మెయన్ ఫీచర్

దోపిడీ తండాలకు ‘దళారీ’ల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక రాజకీయ పక్షాలవారు ఆ సంస్థవద్ద ‘అంతో ఇంతో’ పుచ్చుకొని ఉన్నారన్న సందేహం అతార్కికం కాదు..... బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యాజమాన్యాలు ‘ఇచ్చుకొనడం’ రాజకీయవేత్తలు ‘పుచ్చుకొనడం’ ప్రపంచీకరణ వ్యవస్థీకరించిన ‘దోపిడీ’ స్వభావంలో భాగం. ‘సందేహాని’కి ఇది సాధారణ ప్రాతిపదిక! స్విట్జర్లాండ్ వారి నెజల్- నెస్లే- సంస్థవారి ‘మ్యాగీ’ సేమ్యాలు మళ్లీ మన దుకాణాలలో ప్రత్యక్షమయ్యాయి. ‘సందేహాని’కి ఇది ప్రత్యేక ప్రాతిపదిక!! మ్యాగీ సేమ్యాలలో కల్తీ అయిన ‘సీసం’, మోనోసోడియం గ్లుటమేట్- ఎమ్‌ఎస్‌జి- వంటి రసాయన విషాలను మన దేశ ప్రజలు దశాబ్దులపాటు అధిక ధరలకు కొని ఆరగించారు. ఈ ‘మ్యాగీ’ సేమ్యాలు గొప్ప రుచికరంగా ఉన్నాయన్న భ్రాంతికి ‘నాలుకలు’, ‘ముక్కులు’ గురికావడానికి కారణం ‘ఎమ్‌ఎస్‌జి’వంటి విష పదార్థాలు! రుచి పుట్టించిన ఈ ‘విషాలు’ దీర్ఘకాలంపాటు ఈ మ్యాగీ సేమ్యాలను తిన్నవారిని చిత్రవిచిత్ర వ్యాధులకు గురిచేశాయి. ఎలాంటి వ్యాధులు సంక్రమించాయన్న వాస్తవం ఎప్పటికీ నిగ్గుతేలదు!!
మ్యాగీ సేమ్యాలు తినడంవల్లనే ఫలానా వ్యక్తికి ఫలానా మానసిక రోగం లేదా శారీరక రోగం వచ్చిందని ఒక ‘వైద్య సంస్థ’ నిర్ధారించిందనుకోండి!! వెం టనే మరో పది వైద్య సంస్థలు రంగంలోకి దిగిపోయి, ‘‘అబ్బే ‘మ్యాగీ’ సేమ్యాలు నిరపాయకరమైనవి, పోషక పదార్థాలు నిండినవి, బలవర్ధకాలు, అని నిర్ధారిస్తాయి. ఇలా నిర్ధారించడానికి వీలుకల్పిస్తున్న వ్యవస్థ పేరు ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్!! ‘మ్యాగీ’ సేమ్యాలను నిషేధించడం ‘‘అసహిష్ణుత’’కు ప్రతీక అన్న ప్రచారం కూడ మొదలైపోతుంది. ‘స్టాండర్‌డ్స్ అండ్ పూర్స్,’ ‘మూడీస్’వంటి దళారీ సంస్థలు’’ భారతదేశంలో అసహిష్ణుత పెరిగిపోయింది, ఇలా అయితే ఆ దేశంలో విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెట్టవు... భారతదేశపు పరపతి- సావరిన్ రేటింగ్- దివాలాతీసే స్థాయికి పడిపోతుంది జాగ్రత్త’’అని హెచ్చరిస్తాయి! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు ఇలా హెచ్చరికలు చేసే ‘స్వచ్ఛంద’ అంతర్జాతీయ సంస్థలు ‘దళారీ’లు! ‘‘తినే హక్కును, తిండిని ఎంపిక చేసుకునే హక్కును కాలరాస్తున్నారు..... మేము ఏమి తినాలో కూడ మీరే నిర్ణయిస్తారా??’’అని అంటూ ‘ఉద్యమకారుల’ ముసుగేసుకున్న బౌద్ధిక బీభత్సకారులు దృశ్యమాధ్యమాల వేదికలనుంచి పెద్ద నోళ్లతో అరచి ఆర్భాటం చేస్తారు!! నేజల్ వంటి బహుళ జాతీయ సంస్థలనుంచి ‘‘అంతో ఇంతో’’ పుచ్చుకునేవారు రాజకీయ రంగంలో మాత్రమే కాదు, అన్ని రంగాలలోను ఉన్నారు! అందువల్ల మళ్లీ దుకాణాల నుండి మన ఇళ్లకు చేరుతున్న ‘మ్యాగీ సేమ్యాల’ను నిరోధించడం బహుశా ఇక సాధ్యంకాదు!! నిషేధించినట్టు అభినయించిన కేంద్ర ప్రభుత్వమే ‘మ్యాగీ’ సేమ్యాలు మళ్లీ మన దుకాణాలను ముంచెత్తడానికి దోహదం చేసింది.... ప్రతిపక్షాలవారు సైతం నిరసించడం లేదు, నోరెత్తడం లేదు! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ మాయామృగజాలం ఇదంతా!!
దోచుకుంటున్న విదేశీయ సంస్థల పట్ల మన మధ్యతరగతి జనాలకు సైతం మక్కువ ఎక్కువ! స్వదేశీయ సంస్థల ఉత్పత్తులు నాసిరకానికి చెందినవన్న భ్రాంతి మన నరాలలో తిష్ఠవేసి ఉంది! చిన్న పిల్లలకు నాయనమ్మలు చెప్పే విచిత్ర కథ ఒక ఉండేది.... పున్నమినాటి చంద్రుడు గుండ్రంగా ‘తెల్లటి రొట్టె’వలె ఉంటాడట! పాలూ గోధుమ పిండి కలిపి చేసి ఉండవచ్చు, లేదా బియ్యం పిండి వెన్న మర్దించి చేసి ఉండవచ్చు! దేవతలు ఈ గుండ్రటి రొట్టెలాంటి చంద్రుడిని రోజూ కొంచెం కొరికి తింటుంటారట, అందువల్ల పదిహేను రోజులయ్యేసరికి ‘రొట్టె’ మొత్తం అయిపోతుంది. అమావాస్యనాడు అందుకే ‘చంద్రుడు’ ఉండడు మరి! ఇప్పుడు ‘‘దేవతలే’’లేరు, ‘‘పూర్వం దేవతలు’’ మాత్రం విదేశాలనుంచి మన దేశంలో తిష్ఠవేశారు. ఈ ‘‘పూర్వ దేవతలు’’ బహుళజాతీయ వాణిజ్య సంస్థల రూపమెత్తి ఉన్నారు. అందువల్ల ‘కథ’ ఆకాశంలో జరగడం లేదు. మన దేశంలోను, మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలోను చొరబడిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన జీవితాలను కొరుక్కొని తింటున్నాయి. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు బంగారపు మృగాలు! వాటి కోరల ‘కాట్లు’ మనకు చాలా హాయిని కల్గిస్తుండడం నడుస్తున్న కథ. అందువల్లనే మనం ‘నెజల్’వారి ‘మ్యాగీ’ సేమ్యాలను అధిక ధరలకు కొని ‘ఆబ’గా తింటున్నాము. సాలీనా మూడువేల కోట్ల రూపాయల ‘మ్యాగీ’ సేమ్యాలను ‘నెజల్’ కంపెనీవారు మన దేశంలో అమ్మి ఆ సొమ్మును తమ దేశానికి తరలిస్తున్నారట! ఈ అమ్మకాల విలువ ఆరువేల కోట్ల రూపాయలన్న ‘పాఠాంతరం’ కూడ ఆమధ్య ప్రచారమైంది. ‘‘అయ్యో పాపం ఐదు నెలల నిషేధంవల్ల ‘నెజల్’ సంస్థ వారికి ఎంత నష్టం వాటిల్లిందో... ’’అని అంటూ ‘‘మానవీయ’’- హ్యూమన్ ఇంటరెస్ట్- కథనాలను ప్రచారంచేసిన వారూ ఉన్నారు. అలాంటి కథనకర్తలకు సైతం ‘నెజల్’ సంస్థనుండి ‘‘అంతో ఇంతో’’ లభించి ఉండవచ్చు!
ఎనబయి గ్రాముల మ్యాగీ సేమ్యాలను ‘నెజల్’వారు పాతిక రూపాయలకు అమ్ముతున్నారట! ప్రచారవౌతోంది! కానీ ‘పతంజలి’ అన్న స్వదేశీయ సంస్థవారు తమ ‘ఆయుర్వేద’ పద్ధతిలో తయారైన సేమ్యాలను- డెబ్బయి గ్రాములు పదహైదు రూపాయల చొప్పున- విక్రయించడానికి పూనుకున్నట్టు కూడ ప్రచారవౌతోంది!! ‘పతంజలి’వారు ఇలా చౌకగా ‘సేమ్యా’లను అమ్మినట్టయితే, స్విట్జర్లాండ్ నుండి ఇంత దూరం ‘తోడేలు కడుపు’ చేతపట్టుకొని తరలివచ్చిన ‘నెజల్’వారికి ఎంత నష్టం?? అందువల్ల ‘పతంజలి’ సంస్థవారు తమ సేమ్యాలను అమ్మడానికి వీలులేదని ‘మానవీయ’ దృక్పథంతో ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’వారు నిర్ధారించారట! ‘పతంజలి’ సేమ్యాలను అమ్మడం నిబంధనలకు వ్యతిరేకమట!! ప్రస్తుతం ‘్భరత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ’ - ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- వారు కొత్త అనుమతులనివ్వడానికి వీలైన నిబంధనలు ఏవీ లేవట! ఉన్న నిబంధనలను గత ఆగస్టులో సుప్రీంకోర్టు రద్దుచేసిందట! కొత్త నిబంధనలను రూపొందించుకోవాలని ఆదేశించిందట! అందువల్ల నూతన ఉత్పత్తుల ‘ప్రమాణాల’ను పరిశీలించి అనుమతి ఇవ్వడానికి వీలుగా ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు ని బంధనలను మళ్లీ రూపొందిస్తున్నారట! ఆ నిబంధనలు రూపొంది అమలులోకి వచ్చేవరకూ కొత్తగా ‘సేమ్యాల’ను కొని ఏ ఇతర తిరుబండారాలను కాని ఉత్పత్తిచేసి అమ్మడానికి ఏ సంస్థకు కూడ ఈ ‘ప్రభుత్వ సంస్థ’వారు అనుమతిని ఇవ్వరట!! అందువల్ల ‘పతంజలి’వారు తయారుచేసిన సేమ్యాలను అమ్మడానికి వీలులేదట! ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు చేస్తున్న ఈ విచిత్ర వాదాన్ని ‘పతంజలి’ సంస్థతో సహా దేశంలోని అనేక ఆహార ఉత్పాదక సంస్థలు కూడ వ్యతిరేకిస్తున్నాయి. కొత్త ‘నిబంధనలు’ వెలువడేవరకు పాత నిబంధనలను పాటించడానికి వీలుగా ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు సుప్రీంకోర్టును అనుమతి అడిగి ఉండవచ్చు.... అడగడం లేదు! ఎందుకనో?? కొత్త నిబంధనలు రూపొందేవరకూ ‘నెజల్’ వంటి సంస్థలు తమ మ్యాగీ సేమ్యాలను, ఇతర తినుబండారాలను అధిక ధరలకు గుత్తగంపగా అమ్ముకోవాలని మాత్రమే ప్రభుత్వ ప్రమాణాల సంస్థవారు భావిస్తున్నారా?? ‘కల్పాంతం’వరకు కొత్త నిబంధనలు రాకపోతే??
పాత నిబంధనలు రద్దయినప్పుడు ‘నెజల్’ వంటి విదేశీయ సంస్థలకు గతంలో ఆ ‘పాత నిబంధనల’కింద ఇచ్చిన ‘అనుమతి’కూడ రద్దయిపోవాలి! పై ‘నెజల్’వారి సేమ్యాలను ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారే గత జూన్‌లో నిషేధించారు!! ముంబాయి హైకోర్టు ఆగస్టులో ‘నిషేధాన్ని’రద్దుచేసింది. కానీ ప్రమాణాలను నిర్ధారించే నిబంధనలు దోషబూయిష్ఠంగా ఉన్నాయన్న కారణంగా సుప్రీంకోర్టు వాటిని రద్దుచేసిందట! అందువల్ల ‘నెజల్’వంటి సంస్థలు కూడ మళ్లీ ఉత్పత్తులను ప్రారంభించడానికి వీలుగా కొత్త నిబంధనల ప్రకారం ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ అనుమతి తీసుకోవాలి! ఇలా అనుమతి తీసుకోకుండానే ‘నెజల్’ తన ‘మ్యాగీ సేమ్యాల’ను మళ్లీ దుకాణాలలో నింపింది! విదేశీయ సంస్థలు ‘అనుమతి’ తీసుకోనక్కరలేదు, స్వదేశీయ సంస్థలు మాత్రం అనుమతి తీసుకోవాలి! ఇదే ప్రపంచీకరణ మాయాజాలం!! ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా సంస్థ మన దేశంలో పైనుండి కింది వరకూ చాలామందికి కోట్లాది రూపాయల లంచాలు చెల్లించిందని అమెరికా ప్రభు త్వం నిర్ధారించింది. ఈ నిర్ధారణలోని నిజాలు గత నెలలో వెల్లడయ్యాయి. అందువల్ల ‘నెజల్’ సంస్థవారు కూడ గతంలోను, ఐదు నెలల నిషేధం సమయంలోను మన దేశంలోని రాజకీయ వేత్తలకు, దళారీలకు, అధికారులకు, శాస్తవ్రేత్తలకు ‘లంచాల’ను చెల్లించిందా? అన్న విషయమై ప్రభుత్వ నేర పరిశోధక విభాగాలవారు దర్యాప్తుజరపడం న్యాయం.....
మ్యాగీ సేమ్యాలలో కల్తీ రసాయన విషాలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా ఉన్నాయని ధ్రువపడిన తరువాతనే ‘్భరత ప్రమాణాల సంస్థ’వారు వాటిని జూన్ నెలలో నిషేధించారు! ముంబయి హైకోర్టు ఈ నిషేధాన్ని రద్దుచేసింది! ఈ తీర్పును సవాలుచేస్తూ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ వారు సుప్రీంకోర్టులో ఎందుకని ‘అప్పీలు’ దాఖలుచేయలేదు?? క్రీస్తుశకం 2006లో రూపొందిన ‘ఆహార భద్రత, ప్రమాణాల పరిరక్షణ’ చట్టం ప్రకారం ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ఏర్పడి ఉంది, అంతకు పూర్వం ఉండిన వివిధ చట్టాలను వివిధ ‘నియంత్రణ’ సంస్థలను ఏకీకృతంచేసి ఈ కొత్త చట్టాన్ని, అఖిల భారత స్థాయి సంస్థను ఏర్పాటుచేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ’మంత్రిత్వశాఖవారి ఆధ్వర్యంలో ఈ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ పనిచేస్తోంది! అందువల్ల బొంబాయి ఉన్నత న్యాయస్థానంవారు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘నివేదన’ను దాఖలు చేయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం వారిది! కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఈ బాధ్యతను విస్మరించింది?? ‘అప్పీలు’ దాఖలుకాకపోవడం వల్ల మాత్రమే ‘నెజల్’సంస్థ మళ్లీ విషపూరితమైన సేమ్యాలను మన నోళ్లకెత్తడానికి నడుం బిగించింది! ‘మాగీ’ సేమ్యాలు మళ్లీ దుకాణాలలో ప్రత్యక్షమయ్యేవరకు వౌనంగా ఉండిన ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు నవంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టులో ‘విచిత్రమైన ‘అప్పీలు’ దాఖలు చేశారు.... మాగీ సేమ్యాలపై విధించిన నిషేధాన్ని రద్దుచేయడాన్ని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు సుప్రీంకోర్టులో సవాలు చేయలేదు. అందువల్ల ‘అప్పీలు’్ర పాతిపదికగా సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పినప్పటికీ ‘మ్యాగీ సేమ్యాల’ అమ్మకాలు ఆగవు. ఆ విధంగా జాగ్రత్తలను ‘ప్రభుత్వ సంస్థ’వారు తీసుకున్నారు.
‘్భరత ప్రమాణాల సంస్థ’వారి ప్రయోగశాలల్లో పరీక్షించే పద్ధతులు దోషభూయిష్ఠంగా ఉన్నాయని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది! మూడు ఇతర ప్రయోగశాలల్లో మ్యాగీ సేమ్యాలను పరీక్షించాలని నిర్దేశించింది! ఇలా తమ ప్రయోగశాలలోని పరీక్షా విధానాలను తప్పుపట్టిన ముంబయి హైకోర్టు వ్యాఖ్యలను రద్దుచేయాలని మాత్రమే ‘ప్రభుత్వ ప్రమాణాల సంస్థ’వారు సుప్రీంకోర్టునకు నివేదించారట! ‘మ్యాగీ సేమ్యాలు’ మళ్లీ చెలామణి అవుతుండడం పట్ల తమకు అభ్యంతరం లేదని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’వారు ప్రకటించారు కూడ!! కల్తీ సేమ్యాలను అమ్మినందుకు నెజల్ సంస్థకు రు.640 కోట్లు పరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో దావావేసింది!! ‘నెజల్’ సేమ్యాలు ‘‘మంచివన్న’’మాట నిజమైతే ఈ సంస్థ పరిహారం కూడా బహుశా చెల్లించదు.

- హెబ్బార్ నాగేశ్వరరావు