ఉత్తరాయణం

అనవసర జోక్యాలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిమతానికి సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. కేవలం కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ కట్టుబాట్లు ఉండం ఆ మతం ఉన్నతికే. స్ర్తి ప్రత్యక్ష దైవం మానవజాతికి మార్గదర్శకం. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎవరో గొడవ చేసి బావుకోవాలనుకోవడం సరైంది కాదు. ఏ ఇతర మతాల విషయంలో ఇటువంటి వాటిలో తలదూర్చని కోర్టులు హిందూమతం వచ్చేసరికి చులకన చేయ డం ధర్మం కాదు. హిందూమతంలో అక్కరలేని జోక్యాలను నివారించడం మంచిది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
ఘనకీర్తిని నిలుపుకోవాలి
దేశంలోనే భాషా ప్రాతిపదికపై ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో ఘనమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించింది. ఎందరో మేధావులను, ప్రజ్ఞావంతులను దేశానికి అందించిన ఘనమైన కీర్తిని సొంతం చేసుకొని దేశంలోనే ప్రముఖ విద్యాలయంగా మన్ననలను పొందింది. అయితే ఇటీవలి కాలంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ పరువు బజారునపడుతోంది. తరచుగా పరీక్ష పేపర్లు లీక్ కావడం, పరీక్ష పత్రాలు తారుమారు, మూల్యాంకనం తీరుపై విమర్శలు, అవినీతి ఆరోపణలు, విద్యార్థులలో క్రమశిక్షణ లోపించడం, అధ్యాపకుల నియామకాలలో అవకతవకలు, పిహెచ్‌డి ప్రవేశాలలో నిబంధనల ఉల్లంఘన వంటి భారీ ఆరోపణలు రావడం ఆందోళన కల్గించే విషయం. హడావిడిగా కొన్ని కోర్సులు ప్రారంభించడం, వెంటనే రద్దుచేయడం కూడా వర్సిటీ చరిత్రను మసకబారుస్తోంది. యూనివర్సిటీ పాత వైభవాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం, యుజిసి కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
దొడ్డిదోవ ఉద్యోగాలు
ఇటీవలి కాలంలో కాంట్రాక్టు కార్మికులను, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేయడం ఆ డిమాండ్‌ను సర్వీసులో ఉన్నవారు బలపరుస్తూ ప్రకటనలు చేయడం. వీరికి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు రాద్ధాంతం చెయ్యడం ఫక్తు డ్రామాగా చెప్పవచ్చు. నాకు ఊహ తెలిసినప్పటినుంచే ఈ తతంగం అక్షరం పొల్లుపోకుండా నడిపిస్తున్నారు. కాం ట్రాక్టర్ తనకు నచ్చిన వాళ్ళను తన దగ్గర పనివాళ్ళుగా పెట్టుకొని, ప్రభుత్వానికి సేవలందిస్తుంటే ఈ విధానానికే మెరుగులు దిద్ది ఔట్ సోర్సింగ్ అంటున్నారు. ఈ విధానంలో అర్హత పరీక్షలు గాని, నైపుణ్య పరిశీలన గాని, రిజర్వేషన్స్ గాని చూడరు. పైగా ఈ కాంట్రాక్టర్స్ ఎక్కడుంటారో, ఉద్యోగాలు ఎపుడు భర్తీచేస్తారో సామాన్యుడికి ఇప్పటికీ తెలీదు. తెలిసినా అవకాశం ఇవ్వరు. ఇవి దొడ్డిదారి ఉద్యోగాలు ప్రజలు చైతన్యం కావాలి.
- కొసనా మధుసూదనరావు, రోళ్ళపాలెం
హిందుత్వం అజరామరం
హిందూ సమాజాన్ని పేదరికం, నిరుద్యోగం, రోగాలు పీడిస్తున్నాయి. ఎంత చదువులున్నా నిరుద్యోగం. పని దొరక్క పేదరికం, చికిత్స లేక రోగాలు హిందూ సమాజానికి పెద్ద సవాళ్ళు. నిలువు నీడ లేకుండా హిందూ కుటుంబాలు ఎన్నో ఎనె్నన్నో. రెక్కాడితే గానీ డొక్కాడని నిర్భాగ్యులు హిందూ సమాజంలో ఎందరో. తరతరాలుగా నిరాదరణకు గురవుతున్న హిందూ వక్తలు కోకొల్లలు. ఇవన్నీ విదేశీ మత మార్పిడి వారికి ప్లస్ పాయింట్స్. ఈ బలహీనతలు ఆసరాగా తీసుకుని, మతం మార్చి హిందూ సమాజాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలనుకుంటున్నారు. కాని అది వారి తరం కాదు. హిందూత్వం భారతావనిలో అడుగడుగునా వ్యాపించి ఉంది. హిందూత్వాన్ని నాశనం చెయ్యడం దుర్లభం.
- కె.అన్నపూర్ణ, విశాఖపట్నం
యువ చేతన ద్వారా తెలంగాణ బాగు
యువతలో సామాజిక చైతన్యంకోసం యూత్ క్లబ్‌లు ఏర్పాటుచేయాలని టి.ఎస్. రాష్ట్ర సర్కార్ నిర్ణయించడం ఎంతో సముచితం. 15-35 ఏళ్ళలోపు వయస్సున్న యువజనులతో ఈ కార్యక్రమం ద్వారా వరకట్న దురాచారం స్వచ్ఛ తెలంగాణ సాధిస్తాం. ప్రజల్లో జాతీయ సమైక్యత కోసం కార్యక్రమాలు నిర్వహించి అవయవదానాలవల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తాం. టి.ఎస్. రాష్ట్ర సర్కార్ ఈ యూత్ క్లబ్‌లకు గౌరవ పారితోషికం మిని మం ఖర్చులు రూ.1000/-లు ఇస్తే బాగుంటుందని టి.ఎస్. రాష్ట్ర సర్కార్‌ను కోరుతున్నాము.
-కొలిపాక అమన్‌రాజీవ్, బోడుప్పల్
ఇంగ్లీషు మీడియంకు ప్రాధాన్యతనివ్వాలి
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. తెలుగు మీడియంకి విలువలేనప్పటికీ, తెలిసీ కూడా చాలా మంది తెలుగు మీడియం చదువులు చదువుతున్నారు. ప్రతీ విద్యార్థి ఇంగ్లీషు మీడియంకి విలువ ఇవ్వాలి. తెలుగులో మాట్లాడడం వల్ల తప్పులేదు. కాని ఉద్యోగ అవకాశాలు కోసం, తెలుగురాని వారితో సంభాషించుకోవడం కోసం ఇంగ్లీషు తప్పనిసరి. ప్రతీ బడిలో ఇంగ్లీషులో మాట్లాడ్డం తప్పనిసరి చెయ్యాలి.
- ఆర్.విశ్వనాథ్, దొండపర్తి