సబ్ ఫీచర్

ఇంకుడు గుంతలతో జలసమృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు భారతదేశంలోనే కాక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నీటి సమస్య అధికమైంది. ఎన్నో సంవత్సరాలుగా శాస్తవ్రేత్తలు మేధావులు నీటి సమస్య వస్తుందని చెప్పినప్పటికీ, రాజకీయ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వస్తే గిస్తే మూడో ప్రపంచ యుద్ధం నీటిపైనే వస్తుందనటంలో సందేహం లేదు. ఇంత అభివృద్ధి చెందినా ఇంకా మనం నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం అంటే ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివలన భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య కొంతవరకైనా తీరుతుంది. రైతు సోదరులు కూడా ముందుకు వచ్చి వ్యవసాయ పొలాల్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇరు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామంలో కార్యాలయాల్లో మరియు ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటుకొరకు అందరూ చొరవ చూపాలి. ప్రస్తుత పరిస్థితిలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గపోవడంతో వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇకనైనా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం తవ్వుకొనే ఇంకుడు గుంతలు భవిష్యత్ తరాలకు మనం అందించే కానుకగా ఉంటాయ. ముఖ్యంగా ప్రజలు, రైతులు ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు కురిసినపుడు ఎంతో నీరు వృథాగా పోతుంది. అదే విధంగా నిత్యం మనం ఉపయోగించే నీరు సరైన మార్గంలో వాడకపోవడంవల్ల ఎంతో నీరు నిరుపయోగంగా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసుకోవాలి. ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజేసేందుకు ప్రచారం నిర్వహించాలి. ఈ విషయమై ప్రభుత్వం సినిమా థియేటర్లలో ఇంకుడు గుంతల గురించిన చిత్రాల్ని ప్రదర్శించాలి. సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా ప్రతి ఒక్కరు పాలుపంచుకునేలా చూడాలి. వర్షం నీరు వృథా కాకుండా ప్రతి నీటి చుక్కను సద్వినియోగపరచుకునేందుకు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక గొలుసుకట్టులా వారి వారి ఇండ్లల్లోని ఖాళీ స్థలంలో ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసుకోవాలి. ఇంకుడు గుంతలవల్ల వర్షం నీరు వృథాకాకుండా భూగర్భంలో జలాలు వృద్ధి చెంది మానవులకు అవసరాలు తీరుస్తాయి. భవిష్యత్ తరాలు నీటి సమస్యను ఎదుర్కొనాలంటే తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరం అంతా నీటి సమస్యతో అల్లాడిపోతుంది.

- గుండు రమణయ్య