సంపాదకీయం

వ్యాధిగ్రస్త ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ పారిశ్రామిక సంస్థలు తయారుచేసి విక్రయిస్తున్న ‘బ్రెడ్డు‘ను ‘పిజ్జా’లను ఆరగిస్తున్న వారు ‘కాన్సర్’ వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం ఉందని వెల్లడి కావడం సహజ పరిణామం. ఎందుకంటే ‘శుద్ధిచేసి నిలువ చేసే ఆహారం’-పాకేజ్డ్ ఫుడ్-లో అనేక రకాల కృత్రిమ రసాయనాలను కలుపుతున్నారు. ఇలా తిండిని విష రసాయనాలతో ‘కల్తీ’ చేయడం ఇలా నిలువ ఉంచే ప్రక్రియలో భాగం. రసాయనాలు కలుపకపోతే శుద్ధిచేసిన తిండి ఎంతోకాలం నిలువ ఉండదు. ఇది మొదటి విష ప్రక్రియ. ఇలా నిలువ చేసే డబ్బాల తిండి రుచికరంగా ఉందన్న భ్రమను మన నాలుకలకు, ముక్కులకు కల్పించడం రెండవ విష ప్రక్రియ. ఈ భ్రమను కల్పించడానికి సైతం రకరకాల కృత్రిమ రసాయనాలను వాడవలసిందే. ఇవన్నీ కలిసి ‘వెరసి’ డబ్బాల తిండి. కాగితం డబ్బాలు కావచ్చు, ప్లాస్టిక్ డబ్బా కావచ్చు, గాలి దూరని సంచి కావచ్చు, సీసా కావచ్చు, తిత్తి కావచ్చు... అన్నింటిలోను కృత్రిమ రసాయనాలు చేరినప్పడు మాత్రమే ‘తిండి’ నిలువ ఉంటుంది, నీరు నిలువ ఉంటుంది! కృత్రిమ రసాయనాలను వాడకుండా తిండి పదార్ధాలను ఎక్కడికక్కడ నిలువ చేసుకునే వికేంద్రీకృత వ్యవస్థ భారతీయ జీవనంలో భాగం. కానీ ‘ప్రపంచీకరణ’ ‘్భరతీయత‘ను దిగమింగివేసింది, కేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థను నెలకొల్పింది. అందువల్లనే అప్పడాలు, ఆవకాయలు మొదలుకుని ‘పిజ్జా’లు, ‘బర్గర్’ల వరకూ, సేమ్యాలు, ‘ఒరుగులు’ మొదలుకొని ఐస్‌క్రీమ్‌లు చాక్లెట్ల వరకు గల రకరకాల ‘తిండి’ని బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేయడానికి వీలుగా ప్రభుత్వాలు ‘బృహత్ కృత్రిమ ఆహార ప్రాంగణాల’ - ఫుడ్ పార్కు-లను నెలకొల్పుతున్నాయి. ఈ పార్కులలో తయారయ్యే ‘తిండి’ నిలువ ఉండడం కోసం, ముక్కులకు ‘వాణిజ్య వాసనల’ను కలిగించడం కోసం పదకొండు వేల రకరాల కృత్రిమ ‘సౌందర్య రసాయనాలు’-యాడిటివ్స్-పంపిణీ అవుతున్నాయట! ఈ కృత్రిమ రసాయనాలన్నీ విషాలే. కానీ ‘్ఫలానా రసాయనం విషం....’ అని అప్పుడప్పుడు శాస్తవ్రేత్తలు కనిపెట్టడం పరిశోధన ప్రక్రియలో భాగం. ఇలా కనిపెట్టకపోతే శాస్ర్తియ పరిశోధన స్తంభించిపోయినట్టు లెక్క. అందువల్ల కొత్తకొత్త రసాయనాలు-కెమికల్స్-ఉత్పత్తి కావలసిందే, వాటిని ఆహారంలో కలుపవలసిందే, ఇలా కల్తీ అవుతున్న తిండి రోగాలను కలిగిస్తుందని శాస్తజ్ఞ్రులు కనిపెట్టవలసిందే. ఇదంతా ‘ఆధునిక నాగరికత’ భూన భోంతరాళాలు పట్టకుండా విస్తరించిపోతున్న కృత్రిమ యుగంలో సహజ పరిణామ క్రమం. ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ ‘క్రమం’ మరింత పోయింది. అందువల్ల ఈ ‘ముప్పయి ఎనిమిది’ ‘ముద్ర’- బ్రాండ్-ల ‘రొట్టె’-బ్రెడ్డు-లను తినడం వల్ల కాన్సర్ రోగం వస్తుందన్న శాస్ర్తియ ఆవిష్కరణ ఆశ్చర్యకరం కాదు!
ఈ ముప్పయి ఎనిమిది రకాల ‘ముద్రాంకిత’-బ్రాండెడ్ బ్రెడ్డుల్లోను ‘పొటాసియం బ్రామేట్’, ‘పొటాసియం అయోడేట్’ అన్న ‘రసాయన సాంకర్యాలు’-యాడిటివ్స్-కలిసి ఉన్నాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’-సిఎస్‌సి-పరిశోధకులు నిర్ధారించారట! ముప్పయి ఎనిమిది రకాల ‘బ్రెడ్డు‘లలో ని ఎనబయి నాలుగు శాతం ఈ రెండు రసాయనాలతో సాంకర్యమై ఉన్నాయట! ఈ రసాయనాలు కలవని ‘బ్రెడ్డులు’-పదహారు శాతం-ఏవో మరి! ఈ ముప్పయి ఎనిమిది రకాలలో ‘పిజ్జాలు’ కూడా ఉన్నాయి. ఈ రెండు రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని ‘ఐక్యరాజ్య సమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ వారు నిర్ధారించారట. వీటిలో ‘పొటాసియం బ్రామేట్’ అన్న రసాయనం ‘కాన్సర్ వ్యాధి కారకం’-కార్సినోజెన్-అని కూడ ఆరోగ్య సంస్థ ఏళ్ల క్రితమే ఘోషించి ఉందట! అందువల్ల ఈ రసాయనాల వాడకాన్ని అనేక దేశాలలో ప్రధానంగా సంపన్న దేశాలలో నిషేధించారు. కానీ మన దేశంలో ఇంతవరకూ నిషేధించకపోవడం ‘ప్రపంచీకరణ’ మాయా జాలంలో భాగం. మన ప్రభుత్వాల విధాన రూపకల్పన ప్రక్రియను పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’-మల్టీ నేషనల్ కంపెనీస్-నియంత్రిస్తుండడమే ‘ప్రపంచీకరణ’లోని ప్రధాన ఇతివృత్తం..కంపుకొట్టే ‘మాగీ’ కల్తీ సేమ్యాలను నిషేధించినట్టే నిషేధించారు. కొన్ని నెలలలోనే ‘మ్యాగీ’ మళ్లీ దుకాణాలలోకి వంట ఇళ్లలోకి చొరబడిపోయింది. ‘నియంత్రణ’కు ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
ఇలా ‘పొటాసియం బ్రోమేట్’తోను, ‘అయోడేట్’తోను కల్తీ అయిన బ్రెడ్డులను ప్రభుత్వం నిషేధించడం లేదు. వినియోగ అర్హమైన రసాయనాల ‘జాబితా’నుంచి ‘బ్రోమేట్’ను తొలగించవలసిందిగా మాత్రమే ‘్ఫడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-వారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసిందట! ఆరోగ్య మంత్రిత్వ శాఖవారు ‘జాబితా’ తొలగించిన తరువాత ఈ ‘బ్రోమేట్’ రసాయనాన్ని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’-్భరత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ మండలి వారు నిషేధించనున్నారట!‘అయోడేట్’ను కూడ నిషేధిస్తారా అన్నది మాత్రం వెల్లడి కావడం లేదు! పదకొండు వేల రకాల ‘రసాయన సాంకర్యాల’ లో ఈ రెండింటిని మాత్రం నిషేధించినందువల్ల ఏమి ప్రయోజనం. ‘బ్రెడ్డు’ను తయారుచేసే సంస్థల వారు మరో ఇరవై రెండింటిని వాడుకోగలరు. అన్ని కృత్రిమ రసాయనాలు పొట్టకు శరీరానికి హానికరాలే నన్నది సామాన్య విజ్ఞానం! అలాంటప్పుడు కొంత శాతం వరకు కృత్రిమ రసాయనాలను ‘ఆహారం’లో కలపడాన్ని ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి ఎందుకని అనుమతినిస్తున్నాయి?? ఈ ‘రసాయన సాంకర్యాల’ను తయారుచేసే విదేశీయ సంస్థలు ప్రభుత్వాల విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. మన ఆహారంలోని ‘షడ్రుచులు’, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, నూనెలు, నెయ్యి వెన్న-ఇవన్నీ అనాదిగా సహజ ప్రాకృతిక ఉత్పత్తులు. దాదాపు యాబయి ఏళ్ల క్రితం వరకు వీటిని మాత్రమే ఉపయోగించి ఇళ్లలోను పూటకూళ్లలోను దారిపక్కన దుకాణాలలోను ‘తిండి’ని ఉత్పత్తి చేశారు. మరి ఈ ‘కృత్రిమ రసాయనాలు’ ఎందుకు?
వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ఉన్ననినాళ్లు ‘నిలువ’ తిండిని-అప్పడాలు సేమ్యాలు రొట్టెలు చక్కిలాలు లడ్డూల -వంటివాటిని ఏ గ్రామానికా గ్రామంలోను, బస్తీలలోను తయారుచేసి వారం పదిరోజులలో అమ్మేశారు, వినియోగదారులు తినేశారు! అప్పడాలు, ఒడియాలు, ఒరుగులు-చిప్స్-, ఊరగాయలు, ఎండబెట్టిన కూరగాయలు వంటివి నెలల తరబడి నిలువ ఉండేవి. వీటిలో ఎలాంటి రసాయనాలు కలిపేవారు కాదు! కానీ ఆధునిక పరిజ్ఞానం పేరుతో కుటీర పరిశ్రమలను, వంట ఇళ్లను ‘కేంద్రీకృత’ వ్యవస్థ ధ్వంసం చేసింది. లక్షలాది ఉత్పత్తిదారుల పొట్ట కొట్టిన ఈ ముప్పయి ఎనిమిది ‘కంపెనీ’లు రసాయన విషం నిండిన బ్రెడ్డు పిజ్జాలను విక్రయిస్తున్నాయి.