వీరాజీయం

అవిగో అల్లవిగో పంజాబ్, యు.పి.ల ఎన్నికల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది మొదట్లోనే అంటే 2017 యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పంజాబ్‌లో కూడా వోట్ల పండుగ- రెండూ కూడబలుక్కొని వచ్చేస్తున్నాయ్.
‘ఈ తల మీద పడ్డ నీళ్లు భుజాల మీదికి ఎంతసేపట్లో జారుతాయ్?’- అంటారు. అలాగే, చాలా కీలకమయిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, యివతల పూర్తి అయినట్లే, ఫలితాలు గూట్లో వున్నాయ్. అవతల అసలు దళితులు అధిక సంఖ్యలో వున్న పంజాబ్‌లోనూ- ఐదుసార్లు దళిత ప్రజాహృదయరాణిగా కుమారి మాయావతీ రాజ్యం ఏలిన, యు.పి.లోనూ ఎన్నికల ఢంకా మోతలు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో మ్రోగుతున్నాయ్. ఈపాటికి అర్ధమయిపోయే వుండాలి మహాజనులకు అసలు సంగతి. శ్రీమాన్ నరేంద్ర మోదీజీ అంబేద్కర్ మహాశయుని 125వ జయంతినాడు చేతులు మోడ్చి, శిరస్సొంచి, పారవశ్యంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలమైన ‘ఎంహూ’- అనగా యిప్పటి ‘అంబేద్కర్‌నగర్‌లో బాబాసాహెబ్ మీద ప్రశంసల వర్షం, హర్షం కురిపించాడు!’ మన పి.ఎమ్.
‘‘అసలు ఆయనవల్లనే నేనివాళ పి.ఎమ్. ఆఫ్ ఇండి యా- దటీజ్ భారత్ అయినాను’’- అని కూడా అనేశాడాయన.- తక్షణం ఉలిక్కిపడ్డదెవరు? ఉత్తరప్రదేశ్‌లో- బహుజనుల ఏకైక మహానాయకురాలు మాయావతిగారే.
‘‘అసలు రుూ పెద్దమనిషి ‘చాయ్‌వాలా’నన్నాడు. మరి వాళ్లకేం చేశాడు? తన కులం వాళ్లకేం చేశాడు?’’ అడిగిందామె. దళితులకు పట్టం కడతాడనీ, అంబేద్కర్ విగ్రహాల స్థాపనకే జనం మభ్యపడతారనీ అనుకోవద్దు. భాజపా చివరికి దళితుల్ని ‘‘గద్దెమీద కూకోబెట్టినా’’ వాళ్లు ఆర్.యస్.యస్.కి వెట్టిచాకిరీ చేయాల్సిందే. గానీ, బహుజనుల రాజ్యం రానేరాదు’’- అంటూ, ఆమె హెచ్చరించింది.-
అక్కడ మోదీగారు కొందరు బడా బౌద్ద సన్యాసుల్ని ‘బుక్’ చేసేసుకుని, వాళ్లని ఉత్తరప్రదేశ్ మారుమూలలకి - బౌద్ధం మీదా, అంబేద్కరీయం మీదా ప్రచారానికి పంపించాలన్న ప్రయత్నం చేస్తూండగానే బ.స.పా. నాయకురాలు కస్సుమంది. తన ప్రచార సాధనం, సింబలూ అయిన ఏనుగు లాగా ఘీంకారం చేసింది. అయితే మాయవతి మొదట్నుంచీ చాలా గడుసుతనం గల నాయకురాలే.
అగ్ర కులాల మద్దతూ, వోట్లూ వొదులుకోడం ఆమెకు యిష్టంలేదు.
కర్మకాలీ- కాంగ్రెస్ లాంటి ‘పాతకాపు’ దళితుల వోట్లు చీల్చుకుంటే రాగల ప్రమాదాన్ని గుర్తించి- తదనుగుణంగానే పావులు కదుపుతూ వచ్చింది కుమారి మాయాజీ.
పంజాబ్ రాష్ట్రం అంటే ‘‘సిక్కుల రాజ్యం’’అని మాత్ర మే తెల్సిన వాళ్లకి ఒక్క సంగతి చెప్పాలి. అక్కడ 32 శాతం మంది దళితులున్నారు. ఈ శాతం యు.పి.లో కేవలం 21 మాత్రమేనంటున్నారు. అంచేత 2017 క్యాలండర్ కాగితం లేవంగానే భాజపాకి బహుజనుల దయాదాక్షిణ్యాలు చాలా అవసరం అవుతాయి. మాయావతి గారి పార్టీ పంజాబ్‌లో పేద అగ్ర కులాలకి పది శాతం రిజర్వేషన్ యిస్తానంటూ భాజపాకి, ముందర కాళ్లకి బంధం వేస్తోంది.-
కేవలం ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటేనే దళితుల ఓట్లు ఎగబడి పడిపోతాయి- అప్పర్ క్యాస్ట్‌ల వాళ్లు కూడా- ఆకాశం అంతెత్తు బుద్ధ విగ్రహాలకి బోల్తాకొడతారని మాయాజీ అనుకోడం లేదు. ఒకవేళ అనుకుని వుంటే 2006లోనే బౌద్ధమతం స్వీకరించి వుండేది. తన గురువు, ఆరాధ్యుడు అయిన కాన్షీరామ్‌గారి అంత్యక్రియలను ఆమె బౌద్ధమత ఆచారం ప్రకారం చేయించింది.
నిజానికి కాన్షీరాంగారు బౌద్ధమతస్తుడు కాడు. ‘‘కానీ ఆయన మనసులోని మాట, అదీ’’- అన్నదామె.
‘‘మరి తమరు బౌద్ధం పుచ్చుకోరా?’’అంటే, ‘‘్ఢల్లీలో బసపా జెండా ఎగిరేదాకా, ఆ వూసెత్తొద్దు’’- అన్నదామె.
యు.పి.బ్రాహ్మలను మాయావతీ ఆ పోయినసారి డ్రమటిక్‌గా ఎత్తుకుపోయింది. ఆమెగానీ ఒకవేళ బౌద్ధం స్వీకరిస్తే 20 రకాల కఠిన ప్రతిజ్ఞలు చేయాల్సి వుంటుంది. అందులో ముఖ్యంగా - ‘బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్ని నమ్మకూడదు’- అన్నది వుంది.
‘‘హిందూ మతమే భారతీయ సంస్కృతి మీద ఒక కళంకం’- అంటూ చేయి జాచి అగ్ర కులాల ఓట్లు అడిగే వ్యూహరచన ఎక్కడైనా సాగుతుందా?’’- అనడిగాడో పొలిటికల్ పండిట్.- నిజమే గదా!
బై ది బై తాజాగా యుపిలో వో సర్వే జరిగింది.
ఉన్నపళాన ఎన్నికలు జరిగితే, యు.పి.లో బసపా పవర్‌లోకి వస్తుందీ. సపాపార్టీ సఫా అయిపోతుందీ- అంటున్నదా సర్వే. ఈలోగా మోదీజీ గడుసుగా- అంబేద్కర్‌ని హైజాక్ చేసేస్తే? మొదటికే మోసం రాదా? యిదీ బస పా- ‘్థంక్ టాంక్’ అభిప్రాయం అది. అద్సరే బుద్ధుడి బొమ్మలమీద అందరూ శ్రద్ధచూపెడతారు. ఎందుకంటే అవి అన్యమతస్థుల్ని- ముఖ్యంగా హిందువుల్ని ‘‘హర్ట్’’ చేయవ్. వివాదాతీతాలు. అందులోకీ వెర్రిబాగులోళ్లు హిందువులు. ‘‘బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం’- అని కూడా అనుకుంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపడ్డది. 125వ జయంతి చాలా కీలకం మరి.
‘‘ఈ విధంగా మనకి’’- అసలు అంబేద్కర్ మార్గమే తరుణోపాయం. ఆయన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్‌పటేల్‌ల సమతుల్యుడు’’అంటూ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీగారు వాక్రుచ్చారు కూడాను..
‘‘బై ది బై మన ప్రియాంకా గాంధీ బౌద్ధురాలు అనుకుంటాను’’ అన్నాడో బసపా యువజన నాయకుడు. ‘‘తెలియదు’’అన్నాను. కానీ, అది యిప్పుడు అంత అవసరమా?’’అన్నాడో కాంగ్రెస్ యువజనుడు-
ఏదిఏమయినా మోదీజీ- అమిత్‌షా కుశాగ్రబుద్దిమీద గాక, తన ‘పన్నాగం’-సారీ, ‘వ్యూహరచన’ అనాలి కాబో లు- మీదనే- ఆధారపడాలనుకుంటున్నట్లుగా వుంది. ప్రస్తుతం ‘‘అంబేద్కర్ నామమెంతో రుచిరా!’’- అంటున్నవి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఎన్నికలైన ‘అంజి’(అయిదు) రాష్ట్రాలలో భాజపాకి ఏమి లభిస్తుందో? అందరికీ తెల్సు.- (తెలీదా?)
అంచేత ముందే మేల్కొని- తాము పాలనలో పార్ట్నర్‌గావున్న పంజాబ్‌లో - అలాగే తమకి కూడా పాత చరిత్రగల యు.పి.లో ఎన్నికలకు ‘‘ఒక’’ మొహాలూ- ఒక ‘మాస్క్’ కావాలీ’’ - అన్నది తెలివైన యోచన. ఐతే మోదీజీని సరిగ్గా అంచనా వేయగల ధీశాలిని ఒక్క మాయావతియే.!
- బెటర్, సే లాంగ్ లివ్ అంబేద్కర్!