శృతికలవని సంగీతం
మతి తప్పిన కళారంగం- గతి తప్పిన ప్రగతి గమనం-
ధన సంపాదనలో ఉన్న తత్పరత, సంతానం పట్ల లేని పెద్దలు-
ఆలన! లాలనే కాని! పాలన, చెప్పని వృద్ధులు-
అధికార వ్యామోహమే కాని దేశం పట్టని రాజకీయపు గ్రద్దలు-
వదలని చెద పురుగులై చదువుల మొదళ్ళను తినేస్తున్నాయి
చదువరుల మెదళ్ళకు చెరపు చేస్తున్నాయి-
వెరసి!- సమాజ సంస్కృతి చట్టబండలైపోతున్నది
తస్మాత్! జాగ్రత్త!
- ఉమాపతి బి.శర్మ, హైదరాబాద్
నాటక రంగాన్ని ఆదరించాలి
నాటక రంగం ఎంతో విశిష్టమైనది. పాత్రోచితమైన వేషధారణతో, అప్పటికప్పుడు ప్రేక్షకుల ముందు ప్రదర్శింపబడేవి కాబట్టి నటీనటులు బహుశ్రద్ధగా సాధన చేసి, అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకులను రంజింపజేసేవారు. ఎంత పెద్ద కథాంశమైనా మొత్తం గుర్తుంచుకొని, అప్పటికప్పుడు మొత్తం ప్రదర్శింపజేయడం కత్తిమీద సామే. అలాంటి గొప్ప ప్రతిభను చూపించే నాటక కళాకారులకు ఏ కళాకారులూ సాటిరారు. ఎంతోమంది నాటి మేటి సినీ నటుల నటనకు ప్రాణంపోసింది నాటక రంగమే. ఆనాటి నాటకాలు ప్రేక్షకులలో పురాణ విజ్ఞానాన్ని పెంపొందించడమేగాక సమాజాన్ని జాగృతం చేసేవి. అటువంటి నాటక రంగం కనుమరుగవడం మన దురదృష్టం. రానురాను ప్రేక్షకుల నిరాదరణకు గురై అంతరించింది. దీనికి తిరిగి ప్రాణప్రతిష్ట చేయాల్సిన బాధ్యత అధికారులదే. నాటక రంగాన్ని ప్రోత్సహించి, కళాకారులను ఆదరించాలి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో వివిధ భాషా వాచకాలలోని కథలను సంభాషణల రూపంలోకి మార్చి విద్యార్థులచే ప్రదర్శింపజేయాలి. చూస్తున్నవారిలో ఆసక్తి పెరగాలి. సిని మాలు రాకముందు కేవలం నాటకాలనే ప్రజలు ఆదరిం చారు. నాటక రంగ కళాకారులంటే అప్పట్లో ఎంతో గౌరవం ప్రపత్తులుండేవి. నాటక కళను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్