సంపాదకీయం

గోవధ ఆగేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి హైకోర్టు శుక్రవారం చెప్పిన విచిత్రమైన తీర్పువల్ల గోసంతతికి ఏర్పడి ఉన్న ప్రమాదం యధాతథంగా కొనసాగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గోవధ నిషేధపు చట్టం రాజ్యాంగ బద్ధమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని 48వ అధికరణ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది. ఆవులను, దూడలను పాడిపశువులను వధించడాన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నది ఈ అధికరణం నిర్దేశిస్తున్న మార్గదర్శక సూత్రం. అందువల్ల మహారాష్ట్ర ప్రభుత్వం వారి గోవధ నిషేధపు చట్టాన్ని హైకోర్టు ఆమోదించడం సహజమైన పరిణామం. కానీ చట్టంలోని ఐదవ, తొమ్మిదవ నిబంధనలలోని కొన్ని అంశాలను మాత్రం హైకోర్టు రద్దు చేసింది. ఇలా రద్దు చేయడం వల్ల మొత్తం చట్టం నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. ఆవుమాసం నిలువ ఉంచడం కొనుగోలు చేయడం, అమ్మడం, నేరమని ఐదవ నిబంధన నిర్దేశిస్తోందట. ఇలా నిలువ చేసిన వారిని కొన్నవారిని అమ్మినవారిని శిక్షించడానికి తొమ్మిదవ సెక్షన్ వీలు కల్పిస్తోందట. హైకోర్టు ఈ నిబంధనలను రద్దు చేయడం వల్ల కేవలం ఆవును వధించడం మాత్రమే నేరమవుతుంది. ఆవు మాంసాన్ని నిలువ ఉంచడం, అమ్మడం ఇప్పుడు నేరాలు కావు. అందువల్ల మహారాష్టల్రోని ఆవుమాంసం అమ్మే దుకాణాలు మూతపడవు. బయటి రాష్ట్రాల నుంచి వారు ఆవుమాంసం తెచ్చుకొని యధావిధిగా అమ్ముకోవచ్చు. కొన్నవారు యధావిధిగా ఆవుమాంసాన్ని భోంచేయడానికి సైతం చట్టం అడ్డురాజాలదు. కేవలం ఆవులను వధించడం మాత్రమే నేరం. సారా తాగడం, అమ్మడం, కొనడం, తయారుచేయడం పరస్పరం ముడివడి ఉన్న వైపరీత్యాలు. సారా తయారు చేయడం మాత్రమే నేరం అని చెప్పడం విచిత్రం. తాగవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు...అలాగే ఆవును చంపడం మాత్రమే నేరమని, ఆవు మాంసం అమ్మడం కొనడం, నిలువ ఉంచడం భోంచేయడం నేరం కాదని తీర్పునివ్వడం విచిత్రం. మహారాష్టల్రోని ఆవులను సరిహద్దులను దాటించి అక్కడ చంపి మాంసాన్ని విక్రయిస్తారు. బొంబాయి న్యాయస్థానం ఇలాంటి విచిత్రమైన తీర్పును ఎందుకు ఇచ్చిందన్నది అర్థంకాని ప్రహేళిక. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టునకు అప్పీలు చేయకపోయినట్టయితే గోవధ నిషేధం చట్టం నామమాత్రం అయిపోతుంది.
మనదేశపు ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన శతాబ్దుల విపరిణామాలలో ప్రధానమైనది గోవధ. భూమిని తల్లిగా భావించే జాతి మనది. భూమిని పండించినది ఆవు. గోసంతతి పరిఢవిల్లినంతకాలం మనదేశంలో ఆహార సమృద్ధికి కొరత లేకపోవడం చరిత్ర. విదేశీయుల దురాక్రమణ వ్యవస్థీకృతం కావడం గోవధ పెద్ద ఎత్తున ఆరంభం కావడం సమాంతర పరిణామాలు. క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్దిలో కాకతీయ సామ్రాజ్యాన్ని వంచనతో కూల్చగలిగిన విదేశీయ దురాక్రమణదారులు గ్రామగ్రామాలలో లక్షలాది కోట్లాది ఆవులను హత్య చేయడం చరిత్ర. ఆవులు, ఎద్దులు, దూడలు అంతరించడంతో సంప్రదాయ సేంద్రీయ వ్యవసాయం కుప్పకూలిపోయింది. శతాబ్దులపాటు సాగిన గోహనన మాలిన్యాన్ని 1947, ఆగస్టు 15 తరువాత స్వదేశీయ ప్రభుత్వాలు కడిగివేస్తాయని భావించిన వారి ఆశలు అడియాశలు కావడం నడుస్తున్న చరిత్ర. దేశంలో దాదాపు రెండువందల రకాల ఆవులు ఉండేవట. శతాబ్దుల గోవధ తర్వాత కేవలం ముప్పయి మూడు జాతుల ఆవులు మాత్రమే దేశంలో బతికి ఉన్నాయట. వీటిల్లో ఇరవయి ఏడు జాతుల ఆవులను కర్ణాటకలోని శ్రీరామచంద్రమఠంలో రక్షిస్తున్నారు. గోసంతతి వృద్ధి పొందినట్లయితే విష రసాయనపు ఎరువులను మనం దిగుమతి చేసుకొనే అవసరం ఉండదు. ఈ ఎరువుల దిగుమతి ఫలితంగా సాలీనా లక్షన్నర కోట్ల రూపాయల మన విదేశీయ వినిమయ ద్రవ్యం ఇతర దేశాలకు తరలిపోతోంది. గోమాంసం ఎగుమతి వల్ల ముప్పయివేల కోట్ల రూపాయల విదేశీయ వినిమయ ద్రవ్యం మనకు లభిస్తోందని ప్రచారం చేస్తున్నవారు దీన్ని గమనించాలి...
గోవధ నిషేధాన్ని ‘‘తినే హక్కులకు భంగకరమని, స్వేచ్ఛకు భంగకరమని’’ చిత్రీకరించడానికి గత ఏడాది జరిగిన ప్రచారం పెద్ద కుట్ర! ఆవును చంపరాదనడం అసహనానికి చిహ్నమని జరిగిన ప్రచారం వల్ల వౌలికమైన వాస్తవాలు ప్రాధాన్యతను కోల్పోయాయి. దేశానికంతటికీ వర్తించే విధంగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే కార్యక్రమం మూలనపడింది. గోవధ నిషేధాన్ని దశాబ్దులపాటు సమర్థించిన భారతీయ జనతాపార్టీ రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. కానీ సమగ్ర గోవధ నిషేధం చట్టాన్ని ఎందుకని రూపొందించడం లేదు? గోవధను నిషేధించాలని ఈ దేశంలోని అత్యధికశాతం మంది ప్రజలు కోరుతున్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఈ ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ దేశంలోని ప్రజలలో నాలుగుశాతం మంది మాత్రమే గోమాంసం తినడానికి ఇష్టపడుతున్నారు. వీరిలో ఒకటిన్నరశాతం మాత్రమే నియతంగా తింటున్నారని సర్వేలో వెల్లడైంది. అందువల్ల తొం బయి ఆరుశాతం ప్రజలు గోవధను నిషేధిస్తున్నారు. ఈ దేశపు వౌలిక జీవన మూల్యాలను ఏదోవిధంగా నష్టం చేయాలని భావిస్తున్న వారు మాత్రమే గోవధను సమర్థిస్తున్నారు. గోవధను నిషేధించడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించగల సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన పేడ, గోమూత్రం, ఆయుర్వేద చికిత్సకు అవసరమైన పంచగవ్యాలు సమృద్ధిగా లభించగలవు. గోమాంసాన్ని డబ్బాలలో పెట్టి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధికాధిక గోహత్యలు జరుగుతున్నాయి. ఈ మాంసం ఎగుమతులను నిషేధించడం ప్రధానం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా చిత్తశుద్ధితో ఆలోచించవలసిన అంశమిది. భాజపా పాలిత మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి చోట్ల గోవధ నిషేధించగలిగినప్పుడు జాతీయ స్థాయిలో గోవధను నిషేధించడానికి భాజపా ప్రభుత్వం ఎందుకని తటపటాయిస్తోంది?
జమ్మూకశ్మీర్‌లో గోవధ నిషేధాన్ని అమలు జరపాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. గ్రామగ్రామాలలో పాడి పశువులు పెంచడానికి కేంద్రాలను ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2012లో హైకోర్టు ఆదేశించి ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులు కూడ గోవధ నిషేధాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమర్ధిస్తూ ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి మరింత బలం.. బొంబాయి హైకోర్టు శుక్రవారం నాటి తీర్పునకు ఇదంతా నేపథ్యం. ‘గోవధ ఈ దేశ ప్రజలకు సమ్మతం కాదు, గోవధను నిషేధించడానికి మేము సకలవిధ ప్రయత్నాలను కొనసాగిస్తాము..ఈ విషయంలో ప్రభుత్వం వారి చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించరాదు..’’ అని దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2015 మార్చి 29న ప్రకటించారు. ఏడాది గడిచిపోయింది...ఏదీ జాతీయస్థాయి చట్టం? ఎప్పుడు..?