వీరాజీయం

మాలిన్య ప్రక్షాళన దిశగా పరుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ ఢిల్లీలో మోదీగారు రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్టానికి రెండేళ్ల పాలన అందించిన కె.సి.ఆర్.గారున్నారు. ఇద్దరూ ‘‘మంచిరోజులు’’ తేవడానికే కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతానికి కె.సి.ఆర్.గారి- సంగతి నల్లేరు మీద బండీ లాగా వుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, కొత్త బాటలు- ఒక్క రాష్ట్రం దాకా పరిమితం. నిజం చెప్పాలీ అంటే కల్వకుంట్లగారి సంగతి ‘‘బస్తీమేఁ- సవాల్’’గా సాగిపోతున్నది. అప్పోజిషన్ ఏదీ? రెండో తారీఖున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ వుంటే జనాలంతా దీపాల తోరణాలు కడితే ప్రతిపక్షాల వాళ్లు కూడా టపాసులు పేల్చాలి. దీపాలు పెట్టాలి. ఉండబట్టలేక కె.సి. ఆర్. గవర్నమెంట్‌ని తిడుతూ తామే బాణాసంచాలనే మ్రోగినా- ‘‘ప్రతిపక్ష కోపం- పెదవికే చేటు’’అన్నట్లయిపోతోంది. కె.సి.ఆర్ టాప్!
అంచేత మెట్రోరైలు జూన్ రెండు నాటికి జనాల్ని ఎక్కించుకుని పరుగులు తియ్యకపోయినా- తె.రా.స. పరిపాలనా రధం అయ్‌మీన్ ‘‘కారు’’ తార్రోడ్డుమీద యస్.వి.యు.(సువ్)- కారు లాగా పరుగులు తీస్తూంది.
అంతకుముందే మే 26న ద్వితీయ వార్షికోత్సవం చేసుకున్న మోదీ సర్కార్ ‘‘-నాన్ మోదీ,’’ ‘నాన్ భాజపా’ రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలకీ జవాబుదారీ అవ్వాలి అన్న ధ్యేయంతో సాగిపోతోంది. 2014 మే 26న అతి విలక్షణంగా.
ప్రక్కలో బల్లెంలాగా వున్న పొరుగు దేశం ప్రధాని నవాజ్‌షరీఫ్‌ని పిలిచి కరచాలనం చేసిన మోదీగారు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.
ఆ ఏడాది ఎర్రకోట బురుజు మీద నుంచి- ‘‘నేను ప్రధానమంత్రిని కాను ప్రధమ సేవకుణ్ని’’- అంటూ జనాలను ఉర్రూతలూగించే ప్రసంగం చేశాడు. స్వచ్ఛ్భారత్ నినాదాన్ని ‘జైహింద్’అన్న ధ్వని లాగే ప్రతిఫలించేలాగా- ఆసేతుహిమవన్నగమూ వినిపించేలాగా గర్జించాడు ‘నమో’! నమః
ఒక దేశ ప్రధాని మన్‌కీబాత్ (మనసులో మాట) ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్రాలదాకా వినపడ్డది. దాన్ని ఖండించడం ఒక ‘‘పాలసీ’’లాగా కూడా చేయడానికి వీలులేకపోయింది.
‘స్వేచ్ఛ్భారత్ వికాసానికి ‘స్వచ్ఛ’్భరత్ కావాలీ’ అన్నది యు.పి.ఏ. గవర్నమెంటు చివర చివర- అటెంప్ట్ చేసినా అది వెక్కిరింతల పాలయింది. కానీ, మోదీ దేశంలో ఒక ‘మూడ్’ని- తీసుకొచ్చారు. మహాత్మాగాంధీగారి పేరే కాదు- ప్రేరణని కూడా తీసుకొచ్చిన మోదీగారు- తానే చీపురు పట్టుకుని రంగంలోకి దిగాడు. ఉత్త ఫొటో ఫీచర్ కాదది అని నెల తిరక్కుండానే జనాల నోట జై అనిపించుకున్నాడు.
‘పరిశుభ్రంగా లేని మందిరంలో దేవుఁడుకూడా వుండలేడు. లేచిపోతాడు-’ అన్న ఒక సామాజిక స్పహని అనుకోవచ్చు. నరేంద్రమోదీని- ‘నమో... నమో’ అంటూ సామాన్యుడు కీర్తించాడు. దేశ రాజకీయాల్నీ- భ్రష్టాచారాన్నీ- అప్పోజిషన్ పార్టీ అనీ ‘జల కడిగేస్తా’ననలేదు. గంగానదీ ప్రక్షాళనకు పూనుకున్నాడు. మరుగుదొడ్లు లేని దేశంలో ప్రగతి పరుగులు సాధ్యంకాదన్న నినాదాన్ని- వివాదాతీతంగా అమలుచేసిన మోదీనీ- ‘బేటీ బచావ్- ‘బేటీ పఢావ్’అన్న ప్రధానమంత్రిని ‘‘దొరబాబులాగా తయారవుతావ్ టిప్‌టాప్‌గా’’అంటూ చెలరేగిన ప్రతిపక్షాలు కూడా - ‘‘టిప్ టాప్‌గా వుండాలి- నెహ్రూగారు అలాగేవుండేవారు’’ అంటూ డ్రెస్ కాంక్షస్ అయిపోయారు- భళా!
‘జన్‌ధన్’ కార్యక్రమం ‘్ధనాధన్’గా రాణించింది. దేశ సరిహద్దులలో ‘చేనుమేసే కంచెలే వుండడం మన దురదృష్టం. ‘్భయ్.. భాయ్’ అంటూనే జూన్ నెల 14, 2014నాడే ‘ఐ.ఎన్.ఎస్.విక్రమాదిత్య’అనే బ్రహ్మాండమైన యుద్ధనౌకని జలప్రవేశం చేయించాడు. ‘స్కామ... స్కామ’ అంటూనో, రామ రామ అంటూనో కాలక్షేపం చేయకుండా- డస్ట్‌బిన్‌లు, టాయ్‌లెట్లు, ఆడపిల్లల చదువులు- గ్రామగ్రామాల్లో నిత్యనూతన కార్యక్రమాలుగా చేసిన నరేంద్రమోదీని- ప్రజల ‘‘మైండ్‌సెట్’’ని మార్చినందుకు అభినందించాలి!
దేశవ్యాప్తంగా రోడ్లను పెంచాలి- రోజుకో ముప్ఫయి కిలోమీటర్ల వంతున నిర్మించాలన్న ధ్యేయంతో ‘‘ట్రాన్స్‌పోర్ట్’’ని పెంచినందుకూ, ‘మేకిన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినందుకూ, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలు మొదలు- నిన్నటి ఇరాన్ పర్యటన దాకా పాతకాలపు భారత సాంప్రదాయాల పట్ల గౌరవం, ఆసక్తి కలిగేలా చేసిన- ‘‘్ఫస్ట్ ఇండియన్‌గా నెక్స్ట్ ప్రయిమ్ మినిస్టర్’’గా- మన పతాకాన్ని రెపరెపలాడించిన ఒక ‘వర్కోహాలికుణ్ణి’ అభినందించకుండా వుండలేం. అదో పాలసీగా పెట్టుకుంటే తప్ప.
రిపబ్లిక్‌నాడు అమెరికా అధ్యక్షుడ్ని ముఖ్యఅతిథిగా తీసుకొచ్చి- మన ఏనుగుల్నీ, ఒంటెల్నీ కాదు- మన సైనిక స్తోమతని కూడా ప్రదర్శించిన ‘‘నమో’’ గాంధీగార్నీ, పటేల్‌గార్నీ ‘హైజాక్ చేశాడు’అని గోలెడుతున్న ప్రతిపక్షాలు కూడా - ‘మనకి కూడా యిలాంటి’ ‘కరోడా’ వుండాల్రా’- అని తమలోతాము అనుకుంటున్నారని వినికిడి- భేష్!
ఐతే, మోదీజీ దగ్గర చాచానెహ్రూ కన్నా రెండింతల డాబూ, దర్పమూ వున్నాయి. వుండాల్సిందే. రోదసిలోకి ‘‘పంపించి, తిరిగి తీసుకువచ్చే’’ ‘రవాణా రాకెట్ శకటాన్ని’చేసిన- ‘‘సైన్స్- భారత్ ప్రధాని’’కి, నన్నడిగితే యింకా ఎక్కువ దర్పం వుండాలి.
కాకపోతే, అతని మంత్రివర్గంలో జనాల దగ్గరనుండి నేరుగా వచ్చినవాళ్లు తక్కువ. 35 మందికి 25 మంది పని సామర్థ్యం అంతంత మాత్రమే అంటూ పత్రికలూ, ఛానళ్లూ గగ్గోలుపెడుతున్నాయి. ఈనెలలో మంత్రివర్గంలో మార్పులు కూడా తప్పవు అంటున్నారు. అనుభవజ్ఞులు తక్కువ. తోలేవాడు ఎంత స్పీడు అయినా రధాన్ని లాగే గుర్రాలు డల్‌కొట్టేస్తే కష్టమే...
విదేశాలలో ‘కింగ్’, ఇండియాలో ‘మంత్రి’లాగా వున్న మోదీజీకి ‘‘మహారధులు’’ కొంతమంది కావాలి. మేకిన్ ఇండియాలో - ఆల్ ఇండియా దృక్పధంగల నాయకుల్ని కూడా ‘నరేంద్రుడు’ తయారుచేసుకోవాలి. దిష్టి తగిలేటంత మెజారిటీ యిచ్చారు జనాలు. ఢిల్లీలో వెంటనే తగిలిన దెబ్బనీ, బిహార్‌లో బజ్జీ అయిన ‘‘ముక్కునీ’’ ముందు మరిచిపోయి- పార్టీలో కూడా ‘స్వచ్ఛపార్టీ’ ఉద్యమాన్ని సాగించితే- కాషాయి జెండా ఎగిరే రాష్ట్రాలు పెరిగే అవకాశాలుంటాయి. మూడేళ్లు వున్నాయి యింకా- అన్న ‘్ధమా’ కార్యకర్తల్లో వుంటే రాష్ట్రాలు చేజారిపోతాయి! ‘నమో’కి, ‘నమో’! నమో!
హోల్డ్ ది ప్రయిస్ లైన్ ఫర్ సక్సెస్!