సబ్ ఫీచర్

విద్యాశాఖతో చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో విద్యాశాఖని అవినీతి చెదలు తినేస్తున్నాయి. విద్యాశాఖలో గత ప్రభుత్వ అధికారంలో ఉండగా ఉప విద్యాశాఖాధికారుని నియామకానికి నోటిఫికేషన్ జారీచేసి వ్రాతపరీక్షలకు భారీ మొత్తాల్లో వసూలుచేసి ఒకే సామాజిక వర్గానికి చెందినవారిని ఎంపిక చేశారు అనే ఆరోపణలున్నాయి. వీరందరూ దొడ్డిదారిలో అధికారులైపోయారు. అక్రమ సంపాదనను అలవాటుగా మార్చుకొని అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సరసాదేవి వంటి తిమింగలం అప్పట్లో పట్టుకున్నారు. తాను నోరు విప్పితే కొండలు కదుల్తాయంటూ టీవీల్లో వార్తలముందు ఆమె చెప్పింది. కొండ కదల లేదు. కానీ వెంట్రుకలు మాత్రమే ఊడాయి. అంటే అవినీతి పరులందరూ తప్పించుకున్నారు. అవినీతి ఆశ్రీత పక్షపాతం వంటివి ఈ శాఖలో నిత్యకృత్యం. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం పరవు ప్రతిష్ఠ జనబాహుళ్యంలో అంటకాగుతుండటం విధి వైచిత్రం. కొందరు విద్యాశాఖ అధికారులు నీతిబాహ్యమైన చేష్టలు చేస్తున్నారు. కొందరు మహిళా ఉపాధ్యాయినులను ఉప విద్యాశాఖాకార్లు జిల్లాఅధికారులు లైంగిక వేధింపులకి పాల్పడున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. గతంలో కృష్ణా జిల్లాలో పనిచేసిన ఒక జిల్లా విద్యాశాఖాధికారి లైంగిక కార్యకలాపాల గొడవలు రెచ్చకెక్కాయి. తన భార్య ద్వారా ఈ విషయాలు బయటకొచ్చి మంత్రుల స్థాయిదాకా పంచాయితీలు వెళ్ళాయి. సదరు అధికారి పూర్తిగా మద్యపాన ప్రియుడు పరస్ర్తిలోలుడు అవటంతో భార్య సంబంధిత మంత్రివద్దకి వెళ్ళి కన్నీరు మున్నీరైందని మంత్రి వారిని మందలించినట్లు టీచర్లు చెప్పుకుంటున్నారు. విద్యాశాఖకి ఇటువంటి అధికారులని నియమించటం వల్ల కాస్తోకూస్తో ఉన్న పరువు బజారునపడుతోంది. సదరు అధికారి విజయవాడ హోటళ్ళలో తమతమ ప్రియురాండ్రతో తరచూ వస్తుంటారని ఉపాధ్యాయులు సమాచారం తెలిపారు. వాస్తవంగా విద్యాశాఖలో చీమచిటుక్కుమంటే అందరికీ తెల్సిపోతుంది. పైగా ప్రచారం కూడా వేగంగా అయిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న వికృత వింతలకి విద్యాశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కర్నూలు విద్యాశాఖాధికారి లైంగిక వేధింపు దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో చక్కెర్లు కొట్టాయి. నిర్లజ్జగా నిస్సిగ్గుగా సదరు అధికారి ప్రవర్తన పట్ల అతని యొక్క జుగుప్సాకరమైన శైలి పట్ల జనం అసహ్యించుకుంటున్నారు. అయినా ఇటువంటి వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించకుండా తగిన చర్యలు తీసుకొని సకాలంలో స్పందించి ఉంటే కథ వేరే రకంగా ఉండేది. లోకం అంతా కోడై కూశాక మొద్దునిద్ర నుండి లేచిన అధికార వర్గం చర్యలు చేపట్టింది. ఇటువంటి నీతి బాహ్యమైన చీడపురుగుల గురించి ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు ఉంటుంది? సదరు అధికారి యొక్క గత చరిత్ర కూడా ఇటువంటిదే అని అంటున్నారు. విద్యాశాఖలో అవినీతి నీతి బాహ్యమైన పనులు చేయటానికి ఎవరూ వెనుకాడే పరిస్థితిలో లేరని టీచర్లు చెప్పుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలో రాష్టప్రతి అవార్డు గ్రహీత అయిన ఒక ప్రధానోపాధ్యాయుడు చల్లపల్లి మండలంలో పనిచేస్తూ పాఠశాలలో అదనపు తరగతులు అంటూ తరగతులు నిర్వహించి పదవ తరగతి విద్యార్థినులను లైంగిక వేధింపులు గురిచేసి ఒక విద్యార్థిని లొంగదీసుకొని కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయి మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. టీవీలు, పత్రికల్లో వార్తలొచ్చాయి. సదరు విద్యార్థిని వేరే కళాశాలకి వెళ్ళినప్పటికీ ఆ ఉపాధ్యాయుడు ఆమెను ఈ విధంగా హింసించి మరణానికి గురిచేశాడని వార్తలొచ్చాయి. అటువంటి ఉపాధ్యాయుడి అనైతిక, లైంగిక, కార్యకలాపాల విషయంపై అనేక ఫిర్యాదులున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు లంచాలు తిని ముందస్తుగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవటం జరిగింది. అతనికి పైగా ప్రతిష్ఠాత్మకమైన రాష్టప్రతి అవార్డుకి సిగ్గులేకుండా ప్రతిపాదించటం జరిగింది. లంచాలు ఏ స్థాయిలో తిన్నారో దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? పైకి అంతా బాగున్నట్టు నటించే ఇటువంటి దుర్మార్గులకు ప్రభుత్వం ఎటువంటి శిక్ష విధించాలి? పోనీ తెలియక రాష్టప్రతి అవార్డు ఈ కీచక ఉపాధ్యాయుడికి ఇచ్చినా అతనికి ఇటువంటి అవార్డుకి అర్హత కోల్పోయినందున తిరిగి వెనక్కి తీసుకుంటున్నారా అదీ లేదు. వాస్తవంగా అయితే ఈ అవార్డుకి సిఫారుసుచేసిన వారందరినీ శాఖాపరంగా దర్యాప్తుచేసి వెంటనే సస్పెండు చేయాలి. అంతేకాకుండా అతని అవార్డును రద్దుచేస్తున్నట్లు వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలి. కనీసం అటువంటి దిద్దుబాటు చర్యలు ఏమాత్రం చేయకుండా సదరు మాజీ ప్రధానోపాధ్యాయుడు సమర్పించిన దక్షిణ తాంబూలాలు తిని హాయిగా మళ్ళీ నిద్దరవుతున్న అధికారులున్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నయవంచకులైన కొందరు ఉపాధ్యాయులకి అవార్డులు ఇచ్చినందున పాపప్రక్షాళన నిమిత్తం వెంటనే ఆ ఉపాధ్యాయుడికి ఇచ్చిన అవార్డును రద్దుపరస్తున్నట్లుగా ప్రకటించి అవార్డుకి అటువంటి ఉపాధ్యాయుడిని సిఫారసు చేసిన అధికారులు క్రింది స్థాయి నుండి పై స్థాయిదాకా అందరిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టి తగిన శిక్షణలు విధించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఇటువంటివారికి అవార్డులకి సిఫారసు చేస్తున్నందున అందర్నీ బాధ్యుల్నిచేస్తూ తగిన విధంగా కఠినంగా శిక్షించాలి. రాష్టప్రతి అవార్డు పరువుప్రతిష్ఠ కీచకోపాధ్యాయుల అధికారులవల్ల అవినీతివల్ల దిగజారిపోతోంది. రాష్టప్రతి భవన్ ఈ సంఘటనపై చర్యలకి ఆదేశించాలని టీచర్లు అనుకుంటున్నారు.

- పిడుగు రామలింగయ్య