ఉత్తరాయణం

కానరాని నగరాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుండి విశాఖ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, నాలెడ్జిహబ్, టూరిజమ్ హబ్, హెల్త్‌హబ్, స్పోర్ట్స్ హబ్‌ల క్రింద తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటనల హోరు గుప్పిస్తోంది. ఈ హబ్‌ల క్రమంలో మరిన్ని త్వరలో చేరనున్నాయని మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇఎఫ్‌ఆర్ సందర్భంగా ఇటీవల నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం తప్పించి నగరాభివృద్ధి ఏ విధంగా కానరావడం లేదు. అధిక ఫీజులు, పడకేసిన ప్రభుత్వ యంత్రాంగం, ఇరుకైన రోడ్లు, నీటికొరత, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ, ట్రాఫిక్‌జామ్‌లు, దుర్గంధ భూయిష్టమైన విశాఖ ఓల్డ్‌సిటీ, శాంతిభద్రతల సమస్యలు ఇలా నగరంలో చిరకాలంగా తిష్టవేసుకున్న పలు సమస్యల పరిష్కారంకోసం చిత్తశుద్ధితో కృషిచేయడంవల్లనే నగర అభివృద్ధి సాధ్యవౌతుంది. నాయకుల ప్రకటన హోరుతో విశాఖ నగర వాసు లు విసుగెత్తిపోతున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
టీచర్లకు రాజకీయాలెందుకు?
తెలంగాణలో ఉపాధ్యాయులు రాజకీయ సిద్ధాంతాలకు అనుసరించడం ఘోరం. ఎందుకంటే వీరొక సిద్ధాంతానికి కట్టుబడటం వల్ల, దీని ప్రభావం వారి బోధనపై పడితీరుతుంది. దీనివల్ల పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నిలయాలుగా మారతున్నాయి. దీని ఫలితంగానే కేవలం సర్ట్ఫికెట్లను మాత్రమే కలిగి, ఉద్యోగానికి అర్హులు కానివారు విశ్వవిద్యాలయాలనుంచి బయటకు వస్తున్నారు. ఈ పరిస్థితిని అధికమించాలంటే, ముందుగా ఉపాధ్యాయులు డిటిఎఫ్ వంటి యూనియన్లను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధించాలి. వీటి స్థానంలో కేవలం ఒకే ఒక వృత్తిపరమైన సంస్థ ఉండాలి. ఉదాహరణకు ఇన్‌స్టిట్యూట్ ఇంజినీర్స్. ఇదేవిధంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ఏర్పాటు చేసుకొని విద్యా ప్రమాణ పెంపుకోసం కృషి చేయాలి.
- టి.హెచ్.చౌదరి, సికిందరాబాద్
125 అడుగుల విగ్రహమా?
భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధికెక్కిన బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై అయిదవ జయంతి సందర్భంగా ఏడాది పొడుగునా ఆయన సంస్మరణ చేయాలనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై అయిదు అడుగుల భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్స్‌నందు నెలకొల్ప సంకల్పించారు. ఒక గొప్ప వ్యక్తిమీద భక్తిప్రపత్తులు చాటుకోవడానికి ఆయన సమున్నత ఆశయాలు ఆచరణలో పెడితే ఆ మహావ్యక్తి ఆత్మసంతసిస్తుంది కాని పెద్దపెద్ద విగ్రహాలు అవసరం లేదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పకడ్బందీగా నిర్వహించాలి
వివిధ పోటీ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షలకోసం ఎం తోమంది నిరుద్యోగులు నెలల తరబడి ప్రణాళికాబద్ధంగా రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి చదువుతారు. బాగా ప్రిపేర్ అయినవారు ఆ ఉద్యోగం తమకే వస్తుందని ఆశతో, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడానికి వెళతారు. అయితే ఆ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించవలసిన బాధ్యత అధికారులపై ఉంది. అవినీతికి, కాపీయింగ్‌కు తావివ్వకూడదు. పరీక్షా నిర్వహకులకు ప్రత్యేక శిక్షణనివ్వాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. అలాగైతేనే నిరుద్యోగులు పడిన శ్రమకు విలువుంటుంది. ‘కష్ట్ఫేలి’అనేది నిజమవుతుంది. లేనిచో నిరుద్యోగులు మరింత నిరాశకు, మానసిక ఒత్తిడికి గురిఅవుతారు.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తెరవాలి
ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇకనైనా తెరవాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు తల్లిదండ్రులు భరించలేరు. కనుక ఇంగ్లీష్ మీడియంవల్ల ప్రతీ విద్యార్థికి మేలు జరుగుతుంది. ఇంగ్లీషు అంతర్జాతీయమైన భాష. తెలుగు ఓ ప్రాంతానికే పరిమితం. కొందరు తెలుగువాళ్ళకి తెలుగు చదవడం రాదు! ప్రపంచంతో మాట్లాడాలి అంటే అది ఇంగ్లీషు భాష తప్ప మరేమీలేదు. ప్రతీ ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీషులో మాట్లాడడం తప్పనిసరి చెయ్యా లి.
- వి.శశిధర్, కంచరపాలెం