సబ్ ఫీచర్

మూర్ఖత్వానికి పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో పరిమితి లేనివి, అనంత పరివ్యాప్తిని కలిగి ఉన్నవి రెండున్నాయి. ఒకటి ఈ విశ్వం. రెండవది మానవుడి మూర్ఖత్వం. మొదటిది నిజమో? కాదో? చెప్పలేను. కానీ రెండవది మాత్రం ముమ్మాటికీ నిజం’’అన్న ప్రముఖ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) తీవ్రవాదులను చెప్పుకోవచ్చు. అలనాడు సిరియా సంపదలతో తులతూగిన సిరియా, ఇరాక్, ఎమెన్ తదితర దేశాలు మత మూర్ఖత్వంనుంచి ఉద్భవించిన ఐఎస్‌ఐఎస్ కారణంగా నేడు ఆయా దేశాల ప్రజలు అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలువేసే పరిస్థితులు కల్పించారు. శాంతి, సౌభ్రాతృత్వంలను ప్రబోధించే మతాలలో ఇస్లాం ఒకటి. హింసకు ఇస్లాం మతంలో తావులేదు. అయితే, కొందరు తమ మూర్ఖత్వంకు మతం రంగు పులిమి, వేలాది మంది ఊచకోతకు కారణమవుతున్నారు. హిందూ మతం అంటే విరుచుకుపడే ఈ ఐసిస్ తీవ్రవాదులు, తమ బలగంను పెంచుకోవడంకోసం, హిందూ పురాణ ఇతిహాసాలలో పేర్కొన్న అంశాలను అనుసరించడం గమనార్హం.
మహాభారతం ప్రకారం మహాభారత యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు తన భార్య సుభద్రకు పద్మవ్యూహం గురించి చెబుతుండగా, ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటాడు. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలుసుకొంటే కష్టమని భావించిన శ్రీకృష్ణుడు పద్మవ్యూసంలోకి చొచ్చుకుపోవడం మాత్రమే సుభద్రకు చెప్పేలా చేస్తాడు.
అనంతరం యుద్ధంలో అభిమన్యుడు కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి సులువుగా చొచ్చుకుపోయి, తిరిగిరావడం తెలియక వీర మరణం పొందాడు. తొలుత ఇది కట్టుకథ అని కొట్టిపారేసినా, తల్లిగర్భంలో ఉన్న శిశువుకు పలు అంశాలపట్ల అవగాహన కలిగించుకొనే శక్తి ఉంటుందని శాస్ర్తియంగా నిరూపించబడింది. కరుడుకట్టిన ఐసిస్ తీవ్రవాదులను తయారుచేయడంకోసం వారు వినూత్న పంధాను అవలంభిస్తున్నారు.
ఇంగ్లాండుకు చెందిన ఖిల్లీయన్ అనే సంస్థ కథనం ప్రకారం, ఐసిస్ తీవ్రవాదులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిబిరాలలో 31వేల మంది గర్భవతులు ఉన్నారు. జీహాద్ గీతాల ఆలాపనతో వీరి దైనందిన జీవితం ప్రతిరోజు ప్రారంభంఅవుతుంది. ప్రతిరోజు జిహాద్‌కు సంబంధించిన ప్రసంగాలు వీరిచేత వినిపిస్తారు. రక్తం సలసలకాగే విధంగా రూపొందించిన విప్లవ గీతాలను వీరికి వినిపిస్తారు.
ఈ విధంగా చేయడంవలన వారికి పుట్టబోయే పిల్లలు నరనరాన జిహాద్ లక్ష్యంను జీర్ణించుకొని ఉంటారనేది ఐసిస్ తీవ్రవాదుల దురాలోచన. తాము చెరబట్టిన మహిళలను గర్భవతులనుచేసి, వారిని ఈ శిబిరాలకు పంపుతున్నారు. దీని అంతటికీ కారణం మతం ముసుగులోఉన్న కొందరి మూర్ఖత్వమే.
ఐసిస్ తీవ్రవాదుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఐక్యంకాకపోతే భవిష్యత్‌లో యావత్ ప్రపంచం రావణకాష్టంలా మారే ప్రమాదం ఉంది.

- పి.మస్తాన్‌రావు