సంపాదకీయం

వైరుధ్యాల వ్యవసాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి ‘జన్యు పరివర్తక’- జెనటికల్లీ మోడిఫైడ్ (జిఎమ్) సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయగలదని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావ్‌దేకర్ ‘‘కనిపెట్టాడు’’. ఇలా ‘‘కనిపెట్టడం’’ మనదేశంలో విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకొని లాభాలను తమ దేశాలకు తరలిస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ - మల్టీ నేషనల్ కంపెనీలకు అత్యంత ఆనందదాయకం. ‘జన్యు జీవకణాల మార్పిడి’- జెనటిక్ మోడిఫికేషన్- ద్వారా రూపొందుతున్న ‘మహాసంకరజాతి’ విత్తనాలలో బాసిలస్ తురింజెన్సిస్-బిటి- అన్న జీవరసాయనం ఉత్పత్తి అవుతోంది. అందువల్లే ‘జెఎమ్’ పంటలకు మరోపేరు ‘బిటి’ పంటలు. ప్రపంచంలోని అధికాధిక సంపన్న దేశాల ప్రభుత్వాలు ‘బిటి’ విత్తనాలను, ‘బిటి’ వంగడాలను నిషేధించిన నేపథ్యంలో మన కేంద్రమంత్రి ఆవిష్కరించిన ‘సిద్ధాంతం’ స్వదేశీయ వ్యవసాయ ఉద్యమకారులకు, సేంద్రియ సంప్రదాయ పరిరక్షకులకు బహుశా దిగ్భ్రమను కలిగించి ఉంటుంది! ‘బిటి’ విత్తనాలను, వంగడాలను రూపొందించడానికి క్షేత్ర పరిశోధనలు-్ఫల్డ్ ట్రయల్స్-సైతం జరుపరాదని స్వదేశీయ ఉద్యమకారులు కోరుతున్నారు. కానీ ప్రస్తుతం పద్దెనిమిది రకాల ‘జిఎమ్’ పంటలపై వ్యవసాయ క్షేత్రస్థాయి పరిశోధనలు జరుపుతున్నట్లు సోమవారం న్యూదిల్లీలో జరిగిన ‘అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ’ దినోత్సవం సందర్భంగా వెల్లడైంది. ఈ ఉత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సి. హెచ్. విద్యాసాగర్ రావుతో కలసి పాల్గొన్న కేంద్రమంత్రి ‘సిద్ధాంత పత్రాన్ని’ ఆవిష్కరించారట! మనదేశంలోను, ప్రపంచంలోను ప్రాకృతిక జీవవైవిధ్యాన్ని తీవ్రంగా భంగపరుస్తున్న విపరిణామాలలో ‘బిటి’ విత్తనాల ద్వారా సేద్యం జరగడం ప్రధానమైనది. ‘జీవవైవిధ్యం’, ‘జిఎమ్’ సాంకేతిక పరిజ్ఞానం పరస్పర వైరుధ్యాలు. జీవవైవిధ్య పరిరక్ష దినోత్సవ వేదికపై నిలబడి ప్రకాశ్ జావ్‌దేకర్ ‘బిటి’ విత్తనాలను ‘జిఎమ్’ పరిజ్ఞానానికి అనుకూలమైన ఆవిష్కరణ చేయడం విస్మయకరమైన విచిత్రం. ‘జిఎమ్’ పంటలను పండించడం వల్లనే భారతీయ వ్యవసాయదారులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారన్న ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. బ్రిటన్ యువరాజు చార్లెస్ దశాబ్దికిపైగా ఈ సంగతిని దేశదేశాలలో చాటుకొస్తున్నారు. గత ఏడాది జూన్‌లో అమెరికాలోని అధ్యయన సంస్థలుకూడ ఈ సంగతిని ధ్రువపరిచాయి. ‘స్వదేశీ జాగరణమంచ్’, ‘్భరతీయ కిసాన్‌సంఘ్’, ‘నవధాన్య’వంటి సంస్థలు ఇంకా ఇతర సంస్థలు ‘జిఎమ్’ పంటలను వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ‘బిటి’ విత్తనాలను భారీగా రైతులనెత్తికెత్తడానికి ఎందుకని ఉవ్విళ్లూరుతోంది..?
ఇంతవరకూ మనదేశంలో ‘బిటి’ పత్తిమాత్రమే సాగవుతోంది. ‘మెన్‌సాంటో’ అను అమెరికా సంస్థ పదిహేను ఏళ్లుగా భారతీయ వ్యవసాయదారులకు ‘జిఎమ్’ పత్తివిత్తనాలను భయంకరమైన ధరలకు అమ్మి వేలకోట్ల రూపాయలను దోచేసింది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు! ఈలోగా ‘బిటి’ ఆవాలను పండించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేస్తోంది. ‘బిటి’ ఆవాలను పండిచడానికి అనుమతినివ్వాలన్న కోర్కెలను సానుకూల దృష్టితో పరిశీలిస్తామని కేంద్రమంత్రి సోమవారం చెప్పడమే ఓ ధ్రువీకరణ. ‘బిటి’ ఆవాలను పండించడంవల్ల నూనెల ఉత్పత్తి పెరగవచ్చు. ‘పోపు’లు ఘాటెక్కవచ్చు. కానీ ఆహారభద్రత ఎలా పెరుగుతుందన్నది ప్రభుత్వం వివరించవలసిన అంశం! 2014 మే 26వ తేదీకి పూర్వం పదేళ్లపాటు మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘బిటి’ పంటల తరఫున, ‘జిఎమ్’ పరిజ్ఞానం తరఫున ‘వకాల్తా’ పుచ్చుకోవడం చరిత్ర. స్వదేశీయ వ్యవసాయ ఉద్యమకారుల ప్రతిఘటన ఫలితంగా ‘బిటి’ వంకాయలుకాని, ‘బిటి’ ఆవాలుకాని మన వ్యవసాయంలోనికి చొరబడలేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ ‘బిటి’ రసాయన భూతాన్ని పారదోలుతుందని భావించినవారి ఆశలు అడియాసలయ్యాయి.
‘జిఎమ్’ ఆవాలను ప్రవేశపెట్టడానికి గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం రంగాన్ని సిద్ధపరిచింది. అయితే వివిధ ఉద్యమ సంస్థల కారణంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదావేసింది. ‘జిఎమ్’ పంటలవల్ల భూమికి కాని, పర్యావరణానికి కాని హాని కలుగుతుందన్న సాక్ష్యాధారాలు ఏవీ లేవని ప్రకాశ్ జావ్‌దేకర్ 2014 డిసెంబర్ నాలుగవ తేదీన రాజ్యసభలో ప్రకటించారు. పనె్నండు రకాల ‘జిఎమ్’ పంటలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పండించి పరీక్షించే కార్యక్రమం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ‘జన్యు సాంకేతిక పరిజ్ఞాన నిర్ధారణ మండలి’-జనటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ-జిఇఎసి-వారు అప్పటికే ‘పనె్నండు’ పంటలకు అనుమతినిచ్చారు. ఇలా క్షేత్రస్థాయిలో మొత్తం పద్దెనిమిదిరకాల పంటలకు అనుమతిని ఇవ్వడం ఈ పద్దెనిమిది నెలలలో జరిగిన ప్రగతి. శాస్ర్తియ అధ్యయనాన్ని, పరిశోధనను అడ్డుకోరాదన్నది తమ విధానమని కేంద్రప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నది. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంవారి విధానాన్ని కొనసాగించడానికే నరేంద్రమోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నది ఇలా మరోసారి స్పష్టమైంది! గతంలో ‘బిటి’ వంకాయలను అనేక రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పండించారు. ఈ ‘బిటి’ వంకాయలు ‘నిరపాయకరమనీ’ నిర్ధారణలు జరిగిపోయాయి. కానీ ‘బహుళ జాతీయ సంస్థలు’, వాటి దళారీలు కలసికట్టుగా కృషి చేసి ‘అబద్ధాన్ని నిజంగా’ను, ‘నిజాన్ని అబద్ధంగా’ను నిర్ధారించగలిగినట్లు ఆ తరువాత వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమీక్షించింది. ఆ తరువాత మందగించిన ‘బిటి’ పరీక్షలు మళ్లీ ఊపందుకోవడం ప్రస్తుత ఘట్టం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రప్రభుత్వం ‘దీపం పెట్టిన తరువాత దిగవేసే’ విధానాన్ని ఎందుకని అమలు జరుపుతోంది? సిక్కిం రాష్ట్రం సంపూర్ణ సేంద్రియ-ఆర్గానిక్-వ్యవసాయ క్షేత్రంగా రూపొందింది. ఈ సంగతిని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సిక్కిం రాజధాని గాంగ్టక్‌లో గత జనవరి 18న ప్రకటించారు. దేశవాలీ ఆవుపేడ, దేశవాలీ ఆవుపంచితం తదితర గోఉత్పత్తులు సేంద్రియ వ్యవసాయానికి ప్రధాన ఆధారం. కృత్రిమ రసాయనపు ఎరువులు అవసరం లేదు. నిషిద్ధంకూడా. దేశవాలీ ఆవులను పరిరక్షించి పెంపొందించే విధానాన్ని నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఆవులను, అడవులను, వ్యవసాయ భూమినీ పాడుచేస్తున్న ‘జిఎమ్’ పంటలను ప్రోత్సహించడమేమిటి??