ఉత్తరాయణం

ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రముఖ కళాకారుడు అయిన నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున బుద్ధ విగ్రహం నెలకొల్పి, సాగర్ గట్టు పొడవునా ప్రముఖులైన తెలుగు వారి విగ్రహాలను ప్రతిష్ఠించి, రహదారి రెండు వైపులా స్వాగత ద్వారాలను నిర్మించి తెలుగువారి కీర్తిని ఇనుమడింపజేశారు. విడివడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోను, విశాఖ సాగరతీరంలోను ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని మనవి.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
రాజకీయంగా ఎదుర్కొనలేక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. నాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయలబ్ది పొందడానికి ఒక రాజకీయ నాయకుడు యత్నించాడు. నేడు బెంగాల్ ఎన్నికల్లో ‘రూపా గంగూలీ’పై వ్యాఖ్యలు చేయడం నాయకులకు పరిపాటిగా మారింది. మహిళా మంత్రులపై వ్యాఖ్యలు చేయడం పార్లమెంట్‌లో కూడా అలవాటుగా మారింది. కర్నాటకలో సైతం ఒక మంత్రి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో రేప్‌ల అంశంపై ఒక మాజీ ముఖ్యమంత్రి విపరీత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆప్పట్లో జయప్రదపై, ఇప్పుడు రూపాగంగూలీపై అనవసర వ్యాఖ్యలు చేసినవారు మైనారిటీ వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. మైనార్టీ ముసుగులో ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే వారీ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
- అయినం రఘురామారావు, ఖమ్మం
కేంద్రం సముచిత నిర్ణయం
భారతభూభాగాన్ని వక్రీకరిస్తే జైలు, కోటి రూపాయల జరిమానా విధించే దిశగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం ముదావహం. అందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రపంచంలోనే మనదేశం ఉత్తమ సెక్యులర్ వ్యవస్థ కలిగినది. ఒక ముస్లిం పౌరుణ్ణి రాష్టప్రతిగా, ఉపరాష్టప్రతిగా చేసి సర్వమత సమభావ వ్యవస్థ పట్ల నిబద్ధమైన దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందింది. ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్న విధంగా మోదీ నల్లధనాన్ని వెనక్కి రప్పించాలి. భారత్‌లో పేదలు బాగుపడాలంటే విదేశాల్లో పెద్దమొత్తంలో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాల్సిందే.
-కె. శ్రీనివాసు, బెల్లంపల్లి
విగ్రహారాధనను గుర్తించాలి
‘మీమాంస ధ్యాసలేని న్యాయ ప్రక్రియ’ అన్న వ్యాసం న్యాయశాస్త్రాన్ని మరోకోణంలో ఆలోచించి, అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని దృష్టికి తెస్తున్నది. జగద్గురువుగా పేరొందిన ఆదిశంకరాచార్యుని ఆద్వైత గ్రంథాలను, అపరోక్షానుభూతిని, అధ్యయనం చేస్తే వీరి యొక్క న్యాయ, తర్క, మీమాసం ప్రతిభ అర్థమవుతుంది. ప్రస్తుతం లభ్యమవుతున్న ‘జ్యురిస్‌ప్రుడెన్స్’ క్రైస్తవ మూల సూత్రాలలో, విదేశాలలో ఆవిర్భవించినవే. ఈమధ్యనే ప్రార్థించే హక్కుపై సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల తీర్పులనూ చూశాం. దురదృష్టవశాత్తు మన మీడియా విదేశాల్లో ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకొని మన ప్రాథమిక హక్కులు కూడా ‘అబ్సల్యూట్ రైట్స్’ అన్న రీతిలో టివి ఛానళ్లలో చర్చలు జరుగుతున్నాయి. మన సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు కూడా ప్రార్థించే హక్కు, విగ్రహాలను పూజించే హక్కులను స్పష్టంగా గుర్తిస్తే బాగుంటుంది. నడివీధిలో కూడా ఏవిధమైన విచక్షణ లేకుండా మనసులోనే ప్రార్థించవచ్చు.అయితే విగ్రహాలను పూజించే సమయంలో సంబంధిత ఆగమాలను దృష్టిలో పెట్టుకొని పూజించాలి. భగవానుడిని ఆరాధిస్తున్నామంటే, మన పాపకర్మలను పూర్తిగా నశింపజేసుకోవడానికే. ఈ నేపథ్యంలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస గ్రంథాలను వెలుగులోకి తెవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- ఈ.ఎస్. జగదీశ్వర్, నవాబుపేట, నెల్లూరు జిల్లా
హిందువులంటే చులకన
‘‘హిందూ సమాజంపైనే ఎందుకు దాడి?’’ వ్యాసం వాస్తవికతను ప్రతిబింబిస్తున్నది. కుహనా లౌకికవాదులకు, సంస్థలకు ఏమాత్రం తీసిపోవు కోర్టులు. ఎందుకంటే అవి కూడా వాటి పరిధిలోనే నడుస్తున్నాయి. హిందూ మతానికి వ్యతిరేక తీర్పులకు మీడియాలో లభిస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. కుటుంబ నియంత్రణపై హిందువులకు చెప్పేవారు, క్రైస్తవ, ఇస్లాం మతస్థులకు చెప్పడం లేదు. హిందూమతం అంటే చులకన భావం ఉండటం వల్లనే ఇటువంటి తీర్పులు వెలువడుతున్నాయి.
- వేదుల జనార్థనరావు, వంకావారి గూడెం