సంపాదకీయం

అవినీతి భవనం కూలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతికి ఆకాశమెత్తు ప్రతీక అయిన అంతస్థుల ఆదర్శ భవనాన్ని కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి బొంబాయి హైకోర్టు ఉత్తరువులు జారీ చేయడం సందర్భోచిత పరిణామం. రక్షణ రంగాన్ని అగస్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల అవినీతి కుదుపుతున్న సమయం లో ముంబయి ఉన్నత న్యాయస్థానం శుక్రవారం చెప్పిన తీర్పు సరికొత్త ప్రకంపనం..ఆదర్శ భవన సముదాయం రక్షణ రంగంలో పెరిగిన మరో అవినీతి పుట్ట! 2010లో ఈ పుట్ట పగిలినప్పటినుంచి అనేక మంది ప్రముఖ రాజకీయవేత్తలు మహారాష్ట్ర అధికారులు ఉన్నత సైనిక అధికారులు అనేకమంది గొప్ప అలజడికి గురి అయి ఉన్నారు. మహారాష్ట్ర తత్‌కాల ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తమ పదవికి రాజీనామా చేయక తప్పకపోవడం అలజడికి శ్రీకారం. అర్హత లేని ఘరానాలు కార్గిల్ సమర వీరులకోసం నిర్మించిన ఇళ్లను కాజేయడం ఆదర్శ అవినీతి ఇతివృత్తం. 2008 నవంబర్‌లో పాకిస్తానీ జిహాదీలు ముంబయిని ముట్టడించి జరిపిన భయంకర బీభత్స కాండను నిరోధించడంలో విఫలమైనందుకు అప్పటి ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ రాజీనామా చేయడం అశోక్ చవాన్‌కు కలసివచ్చిన అదృష్టం. కానీ 2010లో ఆదర్శ అవినీతి గృహం వ్యవహారం రట్టయిపోవడంతో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయవలసి వచ్చింది. మొదట మొరాయించిన అశోక్ చవాన్ చివరికి తప్పుకోక తప్పింది కాదు. ఆయన స్థానంలో పృథ్వీరాజ్ చవాన్ మహారాష్ట్ర గద్దెనెక్కాడు. అయినప్పటికీ ఆదర్శ ఆవినీతి సృష్టించిన ప్రకంపనలు మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయక మానలేదు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్-జాతీయతా కాంగ్రెస్ కూటమి పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఆదర్శ అవినీతి! నిర్మాణ నియమాలకు, హరిత నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఆదర్శ గృహ సముదాయాన్ని నిర్మించిన నిర్మాణ సహకార సంఘం వారికి కాంగ్రెస్ ప్రభుత్వాల అండదండలు మెండుగా ఉన్నాయన్నది ధ్రువపడిన వాస్తవం. కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం వారి ధీమాకు ప్రాతిపదిక! నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఈ ముప్పయి ఒక్క అంతస్తుల బృహత్ భవనాన్ని కూలగొట్టాలని కాంగ్రెస్ నిర్వాహక కేంద్ర మంత్రి వర్గంలో పర్యావరణ మంత్రిగా ఉండిన జయ్‌రామ్ రమేశ్ ఆదేశించడం ఆదర్శ నిర్మాణ సంస్థ ఊహించని పరిణామం. మూడు నెలలలోగా ముప్పయి ఒక్క అంతస్థులను కూల్చి వేయాలని 2011 జనవరి 16న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఉత్తరువులు జారీ చేసారు. ఈ ఉత్తరువులను సవాలు చేసిన ఆదర్శ నిర్మాణ సంస్థ వారికి హైకోర్టులో చుక్కెదురు కావడం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగల పరిణామం...
అయితే, ఈ అవినీతి కట్టడాన్ని కూలగొట్టవలసిందిగా ఆదేశించిన హైకోర్టు పనె్నండు వారాలపాటు తీర్పు అమలు జరగకుండా తాత్కాలికంగా నిలిపివేయడం ఆదర్శ సంస్థ వారికి గొప్ప వెసులుబాటు. సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనడానికి వీలుగా ఇలా తాత్కాలికంగా తీర్పును నిలిపివేసినట్టు హైకోర్టు న్యాయమూర్తులు ఆర్‌జి కేల్‌కర్, ఆర్‌వి మోరే ప్రకటించారు. అందువల్ల ఆదర్శ భవన నిర్మాతలు అప్పీలు చేయడం ఖాయం. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం వారి నిర్ణయం వెలువడే వరకు ఈ భవనం నిలబడే ఉంటుంది..అవినీతికి మరో రూపంగా! రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన స్థలంలో నిర్మించిన ఈ భవనం ఎత్తు వంద మీటర్లు. ముంబయి కొలాబా ప్రాంతంలో నెలకొన్న రక్షణ శాఖ కార్యాలయాలు, స్థావరాలు, ఆయుధాగారాల సమీపంలో ముప్పయి మీటర్ల కంటె ఎత్తయిన భవనాలు నిర్మించరాదన్నది నిబంధన. కానీ ఇలా వంద మీటర్ల ఎత్తునకు ఈ భవనాన్ని నిలువునా సాగదీయడం ఆదర్శ సహకార సంఘం వారి అధికార ధీమాకు నిదర్శనం.
కానీ ఇలా హరిత నియమాలను ఉల్లంఘించడం అవినీతి నాటకంలోని ప్రధాన వైపరీత్యం కాదు. ప్రధాన వైపరీత్యం కార్గిల్ యుద్ధ వీరులకు జరిగిన అన్యాయం. 1999లో మన ప్రభుత్వం మైత్రి మత్తులో మునిగి ఉండిన సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని పాకిస్తానీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘోరంగా వంచించాడు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం ఉత్తర భాగంలో గల కార్గిల్ ప్రాంతంలోకి పాకిస్తానీ జిహాదీ, సైనికులు చొరబడి తిష్ఠవేయడం ఈ వెన్నుపోటు! పాకిస్తానీ చొరబాటు దారులను కార్గిల్‌నుండి గెంటివేయడానికి మన సైనిక దళాలు అనేకవారాలపాటు భీకర యుద్ధం చేయాల్సి వచ్చిం ది. అనేకమంది మన సమరవీరులు అమరులయ్యారు, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. కార్గిల్‌లో పోరాడిన సైనికుల కుటుంబాల కోసం ఇళ్లను నిర్మించడానికి ఆదర్శ సంస్థ ఏర్పడింది. ఏర్పడినప్పటినుంచి ఈ సంస్థ నిర్వాహకులు కార్గిల్ వీరులను వంచించారు. కార్గిల్ యుద్ధంతో సంబంధంలేని ఉన్నత సైనికాధికారులకు, సైనికులకు ఈ సంస్థలో ఇళ్లను కేటాయించారు. అవినీతి అంతటితో ఆగలేదు. ఇతర ప్రభుత్వ అధికారులకు, రాజకీయ వేత్తలకు, వారి బంధుమిత్ర పరివారాలకు సైతం ఆదర్శ నిర్మాణ సంస్థలో భాగస్వామ్యం ఏర్పడింది. సైనికులు ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు జరుపుకునే మైదానంలో కొంత భాగాన్ని ఈ సంస్థకు కేటాయించారు. కానీ సహకార సంస్థవారు అధికారంలో వుండిన అవినీతిపరుల సహకారంతో మరికొంత భూమి ఆక్రమించుకున్నారు. ప్రాంగణంలోని రోడ్లను కూడ ఆక్రమించి అంతస్థుల సంఖ్యను పెంచారు. చివరికి 2010లో ప్రవేశ అనుమతులు సైతం తీసుకోకుండానే ఇళ్లను కేటాయించారు. మూడు వందలకు పైబడిన ఇళ్లలో కార్గిల్ సైనికులకు కేటాయించింది కేవలం మూడు...!!
నిలువునా పెరిగిన అవినీతికి ఇదీ సాక్ష్యం! మూడు వందల ఇళ్లు ఎక్కడ? కార్గిల్ వీరులకు దక్కిన మూడు ఎక్కడ? ఈ దేశంలో పాతుకుపోయిన అవినీతిపరుల ధీమా ఇంతకంటె హీనంగా ప్రస్ఫుటించిన ఘటన మరోటి లేదు! అరవై ఆరు ఇళ్లను కార్గిల్‌తో సంబంధం లేని సైనికులకు కట్టబెట్టారు. మిగిలినవి రాజకీయ వేత్తలకు, ఉన్నత అధికారులకు దక్కిపోయాయి!