సంపాదకీయం

విత్తనాలకు విముక్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్యుపరివర్తన-జెనటిక్ మోడిఫికేషన్-జిఎమ్- సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపొందుతున్న విత్తనాల వల్ల జరిగిపోతున్న వ్యవసాయ వైపరీత్యాల గురించి అవగాహన పెరగకపోవడం ప్రధాన సమస్య. జిఎమ్ ప్రక్రియ ద్వారా రూపొందుతున్న మరో సంకరజాతి విత్తనాలలో బాసిలస్ తురింజెనిసిస్-బి.టి- అన్న జీవ రసాయనం ఏర్పడుతోంది. అందువల్ల జిఎమ్ విత్తనాలు బిటి విత్తనాలుగా చెలామణి అవుతున్నాయి. బిటి విత్తనాలను ఉపయోగించి వ్యవసాయం చేయడం సేంద్రీయ వ్యవసాయ స్ఫూర్తికి విరుద్ధమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిటి విత్తనాలను నిరోధించకపోవడం, నిషేధించకపోవడం విధాన నిహితమైన పరస్పర వైరుధ్యాలకు చిహ్నం. ఒకవైపున గోసంతతి రక్షణకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. సేంద్రీయ సంప్రదాయ వ్యవసాయానికి దేశవాళీ ఆవులు, గోజాతులు అత్యవసరం. కానీ ‘‘దీపం పెట్టిన తర్వాత దిగనేసిన..’’ చందంగా బిటి విత్తనాల అమ్మకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. పులిమీద పుట్రలాగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోను నకిలీ బిటి విత్తనాల అమ్మకాలు కూడ జోరుగా సాగిపోతున్నాయట. బిటి అన్న అక్షరాలను మరికొన్ని అక్షరాలను కలిపి సంస్థల పేర్లను నిర్ధారిస్తున్నవారు తాము విక్రయిస్తున్న విత్తనాలు బిటి విత్తనాలన్న భ్రమను కల్గిస్తున్నాయట. ఈ నకిలీ విత్తనాల ముఠాలు పట్టుబడుతున్నప్పటికీ నిబంధనలలోని లొసుగుల వల్ల ప్రభుత్వాలు ఈ ముఠాలను శిక్షించలేకపోతున్నాయి. నకిలీ బిటి విత్తనాలు మాత్రమే కాదు, మా మూలు సంకరజాతి విత్తనాలలో సైతం కల్తీ జరగిపోతున్నట్టు ప్రచారవౌతోంది. అనుమతి లేని సంస్థలు రకరకాల పేర్లతో ఒకేరకం హైబ్రిడ్ విత్తనాలను రైతులకు తగలకడుతున్నారట. ఒకేరకం వ్తినాలకు పేర్లు మార్చడం వల్ల రకరకాల ధరలకు వ్యవసాయదారులు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. రైతును దోపిడీ చేయడం కోసం చిత్ర విచిత్ర పేర్లతో మొక్కజొన్న, వరి, పత్తి, పప్పు ధాన్యాల విత్తనాలకు ముసుగులను వేస్తుండడం గురించి రైతులకు అవగాహన లేదు.
తెలంగాణ ప్రభుత్వం మొన్‌శాంటో అమెరికా సంస్థవారు విక్రయిస్తున్న బిటి పత్తి విత్తనాల ధరలను తగ్గించింది. ఈ తగ్గిన ధరలు కూడ చాలా అధికంగానే ఉన్నాయి. బిటి పత్తి విత్తనాలను తెలుగు రాష్ట్రాలలోను దేశంలోని ఇతర రాష్ట్రాలలోను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈ ఉత్పత్తిదారులకు లభిస్తున్న ధరలకంటె దాదాపు మూడు రెట్ల ధరలకు మోన్‌శాంటో వారు వ్యవసాయదారులకు బిటి విత్తనాలను విక్రయిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యుటిఓ- నిబంధనల ప్రకారం ముద్ర -పేటెంట్-ల చట్టం నియమావళి ప్రకారం మొన్‌సాంటో సంస్థవారికి ఇరవైఏళ్ల పాటు విత్తన ఉత్పత్తి దారులు లాభాలలో వాటా-రాయల్టీ-ని చెల్లించవలసి ఉంది. ఆ గడువు ముగిసిపోయిన తరువాత మొన్‌సాంటో వారు రాయల్టీని వసూలు చేసుకుంటూ ఉన్నారన్నది ప్రచారమవుతున్న ఆరోపణ. అదే విత్తనాలను ఒకేరకం సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న బిటిపత్తి విత్తనాలకు మొన్‌సాంటో వారు పేర్లు మారుస్తున్నారు. బిటి మొదటి రకం విత్తనాలకు రాయల్టీ గడువు ముగిసినప్పటికీ బిటి రెండవ రకం విత్తనాలపై మొన్‌సాంటో సంస్థ రాయల్టీని దండుకుంటోందట. బిటి మూడవ రకం పత్తి విత్తనాలను సైతం మొన్‌సాంటో వారు త్వరలో విడుదల చేయనున్నారట. ఇలా పేర్లు మార్చడం ద్వారా ఒకేరకం విత్తనాలను అమ్మి ప్రపంచీకరణ నియమావళిని వమ్ము చేస్తున్న ఈ బహుళ జాతీయ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా చర్యలను తీసుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను మాత్రం నిరోధించగలవు. కానీ ఈ సంస్థ రాయల్టీని వసూలు చేయకుండా కేంద్రం మాత్రమే నిరోధించగలదు..నియమావళి పాటిస్తున్న భారతీయ సంస్థలను సైతం విదేశాల ప్రభుత్వాలు తమ దేశాలనుండి వెళ్లగొడుతున్నాయి. నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న విదేశీయ సంస్థలను మన ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి.
కంది వంటి పప్పు ధాన్యాల విత్తనాల ధరను తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల్లోనే రెండుసార్లు తగ్గించింది. ఇలా తగ్గించడమంటే ప్రభుత్వం విత్తనాలపై రైతులకు ఇస్తున్న సబ్సిడీని పెంచడమే. రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం ఇలా సబ్సిడీని పెంచడం హర్షణీయం. కానీ ఇలా తగ్గిన తరువాత కూడ రైతులు కంది విత్తనాలను క్వింటాలునకు రూ.6230లు చెల్లించి కొనుగోలు చేయాలి. అంటే కిలో ధర రూ.623లు. ఇది టోకు ధర..చిల్లరగా కొనేవారు బహుశా మరింత ఎక్కువ చెల్లించాలేమో? అలాగే విత్తనం పెసల ధర కిలోకు రూ.625గాను, విత్తనం ఉలవల ధర రూ.547గాను ప్రభుత్వం నిర్ధారించిందట. మామూలు ఆహార ధాన్యాలకు, విత్తనాలకు మధ్య ధరలలో ఇంత తేడా ఉండడం దశాబ్దుల వైపరీత్యం. 1980వ దశకం ఆరంభం వరకు వ్యవసాయదారులు తదుపరి పంటకు కావలసిన విత్తనాలను తామే తయారు చేసుకునేవారు. పంటను కోయడానికి ముందు తమ వరిపంటకు అవసరమైన విత్తనాలను సేకరించడం సంప్రదాయ వ్యవసాయంలో భాగం. 1960వ దశకంలో హరిత విప్లవం పేరుతో సంకరజాతి రకాల -హైబ్రిడ్- విత్తనాలు తయారు కావడం మొదలైన తరువాత ఈ వ్యవసాయ వాణిజ్యం మొదలైంది. విత్తనాలకు పనికిరాని ధాన్యాలు, పువ్వులు ఇతర పంటలు పండుతున్నాయి. రైతులు ప్రతి పంటకూ వ్యాపారుల వద్ద ప్రభుత్వాల వద్ద విత్తనాలను కొనుగోలు చేయవలసిన వ్యవస్థ నెలకొన్నది. సేంద్రియ వ్యవసాయం స్ఫూర్తికి ఇదంతా విరుద్ధం. రైతులు ఎవరికివారు తమకు కావలసిన విత్తనాలను తయారు చేసుకొనేందుకు వీలైన వ్యవసాయ వ్యవస్థను ఎందుకు పునరుద్ధరించరాదు? ఆ దిశగా పరిశోధనలు జరపాలన్న, రైతులకు అందరికీ విత్తనాల ఉత్పత్తికి అవసరమైన పరిజ్ఞానాన్ని కలిగించాలన్న ధ్యాస ఎందుకని కలుగడం లేదు?
హైబ్రిడ్ బిటి విత్తనాలను కృత్రిమమైన రసాయపు ఎరువులను ఉపయోగిస్తున్న వ్యవసాయం వల్ల లభించే దిగుబడుల కంటె సేంద్రియ సంప్రదాయ వ్యవసాయం వల్ల అధిక ఉత్పత్తినని సాధించవచ్చునని దేశవ్యాప్తంగా అనేకమంది ఋజువు చేస్తున్నారు. ఆవుపేడ తదితర గో ఉత్పత్తులను అటవీ ప్రాంతంలో దొరికే ఆకులను మట్టిని ఉపయోగించడం ద్వారా సంప్రదాయ సేంద్రీయ వ్యవసాయం సాధ్యమవుతోంది. సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను భుజించడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడ మెరుగుపడుతోంది. చిత్రవిచిత్ర వ్యాధులను నిరోధించవచ్చు. మొత్తం సిక్కిం రాష్ట్రం సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా ఏర్పడి ఉంది. మొత్తం దేశం సేంద్రియ వ్యవసాయ క్షేత్రగా ఏర్పడినప్పుడు నకిలీ విత్తనాల అవసరం ఉండదు..