ఉత్తరాయణం

ఐదు గ్రామాల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఐదు గ్రామాల్లో అనేక మంది స్థలాలు కొన్నవారు ఉన్నారు. పూర్వం ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి దాటవేస్తున్నారు. ఈ గ్రామాలు కాక దగ్గర గ్రామాల్లో స్థలాలున్నవారు వారి స్థలం అమ్ముకోలేక కొత్తగా స్థలం కొనుక్కోలేక బాధపడుతున్నవారు ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ చూపి ఆ పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తే ఆ గ్రామాల వారికి, చుట్టుపక్కల వారికి సమస్యలు తొలుగుతాయి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
కఠినంగా శిక్షించాలి
కాదేదీ కల్తీకనర్హం. తినే ఆహార పదార్థాలు అవీ ఇవీ అని ఏదీ లేదు. సర్వం కల్తీమయమే కావడం మానవుని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఆఖరికి మన ప్రాణాలను నిలబెట్టే అన్నానికి మూలమైన బియ్యమూ ప్లాస్టిక్ మయం కావడం సహించరానిది. విష పూరితమైన ప్లాస్టిక్ బియ్యం మానవుని ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో వేరే చెప్పాలా? ఇలా కృత్రిమ విష పూరితమైన ప్లాస్టిక్ బియ్యాన్ని తోటి మానవుల ఆరోగ్యానికి హాని అని కూడా ఆలోచించకుండా అమ్మజూపే కిరాతకులను కఠినంగా శిక్షించాలి. నిత్యం దాడులు నిర్వహించి అమ్మే బియ్యాన్ని పరీక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఇది న్యాయమేనా?
ఇళ్ళనుండి చెత్త కలెక్షన్ చేసేవారు కింది పోర్షన్‌వారి నుండి నెలకు యాభై రూపాయలు. పై పోర్షన్‌లో వుండే వారినుండి అరవై రూపాయలు దబాయించి వసూలు చేస్తున్నారు. స్థానిక ఫెర్నాండెజ్ ఆస్పత్రి క్యాంటీన్లో ప్లేటు ఇడ్లీ స్ట్ఫాకైతే ఇరవై, పేషెంట్ తాలూకు వారైతే యాభై, భోజనం స్ట్ఫాకైతే ఎనభై, కాని వారికి నూట ముప్ఫయ్. ఇళ్ళ అద్దెలు చూస్తుంటే గగుర్పొడుస్తుంది. రెణ్ణెల్ల అడ్వాన్సు ఇవ్వాలిట. ఖాళీ చేసేముందు రెణ్ణెల్ల ముందు చెప్పాలట. అదే అపార్టుమెంటయితే స్థానికులు మూణ్ణెల్లు. స్థానికులు కాని వారు ఖచ్చితంగా ఆర్నెల్లు వుంటాం అని ఎగ్రిమెంటు రాసివ్వాలట. ఎలాంటి మరమ్మత్తులు చేయించకపోయినా పెంపు వందల్లో. వేలల్లో వసూలు చేస్తున్నారు. అడ్వాన్సు మీద వచ్చే వడ్డీ వారికే. మరి కార్పొరేషన్ కూడా రెండేళ్ళ పన్ను సేఫ్టీ ఎన్డ్ సెక్యూరిటీ కోసం తమ దగ్గర వుంచాలని చెప్తే అప్పుడు బాధేమిటో తెలుస్తుంది.
- బి.ఆర్.సి.మూర్తి, హైద్రాబాదు
అన్యాయానికి గురవుతున్న హిందువులు
హిందూ సాంప్రదాయాలకు, హైందవ పూజలకు చాలా విలువ వుంది. కాని నేడు అవన్నీ నేలరాలుతున్నాయి. ఇతర దేశాల్లో హిందూ మతం ఉండేది. కాని ఇతర మతాలు వారు బలవంతంగా మతం మార్చారు. దేవాలయాలు నేలమట్టం చేశారు. హిందువులను హింసించారు. ఇది అనాదిగా కొనసాగుతున్నది. రాజ్యాంగం పేరుతో హిందువులు మెజారిటీలని, వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వడం లేదు. పైగా హిందువుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పేదరికంవల్ల చాలా మంది హిందువులు తీర్థయాత్రలు చెయ్యడం లేదు. రాజకీయ నాయకులు వోట్ బ్యాంక్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.
- వివేక్, విశాఖపట్నం