సబ్ ఫీచర్

ఉపాధ్యాయుడు సోషల్ ఇంజినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన సామాజిక ప్రక్రియ. ఒక మార్పు తీసుకురావాలంటే ఆ మార్పు యొక్క పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలిసి ఉండాలి. విద్య ద్వారా సమాజ పరివర్తన తీసుకురావాలని అంబేద్కర్ చెప్పాడు. విద్య ఒక రోడ్ రోలర్ అన్నాడు. విద్య ద్వారా సమాజంలో వున్న అసమానతలు చదును చేయాలన్నాడు. ఈ మార్పును తీసుకురావటానికై తరగతి గది ఒక సాధనం అన్నాడు. ఈ తరగతి గది యొక్క డ్రైవర్ ఉపాధ్యాయుడు. కాబట్టి మొదట టీచర్ సమాజాన్ని అధ్యయనం చేయాలి. సమాజంలో అసమానతలు ఎలా మొదలయ్యాయి? దానిలో ఎన్ని రకాల పొరలుంటాయి. ఆ పొరలు తన చుట్టుపక్కల ఉన్నాయా? వాటిని సంపూర్ణంగా అధ్యయనం చేస్తేనే సమాజంలో ఆ మార్పుకు ఉపాధ్యాయుడు కారణభూతుడు కాగలుగుతాడు. ఈ బాధ్యత స్వాతంత్య్రం రాకముందు ఉపాధ్యాయులపై ఉండేది కాదు. సమాజ పరివర్తన అనే లక్ష్యాన్ని సాధించడానికై ఉపాధ్యాయుడు సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దాన్ని అమలుపరచడానికి ఇతర దేశాల్లో ఏ ఎత్తుగడలు వేశారో ఏ విధమైన ప్రణాళికలు రచించారో అధ్యయనం చేయాలి.
తరగతి గదిని ఉపాధ్యాయుడు తన లక్ష్యసిద్ధి అనే రోడ్డుపై నడిపించాలి కాబట్టి ఆ రోడ్డుపై ఉండే ఎగుడుదిగుళ్లు, రహదారి మార్గాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఆ రోడ్డుపై తరగతి గది పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోవాలి. చేయబోయే మార్పువలన తరగతి గది చలనాన్ని ఊహించగలగాలి. ఈ చలనాలవల్ల తరగతి గది డొల్లకుండా సొమ్మసిల్లకుండా టీచర్ చూడాలి. తరగతి గదిని నిధానంగా, నిబ్బరంగా, శక్తివంతంగా లక్ష్యంవైపు నడిపించి మార్పును సున్నితంగా తీసుకురావాలి. కొన్నిసార్లు వెలుపలనుంచి కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి. తరగతి గది వూహించని ఆంకాలు రావచ్చును. ఆటంకాలను ఉపాధ్యాయుడైనా తొలగించాలి లేదా ఇతరుల సాయం తీసుకోనైనా తొలగించాలి. సమాజం పరివర్తన అనేది సిమెంట్ రోడ్డుమీద కారు నడిపించటం కాదు. జాగ్రత్తగా గతుకుల రోడ్లపై, అవకతవకల దార్లను పరిష్కరించుకుంటూ తరగతి గదిని జాగ్రత్తగా లక్ష్యంవైపు నడిపించాలి. ఉపాధ్యాయుడు తనకు తాను ప్రేక్షకుడిగా నిలుచోకూడదు. తనను తాను తరగతి గదిలో కీలక భాగస్వామిగా చూసుకోవాలి. ఆ పరివర్తన మొదలు తాను తెలుసుకోవాలి. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తరగతి గదిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. తరగతి గదిని నిర్వహించేటప్పుడు ఎన్ని మలుపులుంటాయో నడుస్తుంటే గానీ తెలియదు. ఆ లోతుపాతులను చూడగలిగిన వ్యక్తి ఉపాధ్యాయుడు. తరగతి గది నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటూ సునాయాస మార్గం తీసుకురావాలి. తరగతి గదిలో మార్పును బోధనతో తీసుకురావాలి. అందుకు ప్రధాన సాధకుడు ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయుణ్ణి సోషల్ ఇంజనీర్ అంటారు. సమాజ పరివర్తన తరగతి గదినుంచే జరిపే సామాజిక శాస్తవ్రేత్త ఉపాధ్యాయుడు.
బోధన ద్వారా పిల్లల్లో మార్పు బీజాలు పడతాయ. అవి వారు పెరిగిన కొద్దీ మొక్కలు, వృక్షాలుగా మారి వారు నిజమైన మార్పు చోదకులుగా రూపొందడానికి దోహద పడతాయ. ఆవిధంగా చిన్నతనంలో విద్యార్థులను మార్పు చోదకులుగా ప్రయాణించేందుకు వీలైన మార్గాన్ని ఉపాధ్యాయుడు చూపిస్తాడు. తమ గురువు చూపిన మార్గంలో పయనిం చిన విద్యార్థుల తమ టీచర్ ఆశించిన లక్ష్యాలను నెరవేరుస్తారు. కానీ ఇందుకు చాలా కాలం పడుతుంది. విత్తనం నాటగానే మొక్క మొలవదు కదా. అది పెరిగి పెద్దదిగా మారి, పూలు పండ్లు ఇచ్చే దశకు చేరుకోవడానికి సమయం పట్టినట్టే, దీనికి కూడా సమయం పడుతుంది. ‘్భవి భారత పౌరులు’ అన్నది అందుకే.

- చుక్కా రామయ్య