సంపాదకీయం

ఎవరు ఉగ్రవాదులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరో ఆరుమంది నిందితులు నిర్దోషులని జాతీయ నేరపరిశోధక మండలి-నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-నిర్ధారించడం న్యాయానికి లభించిన ఊరట. ఈ ఊరట ఎనిమిదేళ్ల తర్వాత లభించడం ఘోరమైన విలంబనానికి నిదర్శనం. 2008లో మహారాష్టల్రోని మాలేగావ్ ప్రాంతంలో జరిగిన బీభత్సఘటనలో సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను ఇరికించినట్టు నేషనల్ ఇనె్వస్టిగేటింగ్ ఏజెన్సీ-ఎన్‌ఐఎ- వారు శుక్రవారం చేసిన నిర్ధారణ వల్ల ధ్రువపడింది. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ మరో ఆరుగురు నిర్దోషులని ఎన్‌ఐఏ ముంబలోని ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించడంతో వారు ఆరోపణా విముక్తులయ్యారు. ఈ నివేదన ప్రాతిపదికగా న్యాయస్థానంవారు తుది నిర్ధారణ చేయవలసి ఉంది. ఈ నిర్ధారణ వల్ల ఈ నిందితులు అభియోగ విముక్తులై నిర్బంధం నుండి బయటపడినప్పుడే ఎనిమిదేళ్ల అన్యాయం అంతమవుతుంది. నేరస్థులను నిర్దోషులుగాను నిర్దోషులను నేరస్తులుగాను చిత్రీకరించడానికి పరిశోధక సంస్థలు ప్రయత్నం చేస్తుండడం జాతీయ వైపరీత్యం. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల ఒత్తడికి లొంగి సిబిఐ ఎన్‌ఐఎ వంటి సంస్థలు పనిచేసినంతకాలం ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నిర్దోషి కనుకనే ఎనిమిదేళ్లు ఆమెను నిర్బంధించినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా పరిశోధక సంస్థలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ 2014, మే 26వ తేదీకి పూర్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన రాజకీయవేత్తల ఒత్తడి ఫలితంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్ తదితరులు దోషులన్న ప్రచారాన్ని పరిశోధనా సంస్థలు కొనసాగించాయి. ఇలా నిర్దోషిని నిర్బంధించిన వారు ఇస్రాత్ జహాన్ వంటి లష్కర్ ఏ తయ్యబా, జిహాదీ ముఠాకు చెందిన నేరస్థులను అమాయకులుగా చిత్రీకరించడం సమాంతర వైపరీత్యం. ఇస్రాత్ జహాన్ ఘరానా బీభత్సకారిణి అన్న వాస్తవం ధ్రువపడిన తరువాత కూడా ఏళ్ల తరబడి ఆమె ఆమాయకురాలైన విద్యార్థిని అన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థలు కొనసాగించాయి. ఈ కృత్రిమ కథనం ప్రాతిపదికనే గుజరాత్‌కు చెందిన అనేకమంది పోలీసు ఉన్నత అధికారులను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ముఠాకు చెందిన ఇస్రాత్ జహాన్ మరో ఇద్దరు 2004 జూన్‌లో గుజరాత్ పోలీసులతో తలపడి ఎదురుకాల్పుల్లో హతులయ్యారు. ఈ బీభత్సకారిణి అమాయకురాలన్న ప్రాతిపదికపై జరిగినదర్యాప్తు నిజానికి పెద్ద కుట్ర. గుజరాత్ పోలీసు అధిపతి డిజి వంఝారాను ఎనిమిదేళ్లకు పైగానిర్బంధానికి గురిచేసిన కుట్ర ఇది. చివరికి ఏమయింది? అమెరికాలో నిర్బంధంలో ఉన్న జిహాదీ హంతకుడు డేవిడ్ హెడ్లీ గత ఫిబ్రవరిలో అసలు విషయం ధ్రువీకరించాడు-ఇస్రాత్ జహాన్ లష్కరే తయ్యబా ముఠా సభ్యురాలు.
ఇలా ఇస్రాత్ జహాన్ అమాయకులుగా ప్రచారమైన ఎనిమిదేళ్లపాటు ప్రజ్ఞాసాధ్వి దోషిగా అప్రతిష్ఠపాలు కావడం సమాంతర పరిణామం. దోషి నిర్దోషిగా ముద్ర వేయించుకోగలగడం న్యాయవైపరీత్యం. కానీ ఒక నిర్దోషిని ప్రజ్ఞాసాధ్విని, దోషిగా చిత్రీకరించడం దారుణమైన అన్యాయం. ఇప్పుడీమెకు న్యాయం జరిగింది. కాని ఇనే్నళ్ల పాటు ఆమెకు జరిగిన అన్యాయానికి పరిహారం ఏమిటి? ఆమెను, ఆమె బంధువులను మానసిక క్షోభకు గురిచేసిన నకిలీ దర్యాప్తునకు బాధ్యులెవరు? సంఘటిత నేర నిరోధక మహారాష్ట్ర చట్టం-మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్- ఎమ్‌సిఓసిఏ- ప్రకారం సాధ్వికి ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఆరోపణలను నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నేరం నమోదయిన తరువాత 180 రోజులలోగా దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని-చార్జ్‌షీటు- దాఖలు చేయాలి. తొంబయి రోజులలోనే దర్యాప్తు పూర్తి చేయగలమని, 2011 నవంబర్‌లో ఉగ్రవాద వ్యతిరేక బృందం-యాంటీ టెర్రరిజం స్క్వాడ్-వారు ప్రకటించారు. అంతకుపూర్వం మూడేళ్లుగా నిర్బంధంలో ఉండిన సాధ్విని ఇతర నిర్దోషులను మరి కొనే్నళ్లపాటు జైళ్లలో ఉంచడానికి వీలుగా మాత్రమే ఎమ్‌సిఓసిఏను ప్రయోగించారన్నది స్పష్టం. సాధ్వితోపాటు లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మరో ఆరుమందిని ఈ చట్టం కింద మాలేగావ్ బీభత్సకాండలో ఇరికించారు. ఇప్పుడు సాధ్విపై అన్ని ఆరోపణలను రద్దు చేశారట. పురోహిత్‌పై కూడ ఈ మహారాష్ట్ర చట్టం కింద అభియోగాన్ని రద్దు చేశారు. కానీ పురోహిత్‌కు వ్యతిరేకంగా మరికొన్ని అభియోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతాపార్టీ నిర్వహించడం మొదలు పెట్టిన తరువాతనే మాలేగావ్ బీభత్సకాండను నిజంగా నిర్వహించింది లష్కర్ ఏ తయ్యబా అన్న వాస్తవం బయటపడింది. ఈ వాస్తవాన్ని దాచి సాధ్విని, ఇతర హైందవ ధర్మాచార్యులను ఇందులో ఇరికించడానకి 2004 నుంచి 2014వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన కాంగ్రెస్ యత్నించిందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. ప్రధానంగా దేశ వ్యవహాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పళనియప్పన్ చిదంబరం, సుశీల్ కుమార్ షిండే ఈ అన్యాయానికి బాధ్యులు. కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి మితిమీరిన విధేయులైన వీరు ‘హిందూ బీభత్సకాండ’ అన్న పదజాలాన్ని సృష్టించి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీయ ప్రభుత్వాలకు సైతం ‘హిందూ తీవ్రవాద’ ప్రమాదాన్ని వివరించినట్టు ‘వీకీలీక్స్’ పత్రాల ద్వారా 2010లో బయటపడింది. 2009 జులై 20న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన విందు భోజనం కుడిచిన సందర్భంగా రాహుల్ గాంధీ అమెరికా రాయబారి తిమోతీరోమర్‌తో సంభాషించాడు. ఈ సందర్భంగా హిందూ ఉగ్రవాదుల వల్ల ప్రమాదం ఏర్పటినట్టు రాహుల్ గాంధీ అమెరికా ప్రతినిధికి వివరించాడని వీకీలీక్స్ పత్రాల వల్ల వెల్లడైంది. ఇస్రాత్ జహాన్ అమాయకురాలిగా చిత్రీకరించడానికి, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను దుర్మార్గురాలిగా ప్రచారం చేయడానికి పళనియప్పన్ చిదంబరం మిక్కిలి శ్రమించినట్టు ధ్రువపరచే ఆధారాలు కూడ ప్రచారమవుతున్నాయి. ఇలా లేని ‘హిందూ బీభత్సకాండ’ను ఉన్నట్టుగాను, ప్రమాదకరంగా మారినట్టుగాను చిదంబరం వంటి వారు రాహుల్ గాంధీ వంటివారు ఎందుకు ప్రచారం చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం స్పష్టం...టెర్రరిస్టులకు మతం లేదని జిహాదీ టెర్రరిస్టులను ఏమతంతోను ముడిపెట్టరాదని రాజకీయవాదులు ఉచిత సలహాలను ఇస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు దేశపు జాతీయతను ఎందుకని కించపరుస్తున్నారు? హిందూ ఉగ్రవాదం అన్న పదజాలాన్ని ఎందుకు సృష్టించారు?
సాధ్వీ ప్రజ్ఞాసింగ్, లెఫ్టెనెంట్ పురోహిత్ తదితరులకు వ్యతిరేకంగా ఎమ్‌సిఓసిఏ కింద అభియోగాలను మోపడానికి ఎలాంటి ఆధారాలు లేవని 2015 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ వారిపై ఆరోపణలను రద్దు చేయడానికి సంవత్సరానికి పైగా పట్టింది. న్యాయవిలంబన ప్రక్రియ దోషులకు ఆనందదాయకం, కానీ నిర్దోషులకు..?