సంపాదకీయం

ఇక భూముల వేలం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి లభించకపోవడంవల్ల పారిశ్రామిక ప్రగతి ఆగిపోరాదన్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో అమలు చేయనున్నదట! ప్రగతి అంటే పారిశ్రామిక ప్రగతి మాత్రమేనన్నది ప్రపంచీకరణ మొదలైనప్పటినుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రచారం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు ఎవరైనప్పటికీ ఈ ప్రగతి భూమిక మారడంలేదు. సాధ్యమైనంత ఎక్కువ భూమిని ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి నడుం బిగించిందన్న వార్తలు వదంతులు ఊపందుకుంటుండడానికి ఈ ప్రగతి లక్ష్యాలు నేపథ్యం! దేశమంతటా విస్తరించి ఉన్న కేంద్ర ప్రభుత్వపు మిగులు భూమి ప్రభుత్వేతర సంస్థలకు లభించనున్నదట! ఇలా భూమిని పొందగల ప్రభుత్వేతర సంస్థలు పెట్టుబడులను పెట్టి పరిశ్రమలను విరివిగా నెలకొల్పి ఉత్పత్తులను పెంచగలవన్నది కేంద్ర ప్రభుత్వ విశ్వాసమట! అందువల్ల కేంద్ర ప్రభుత్వం వారు తమ అధీనంలో ఉన్న మొత్తం మిగులు భూమిని వేలం ద్వారా ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించనున్నారట! ఇందుకు పూర్వరంగంగా తమ అధీనంలో ఉన్న మిగులు భూమితో భూనిధి-లాండ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేయనున్నారట! ఇందుకోసం భూమి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి సంఘం వారు ఆరంభించారట! ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ప్రభుత్వరంగ వాణిజ్య పారిశ్రామిక రంగ సంస్థల భూమి ఎంత ఉంది? ఈ మొత్తం భూమిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలకు ఇతర అవసరాలకు పోను ఎంత మిగిలి ఉంది? అన్న వివరాల సేకరణ మొదలైందట! మొత్తం మిగులు భూమి తేలిన తరువాత వివిధచోట్ల ఉన్న భూ ఖండాలను కలిపి భూనిధిని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత ఒక్కొక్క భూఖండాన్ని వేలం ద్వారా ప్రభుత్వేతర సంస్థలకు విక్రయిస్తారట! ప్రభుత్వేతర సంస్థలంటే ప్రధానంగా విదేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలన్నది బహిరంగ రహస్యం! ఎందుకంటె మన దేశంలో పెట్టుబడులను పెట్టవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం విదేశీయ ప్రభుత్వాలకు, విదేశీయ వాణిజ్య సంస్థలకు అత్యంత ఆర్భాటంగా విజ్ఞప్తులు చేస్తుండడం ప్రపంచీకరణ మొదలైనప్పటినుంచి జరిగిన ప్రధానమైన ప్రగతి...
ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-మన దేశంలో వ్యవస్థీకృతమైన ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాటాలను ప్రభుత్వేతరులకు విక్రయించడం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ-డిస్‌ఇనె్వస్టిమెంట్- అని నామకరణం చేసింది! ఈ అమ్మకాల కోసం దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడ ఏర్పడింది! ప్రతి ఏటా ఈ అమ్మకాల మంత్రిత్వ శాఖ వారు లక్ష్యాలను నిర్ధారించి, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను, వాటాలను ప్రభుత్వేతర సంస్థలకు అమ్మేశారు. ఈ అమ్మకాల ఫలితంగా ప్రభుత్వానికి ఏటా అనేక వేల కోట్ల రూపాయలు లభించింది, లభిస్తోంది! ఇలా అమ్మడంవల్ల వచ్చిన ఆదాయం పెట్టుబడుల అభివృద్ధి-కాపిటల్ గెయిన్స్-లో భాగం. అందువల్ల ఆ సొమ్మును మూలనిధి-కాపిటల్ ఫండ్‌గా ఏర్పాటు చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రతి ఏడాది వినియోగించుకోవాలి! కానీ ప్రభుత్వం ఇలాంటి మూలనిధిని ఏర్పాటు చేసిన దాఖలా లేదు. వాటాలను అమ్మిన సొమ్మును వార్షిక ఆదాయంలో జమ కట్టి లోటును తగ్గించుకోవడం ఈ ఇరవై ఏళ్లుగా ప్రభుత్వాల విధానమైంది! దీనివల్ల పన్నులు భారీగా పెంచే అవసరం లేదు, ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులకు మంచి ‘పేళ్లు’ వస్తున్నాయి. ఈ వాటాలకు తోడు భూమిని కూడ అమ్మిపారేసి వార్షిక ఆదాయాన్ని పెంచుకొనడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ప్రభుత్వం వారి భూమి-మిగులు భూమి- ఇలా సెంటు మిగలకుండా అమ్ముడయ్యే వరకు ప్రభుత్వానికి ప్రతి ఏటా అదనపు ఆదాయం లభించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు, మిగులు భూమి మొత్తం ప్రభుత్వేతర సంస్థలకు అమ్ముడు పోయిన తరువాత ప్రభుత్వం ఆదాయం ఒక్కసారిగా కుదేలుమంటుంది. వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక-బడ్జెట్-లో పెద్దఎత్తున లోటు ఏర్పడిపోతుంది..అప్పుడు ఏం చేస్తారు?
బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రూపొందించిన భూమి సేకరణ చట్టం ప్రకారం వ్యవసాయ, అటవీ భూములను సేకరించడం ప్రభుత్వాలకు బహు సులభమైంది. మొదట కేవలం ప్రభుత్వ పథకాలకోసం, ప్రజాహిత కార్యకలాపాల కోసం మాత్రమే ఈ 1894 నాటి చట్టం ప్రకారం భూమిని సేకరించేవారు. ఆ తరువాత సవరణలు ద్వారా ప్రభుత్వేతర సంస్థలకు భూమిని భారీగా కట్టబెట్టడం మొదలైంది. 1994లో వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత, 2005లో ప్రత్యేక ఆర్థిక మండలుల చట్టం అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ భూములను కొల్లగొట్టి పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే ప్రక్రియ పరాకాష్ఠకు చేరింది! భూమిని నమ్మి జీవించడం వ్యవసాయం...్భమిని అమ్మి జీవించడం దివాలాకోరుతనం-ఇదీ ఈ దేశంలో అనాదిగా ప్రగతి సూత్రం. కానీ ఈ ప్రగతి సూత్రం క్రమంగా మారిపోయింది. పారిశ్రామిక ప్రగతి మాత్రమే నిజమైన ప్రగతి...అన్నది ప్రపంచీకరణ సూత్రం. అందువల్లనే లక్షలాది ఎకరాల పంట పొలాలను, సతతహరిత అటవీ సీమలను పాడుపెట్టి పరిశ్రమలను పెట్టడం ఆరంభమైంది. హరిత పరిరక్షక నియమాలను అతిగా పాటించడంవల్ల ప్రగతి దెబ్బతినిపోతుందన్నది 2011 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ చేసిన చారిత్రక ప్రకటన! ప్రగతి అనంటే పారిశ్రామిక ప్రగతి అన్నది ప్రపంచీకరణలో వౌలిక సిద్ధాంతం! మన దేశంలో చొరబడిన విదేశీయ సంస్థలు మరింత ముందుకెళ్లి ప్రగతి అంటే సేవలరంగం, పంపిణీ రంగం, వినియోగ రంగపు ఉత్పత్తులు విస్తరించడం మాత్రమేనన్న వినూతన సూత్రాన్ని మనకు సేర్పించాయి. అందువల్లనే వేలాది ఎకరాల భూమిని కాజేసిన ఈ విదేశీయ సంస్థలు సిమెంటు, బొగ్గు, పెట్రోలు, ఇంధన వాయువులు, విద్యుత్తు, ఉక్కు వంటి వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులను పెంచలేదు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్లు, అప్పడాలు, సేమ్యాలు, మసాలా దినుసులు, సీసాల నీరు, బీరు వంటి పదార్ధాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి...అప్పడాలను ఆవకాయలను సైతం మనం తయారు చేసుకొనలేమన్నది ప్రపంచీకరణ మనకు నేర్పిన పాఠం!
ఈ మన్‌మోహనీయ ఆర్థిక పథంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ముందు ముందుకు సాగుతోంది. సుప్రీంకోర్టు పదే పదే నిరసించిన కారణంగా కొత్త భూమి సేకరణ చట్టం ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం కనీసం ఎనబయి శాతం రైతులు భూమి యజమానులు అంగీకరించినప్పుడు మాత్రమే ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకు భూమిని కట్టబెట్టడానికి వీలుంది. ఏమీ రామాయణమని ప్రభుత్వం తన భూమిని ప్రభుత్వేతరుల కోసం త్యాగం చేయడానికి పూనుకుంటోంది!