సంపాదకీయం

మతిమాలిన ‘నేపాల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీ మన దేశానికి వ్యతిరేకంగా మరోసారి అబద్ధపు ఆరోపణలు సంధించడం ఆశ్చర్యకరం కాదు. గత అక్టోబర్‌లో నేపాల్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటినుంచి ఈ నేపాల్ సమీకృత మార్క్సిస్టు లెనినిస్ట్ కమ్యూనిస్ట్‌పార్టీ-సిపిఎన్‌యుఎమ్‌ఎల్ మన దేశానికి వ్యతిరేకంగా మంటలు కక్కుతూనే ఉన్నాడు. అందువల్ల తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ వారంరోజులుగా ఆరోపిస్తుండడం ఊహించని పరిణామం కాదు. మన దేశంలోని తమ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయను వెనక్కు రప్పించడం, మన దేశంలో పర్యటించవలసి ఉండిన తమదేశపు అధ్యక్షురాలు ఉమాదేవి భండారీ కార్యక్రమాన్ని రద్దు చేయడం వంటి దుశ్చర్యలకు ఒడిగట్టడం మితిమీరిన ఓలీ మతిమాలిన తనానికి నిదర్శనం. ఈ ఆర్భాటం భారత నేపాల్ సాంస్కృతిక భౌగోళిక వ్యూహాత్మక మైత్రీ బంధానికి విరుద్ధమైన విపరిణామం! ఓలీ దురహంకారపు ప్రకటనలకు ప్రేరణ నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ-యుసిపిఎన్‌ఎమ్-వారి మారిన వ్యూహం! చైనా ప్రభుత్వం వారి చంకబిడ్డ అయిన మావోయిస్టు మావోయిస్టు మహానేత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని ఓలీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి యత్నిస్తున్నాడట! 2013 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2008 నాటి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన మావోయిస్టు పార్టీ ఐదేళ్ల తరువాత ఓడిపోయి నాలుగవ స్థానానికి దిగజారిపోవడానికి కారణం నేపాల్ ప్రజలు మావోయిస్టుల అసలు లక్ష్యాన్ని పసిగట్టడం. నేపాల్‌లో బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రచండ లక్ష్యం కాదు, మావోయిస్టు పార్టీ లక్ష్యం కాదు...ఏకపక్ష మావోయిస్టు కమ్యూనిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడం మావోయిస్టుల లక్ష్యం! 2013 నాటి ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా అవతరించిన నేపాల్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ కోయిరాలా 2014 ఫిబ్రవరిలో ప్రధానిగా ఎన్నికయ్యాడు. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీవారు కోయిరాలాను బలపరిచారు. కానీ గత ఏడాది సెప్టెంబర్‌లో కొత్త రాజ్యాంగం ఏర్పడ్డాక మావోయిస్టులతో మార్క్సిస్టు లెనినిస్టులు జట్టుకట్టారు. ఫలితంగా అక్టోబర్‌లో మార్క్సిస్టు లెనినిస్టు పార్టీకి చెందిన ఓలీ ప్రధాని అయ్యారు. ఇలా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం వల్ల నేపాలీ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది!అధ్యక్ష పదవి, ప్రధాని పదవి రెండూ మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి దక్కాయి. కానీ మావోయిస్టు నేత ప్రచండ మళ్లీ వ్యూహం మార్చాడట! ఓలీ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నిస్తున్నాడట...
నిజానికి నేపాల్‌తో మన స్నేహ సంబంధాలు నానాటికీ క్షీణించి పోతుండడం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కుట్రలో భాగం. చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణలో ఈ కుట్ర భాగం. భారత నేపాల్ దేశాలు సర్వ స్వతంత్ర సార్వభౌమదేశాలయినప్పటికీ ఉభయ దేశాల సాంస్కృతిక సంబంధం యుగాలనాటిది. ఒకప్పుడు నేపాల్‌లో భారత దేశంలో భాగమన్నది చారిత్రక వాస్తవం. ఉభయ దేశాల భౌగోళిక భద్రత స్వరూపం, స్వభావం ఒక్కటే! ఈ భద్రతకు ప్రమాదం కూడ ఒక్కటే! ఈ ప్రమాదం ఉత్తరం వైపున పొంచి ఉంది! అయితే ఈ ప్రమాదాన్ని కలిగిస్తున్న చైనా ఒడిలో తమ దేశాన్ని కూర్చునబెట్టడానికి నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ ప్రభుత్వం యత్నిస్తుండడం చైనా విష వ్యూహం విస్తరించిపోతోందనడానికి నిదర్శనం. ఎందుకంటే 1995లో కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటినుంచి కూడ చైనాతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు చైనాతో అతి సాన్నిహిత్యాన్ని నెరపుతోంది, మనదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలను గుప్పిస్తోంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత ఏర్పడిన మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ 1996 నుంచి ఎనిమిదేళ్ల పాటు సాయుధ సమరం జరిపింది. చైనా ప్రభుత్వం ప్రతినిధిగా ఏర్పడిన మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ జరిపిన రక్తపాతానికి బీభత్సకాండకు పదమూడు వేల మంది నేపాల్ సైనికులు ప్రజలు బలైపోవడం చరిత్ర! సాయుధ రక్తపాతం వల్ల రాజ్యాధికారం సిద్ధించబోదని గ్రహించిన మావోయిస్టులు 2005లో ప్రజాస్వామ్య రాజ్యాంగంపట్ల నిబద్ధతను ప్రకటించారు. కానీ ప్రజాస్వామ్యంపట్ల నిబద్ధతను ఒకవైపు అభినయిస్తూనే మరో వైపున రాజ్యాంగ ప్రక్రియ కొనసాగకుండా మావోయిస్టులు అడ్డుపడుతుండడం గత పదకొండు ఏళ్లుగా నడుస్తున్న కథ...
మావోయిస్టులు హఠాత్తుగా వ్యూహం మార్చినట్టు ప్రచారవౌతోంది. కానీ తమ చైనా ప్రేరిత ప్రణాళికను ఖడ్గప్రసాద్ పూర్తిగా అమలు చేయడం లేదన్న అనుమానం మావోయిస్టులను గత కొంతకాలంగా పీడిస్తోంది. ఖడ్గప్రసాద్ గద్దెనెక్కిన తరువాత మొదటి విదేశ యాత్రకు చైనాను ఎంపిక చేసుకుంటాడన్న ప్రచారం జరిగింది. తమ ప్రధాని మొదట భారత్‌కు కాక చైనాకు వెళ్లనున్నట్టు నేపాల్ ఉప ప్రధానమంత్రి కమల్ థాపా గత డిసెంబర్ 29న ఆధికారికంగా ప్రకటించాడుకూడ . చైనాలో వారంరోజులు పర్యటించి వచ్చిన కమల్ థాపా ఖాట్మండులో ఈ అధికార ప్రకటన చేశాడు! భారత ప్రభుత్వాన్ని కించపరచడానికే థాపా ఇలా ప్రకటించాడని కూడ ప్రచారమైంది. ఎందుకంటె కొత్త ప్రధానమంత్రి అయిన నేపాల్ నాయకుడు మొదట భారతదేశంలో పర్యటించిన తరువాత మాత్రమే ఇతర దేశాలకు వెళ్లడం దశాబ్దుల సంప్రదాయం. రాజరికం రద్దయిన తరువాత 2008లో అధ్యక్షుడుగా ఎన్నికయిన రామ్ భరణ్ యాదవ్ కూడ మొదట మన దేశంలో పర్యటించాడు. 2008లో ఫ్రధాని అయిన మావోయిస్టు మహానేత పుష్పకమల్ దహల్ ప్రచండ మాత్రం మొదట చైనాలో పర్యటించాడు, తరతరాల సంప్రదాయాన్ని ఉల్లంఘించాడు! మళ్లీ ఓలీ కూడ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి మావోయిస్టులు రంగం సిద్ధం చేశాడు! ఇందుకు పూర్వ రంగంగా ఓలీ కూడ తమ దేశంలో నడుస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమానికి మన ప్రభుత్వమే కారణమని అనేకసార్లు ప్రకటించాడు! మాధేశీ జనసముదాయాల హక్కులను కాలరాయడానికి కొత్త రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అందుకే మాధేశీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమానికి మన ప్రభుత్వం కారణమని మావోయిస్టులు, ఓలీ ప్రభుత్వం ఆరోపించాయ. చైనానుండి ఇంధనం చమురు దిగుమతుల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, 1949 నాటి భారత-నేపాల్ వాణిజ్యం రవాణా వ్యవహారాల ఒప్పందాన్ని అలా ఉల్లంఘించారు...
కానీ మావోయిస్టు మహానేత ప్రచండ ఇప్పుడు ఓలీని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఓలీ మనసు మార్చుకున్నాడు. మొదట మన దేశంలో పర్యటించి వెళ్లాడు. నేపాల్ ప్రజలు మొత్తం భారతీయ సంతతి... మాధేశీలకు న్యాయం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించడానికై ఓలీ అంగీకరించాడు కూడ. మావోయిస్టులు ఓలీని గద్దె దించాలని యత్నించడానికి ఇదీ నేపథ్యం. ఓలీ మన ప్రభుత్వాన్ని నిందించడం అందువల్ల మతిమాలిన చర్య.