ఉత్తరాయణం

ప్రజల గోడు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచుకున్న డబ్బుల మీద నెల నెలా వచ్చే వడ్డీని తగ్గించి యిచ్చి అది కొత్త సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టినందువల్ల అని బ్యాంకులు, పోస్ట్ఫాసులు అంటున్నాయి. యేటా ఏప్రిల్ మాసంలో ఫారం 15జి/ 15హెచ్ యిస్తున్నా అసల్లో కోత విధిస్తున్నది స్థానిక స్టేట్ బ్యాంకి. డిడక్ట్ చేసినట్లు సర్ట్ఫికెటు యిస్తాం. రిఫండ్ తెచ్చకోండి అంటున్నది. ఇప్పుడు యింకో సమస్యతోడైంది. ప్రతి నెలా మొదటి వారంలో రీడింగ్ తీసి స్పాట్ బిల్లింగ్ యిచ్చేవారి జాడలేదు. కరెంట్ ఆఫీసుకి ఫోన్ చేస్తే ఏప్రియల్ నుండి కొత్త సాఫ్ట్‌వేర్ రావాలి. రేట్లు మారినయ్ అంటున్నారు. మరి యిక్కడ మీటర్ తిరగట్లేదా? నెక్స్ట్ స్లాబ్‌లోకి పోతే ఎక్కువ కట్టాల్సి రావడం లేదా? రెణ్ణెల్ల బిల్లు ఒకేసారి కడుదురు గాని అనటం తేలికే. ఇది ప్రజలకు భారం కాదా? ఒక ముతక సామెత వుంది. తన ముడ్డికాకపోతే కాశీవరకు దేకమన్నాట్ట ఒకడు. ప్రజల ఫిర్యాదులకు స్పందన లేదు. ఇదీ మన ప్రభుత్వ కార్యాలయాల తీరు.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
వౌనం అంగీకారమే
అన్యాయాలు, అక్రమాలు కళ్ళెదుట జరుగుతున్నా తమకేమీ పట్టనట్టుండేవారు ఆ చేష్టలను సమర్ధిస్తున్నట్టే లెక్క. అంటే వారు పరోక్షంగా ఆ దుశ్చర్యలలో పాలుపంచుకున్నట్టే. సామాజిక విప్లవాలెలా వస్తాయి? రైల్లోంచి వర్ణవివక్ష కారణంగా బయటకు గెంటివేయడంతో గాంధీ స్వాతంత్య్ర సమర యోధుడయ్యాడు. బ్రిటిష్‌వారి ఆగడాలను భిరంచలేక ఓ భగత్‌సింగ్ అనే దేశభక్తుడు అమరుడయ్యాడు. బలవంతులు, ఆత్మస్థైర్యం గలవారు అన్యాయాలను, అధర్మాలను బహిరంగంగా ఎదుర్కోవాలి. బలహీనులు కనీసం వార్తా పత్రికల ద్వారా రచనల రూపంలో లేఖల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ముదిగొండ శివప్రసాద్‌గారు రాసినట్టు కళ్ళముందు ఏది జరిగినా వౌనంగా మసలేవారు మహాశతృవులే. ఇదే మాట లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ పదే పదే అంటూంటారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
హిందుత్వాన్ని కాపాడాలి
హిందు మతంలో దేవుళ్లకు, ఆచార వ్యవహారాలు, సనాతన సత్సంప్రదాయాలకు సమాన విలువ వుంది. మానవుల శ్రేయస్సు కోసం ఎటువంటి కర్మకాండ ఏ విధంగా నిర్వర్తించాలో వేద శాస్త్రాలు స్పష్టంగా నిర్వచించాయి. గతంలో గ్రహణాలు ఒక మూఢ నమ్మకం అని కొందరు సెక్యులర్ వాదులు బయలుదేరి ఆ సమయంలో శాస్త్రం నిషేధించిన అనేక కార్యాలను చేసేందుకు ప్రయత్నించి, అవి బెడిసికొట్టడంతో సైలెంటైపోయారు. ఇప్పుడు తాజాగా కొన్ని దేవాలయాలలో పూజలు, పునస్కారాలు చేస్తామంటూ ఒక వర్గం బయలుదేరి వారిపై నిషేధం ఎత్తివేయమని కోర్టుల్ని కూడా ఆశ్రయించింది. ఎంతో దూరదృష్టితో ఆలోచించి మానవాళికి వేద శాస్త్రాలు నిర్దేశించిన కొన్ని నిషేధాలను మూఢ నమ్మకాలతో వ్యతిరేకించడం ఆత్మహత్యా సదృశ్యం. హిందూ మతంలో ఏదో జరిగిపోతోందని అన్ని మతాలు మాకు సమానమేనని ఒకవైపు ప్రకటించుకునే కుహనా సెక్యులర్ వాదులు మరొకప్రక్క హిందుమతంపై విద్వేషం జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవుడు నాగరిక సమాజంలో ప్రవేశించినప్పటి నుండి వున్న హిందుత్వం ఒక మతం కాదు, అది మానవుల జీవన విధానం, నవ జీవన వేదం. ఆచార వ్యవహారాలు కాపాడుకోవడం ఇందులో ఒక ముఖ్య భాగం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
బస్సుల్లో వృద్ధులకు రిజర్వేషన్
ఆర్టీసీ బస్సులలో రద్దీవేళ సీనియర్ సిటిజన్లు పడే బాధలు వర్ణనాతీతం. వారికీ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది. కనీసం 4,5 సీట్లయినా వారికి కేటాయించాలి. ఆ సీట్లలో వారే తప్ప మరెవరూ కూర్చోకుండా చూడాలి. వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. అలాగే బస్సు చార్జీలలో వారికి రాయితీ కల్పిస్తే మరింత బాగుంటుంది. ఇప్పటికే రైళ్ళలో ఈ సౌకర్యం ఉండటం గమనార్హం.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్