ఉత్తరాయణం

ఇక గాలి వ్యాపారం షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎప్పుడైనా ప్రకృతి వనరున నీళ్లను కొనుక్కున్నామా? నీటిలో మందులు కలిపి తాగామా? ఈ నదులు, జలాశయాలు అన్నింటిని మానవుడే కలుషితం చేయడం వల్ల మందులు కలిపిన నీటిని తాగి అనారోగ్యం పాలు కావలసి వస్తోంది. మినరల్ వాటర్ పేరిట వ్యాపారం అభివృద్ధి చెందింది. చెట్లను నరకడం, వాహనాలు విపరీతంగా పెరగడం వల్ల పీల్చే గాలి కూడా కలుషితమైపోతోంది. కెనడా దేశం ఇప్పుడు కాలిలోని ప్రాణవాయువును చిన్న చిన్న సిలిండర్లలో నింపి మనదేశంలో వ్యాపారం మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ సెలూన్లను వెలిసాయట. వ్యాయామానికి వెళ్లాల్సినట్టు ఈ సెలూన్లలో ఓ గంటో, అరగంటో ప్రాణవాయువును పీల్చి వస్తున్నారట. ప్రాణికి ప్రాణం మీద ఎంతమక్కువో తెలుస్తోంది. భగవంతుడు ధనం ఖర్చుకాకుండా ప్రసాదించే వనరులను ధరపెట్టి కొనే దుస్థితి దాపురించింది. ఇక భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కదా!
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్

ఎన్నికలప్పుడే ప్రజలు కనిపిస్తారా?
ప్రజలెన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వాలు ఎన్నికలుదగ్గర పడినంతనే హఠాత్తుగా ప్రజలను గుర్తుకు తెచ్చుకొని, వారిపై ఎనలేని సానుభూతి చూపించడమే కాక కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలను రాత్రికి రాత్రే ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నికల్లో గెలిస్తే సరేసరి లేకపోతే ఆ పథకాల ఊసే ఉండదు. గతంలో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, బిహార్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇలాంటి ప్రయోగాలు చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. బిహార్‌లో అయితే చరిత్రలో అత్యంత ఖరీదైన ప్యాకేజీని ప్రకటించినా ప్రజలు నమ్మక, లల్లు, నితీష్ ద్వయానికే పట్టం కట్టారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలకోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తాయిలాలను ఆశచూపింది. అయితే ప్రాథమిక వార్తల ప్రకారం ఇవేమీ పనిచెయ్యవని అర్థమవుతోంది.
- ఎం. కనకదుర్గ, తెనాలి
వేతన సిఫార్సులు హుళక్కేనా?
10వ వేతన సవరణకు సంబంధించిన వేతన బకాయిలు చెల్లింపుకొరకు 2016-17 బడ్జెట్‌లోనూ ప్రస్తావించక పోవడం దురదృష్టకరం. అలాగే, వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి అందజేసిన సిఫార్సులన్నింటినీ నేటికీ ఆం.ప్ర. ప్రభుత్వం అమలుచేయకపోవడం కడు శోచనీయం. అందులో ముఖ్యంగా ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి చెందినది. అదే విధంగా సిఫార్సులను యథాతథంగా అమలుచేయకపోగా కోతలు విధించడం కడు విచారకరం. ఉదా. ఉద్యోగులకు/ పింఛనుదారులకు అంత్యక్రియలకు 20,000/- రూపాయలు సిఫార్సు చేయగా 15000/- రూపాయలకు కుదించడం, పింఛనుదారులకు మెడికల్ అలవెన్స్ 350/- సిఫార్సు చేయగా 300/- రూపాయలకు కుదించడం. కమీషన్లకు కక్కుర్తిపడి ఆరోగ్యశ్రీ పథకం క్రింద కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్న దానిలో ఉద్యోగులకు, పింఛనుదారులకు ఇస్తున్నది పిసరంతే అని ప్రభుత్వం గుర్తెరిగి, సత్వరమే వేతన సవరణ సంఘం అందించిన సిఫార్సులన్నింటినీ యథాతథంగా వెంటనే అమలుపరచడానికి తగు చర్యలు చేపట్టవలసినదిగా ముఖుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నాము.
- ఆశం సుధాకరరావు, గూడలి
తీరుమారని కాంగ్రెస్
‘తీరుమారదా’ అంటూ మంత్రుల గైర్హాజరీని పార్లమెంట్‌లో కాంగ్రెస్ నిలదీసింది. సమాధానాలు చెప్పలేక మంత్రులు పారిపోతున్నారని గేలి చేసింది. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు సభకు రాకపోవడం గర్హనీయమే. నిజమే. అయితే కాంగ్రెస్ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఆశ్చర్యం. అలనాడు కాంగ్రెస్ మంత్రులూ గైర్హాజర్ అయిన సందర్భాలు కోకొల్లలు. అదీకాక సోనియాకు నష్టం కలిగించే ఏ చిన్న సమస్య తలెత్తినా పార్లమెంటులో చర్చ జరకుండా గోలచేసి ఉభయ సభల్ని స్తంభింపజేయడమే పనిగా పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది. ఇప్పుడు కాంగ్రెస్..మంత్రుల్ని నిందించడం వల్ల నల్లని కుండ టీ పాత్ర నలుపును వెక్కిరించినట్లవుతుంది.
-చైతన్య, వాకలపూడి