సంపాదకీయం

విభజననాటి వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురి అయిన హిందువులకు మనదేశం పౌరసత్వం కల్పించడానికి వీలైన నిబంధనలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొనడం మానవీయతకు నిదర్శనం. ఆలస్యంగానైనా మన విధానంలో విజ్ఞత వికసిస్తున్నందుకు సర్వమత సమభావ వ్యవస్థను సమర్థించే వారందరూ హర్షించగలరు. బంగ్లాదేశ్‌లోను పాకిస్తాన్‌లోను జీవచ్ఛవ స్థాయికి దిగజారి ఉన్న అవశేష హిందువులను నిశే్శషం చేయడానికి జిహాదీ ఉగ్రవాదులు నిరంతరం యత్నిస్తుండడం దశాబ్దుల చరిత్ర. అందువల్ల ఈ రెండు దేశాలలోను హిందువులు బలవంతపు మతం మార్పిడులకు గురి అయ్యారు. అపరహరణలకు హత్యలకు, లైంగిక అత్యాచారాలకు, తరిమివేతలకు గురి అవుతూనే ఉన్నారు. లక్షల మంది ప్రాణాలను తప్ప సర్వస్వాన్ని వదలుకొని మనదేశానికి పారిపోయి వచ్చేశారు. ఇందుకు ఏకైక కారణం 1947 ఆగస్టు 15వ తేదీన జరిగిన దేశవిభజన. పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలోను అవశేష భారత్‌లోను అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడి ఉండడం చరిత్ర. పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో 1947 ఆగస్టు 15నకు పూర్వమే అనేక ఏళ్లుగా జిహాదీలు సర్వమత సమభావ వ్యవస్థకు విఘాతం కలిగించారు. ఇస్లాం మతం మాత్రమే ప్రపంచంలో మిగిలి ఉండాలని మిగిలిన అన్ని మతాలు నామరూపాలు లేకుండా నశించిపోవాలని జిహాదీలు శతాబ్దులుగా భావించడం ఈ విఘాతానికి కారణం. అందువల్ల 1947 ఆగస్టు 15 తరువాత అనాది సర్వమత సమభావ వ్యవస్థ అవశేష భారత్‌లో మాత్రమే మిగిలింది. పాకిస్తాన్‌లో ధ్వంసమైంది. ఈ అంత రం కారంణగానే 1947, ఆగస్టు 15 తరువాత అవశేష భారత్‌లో అల్పసంఖ్యాకులైన ఇస్లాం క్రైస్తవ పారశీక యూదు తదితర మతాలవారు అధిక సంఖ్యాకులైన హిందువులతో సమానంగా హాయిగా జీవిస్తున్నారు. అధిక సంఖ్యాకులకంటె రాజ్యాంగ పరమైన విశేష సదుపాయాలను సైతం పొందగలిగారు. దశాబ్దుల పాటు జనాభాలో ఈ అల్పసంఖ్యాకుల శాతం నిరంతరం పెరుగుతుండడం ఈ సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లుతోందనడానికి నిదర్శనం. సర్వమత సమభావ వ్యవస్థ ధ్వంసమైపోయిన పాకిస్తాన్‌లో 1947, ఆగస్టు 15 నుండి అల్పసంఖ్యాకులైన హిందువుల సంఖ్య తగ్గిపోయింది. జనాభాలో వారిశాతం క్షీణించిపోయింది. 1947లో పశ్చిమ పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య దాదాపు 24 శాతం కాగా 1948 ప్రారంభానికి వారి సంఖ్య రెండు శాతం కంటె తక్కువకు పడిపోయింది. మిగిలిన వారిని జిహాదీలు చంపివేశారు. మతం మార్చారు. భారత్‌కు తరిమివేశారు. 1971 నుంచి బంగ్లాదేశ్‌గా ఏర్పడి ఉన్న తూర్పు పాకిస్తాన్‌లో 1947 నాటికి హిందువుల సంఖ్య మొత్తం జనాభాలో ముప్పయి ఒక్క శాతం కాగా ప్రస్తుతం వీరి సంఖ్య ఎనిమిశాతం కంటె తక్కువ స్థాయికి పడిపోయింది..
ఇలా బంగ్లాదేశ్‌లోను, పాకిస్తాన్‌లోను నిలువనీడ లేని హిందువులు ఇప్పటికీ భారత్‌లోకి పారిపోయి వస్తూనే ఉన్నారు. ఇలా వచ్చిన వారిని 1955వ సంవత్సరానికి పూర్వం సహజంగానే భారతీయ పౌరసత్వం లభించింది. ఎందుకంటె ఉభయ పాకిస్తాన్‌ల నుండి హిందువులు అవశేష భారత్‌కు వచ్చేస్తుండడం దేశ విభజనలో ముడివడి ఉన్న నిరంతర సమస్య. 1955లో మనదేశంలో కొత్త పౌరసత్వం చట్టం ఏర్పడిన తరువాత పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ నుండి తరిమివేతకు గురయిన హిందువులు పారిపోయి వచ్చిన హిందువులు పౌరసత్వం లేని ప్రజలుగా దశాబ్దుల పాటు మనదేశంలోనే గడుపవలసి వచ్చింది. విదేశాలకు చెందిన ప్రజలవలె ఈ పూర్వపు అఖండ భారతీయులు కూడ అవశేష భారత్ పౌరసత్వం కొరకు దరఖాస్తులను పెట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. పౌరసత్వం లభించే వరకు వారు శరణార్థులు..బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత కూడ ఈ దుస్థితి కొనసాగుతూనే ఉంది. పౌరసత్వం లేదు కనుక ఈ అభాగ్య హిందువులు అక్రమంగా వలస వచ్చిన వారన్న నిబంధనకు గురి అయ్యారు. అక్రమ వలస దారులను తిరిగి వారి స్వదేశాలకు పంపించాలని 1948 నాటి విదేశీయుల చట్టం నిర్దేశిస్తోంది. అందువల్ల ఇలా పారిపోయి వచ్చిన హిందువులను తిరిగి పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌కు తిప్పి పంపిన ఘటనలు కూడ ఉన్నాయి. అలా తిరిగి వెళ్లిన వారిని జిహాదీలు చంపడం, మతం మార్చడం ఆశ్చర్యకరం కాదు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లానుంచి పారిపోయి వచ్చి ఈశాన్య ప్రాంతంలో తలదాచుకున్న చక్మా వనవాసీ హిందువులను మన ప్రభుత్వాలు తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించడం చరిత్ర. ఈ చక్మాలు నిరంతరం జిహాదీల బీభత్సకాండకు బలైపోతున్నారు. ఫలితంగా ఒకప్పుడు చిట్టగాంగ్ జిల్లాలో తొంబయి శాతం ఉండిన ఈ బౌద్ధ హిందూ చక్మాల సంఖ్య ప్రస్తుతం అరవై శాతానికంటె తక్కువకు పడిపోయింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పారిపోయి వస్తున్న హిందువులను విదేశీయులుగా కాని, అక్రమ ప్రవేశకులుగా కాని భావించరాదన్నది ఇంకిత జ్ఞానం. ఎందుకంటె మూడు దేశాలు ఒకదేశంగా ఉండినప్పటి సర్వమత సమానత్వ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఇది. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న హిందువులు అందువల్ల దుర్బుద్ధితో అవశేష భారత్‌లోకి చొరబతుతున్నవారు కాదు. నిలువ నీడలేని నిస్సహాయులు. అందువల్ల ఇలా పారిపోయి వచ్చిన హిం దువులు సహజంగానే భారతీయ పౌరులు అవుతారని, విదేశీయులుగా వారిని పరిగణించరాదని 1955 నాటి పౌరసత్వపు చట్టంలోనే పొందుపరచి ఉండాలి. అలా పొందపరచకపోవడం చారిత్రక, భౌగోళిక మానవీయ వాస్తవాలకు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా పరిణమించిన వైపరీత్యం. ఈ వైపరీత్యాన్ని తొలగించడానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూనుకొనడం పౌరసత్వం కోసం పడిగాపులు పడి ఉన్న ‘‘బంగ్లా, పాకిస్తానీ’’ హిందువులకు ఊరట కలిగిస్తున్న పరిణామం. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలా అల్పసంఖ్యాక హిందువులను ఆదుకొనడానకి వీలైన సవరణను చేయనున్నట్టు భారతీయ జనతాపార్టీ వాగ్దానం చేసింది. భాజపా నిర్వాహక ప్రభుత్వం ఈ వాగ్దానం మేరకు ఇప్పుడు 1955 నాటి పౌరసత్వపు చట్టాన్ని సవరిస్తుందట.
పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను మతోన్మాద బీభత్సకాండకు బలైపోయి మనదేశానికి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తామని గత ఏడాది ఆగస్టులోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌లోని హిందువులపై జరుగుతున్న భయంకరమైన దాడులను గురించి 2012, మే 10న భాజపా వరిష్ఠ నాయకుడు మురళీ మనోహర్ జోషి లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ నాలుగేళ్లలో బంగ్లాదేశ్‌లోను పాకిస్తాన్‌లోను జిహాదీలు అనేకమంది హిందువులను హత్య చేశారు. హిందూ యువతులపై అత్యాచారం జరిపారు. భాజపా ప్రభుత్వం నిర్ణయం వల్ల మన దేశంలో తలదాచుకున్న రెండు లక్షల మందికి పౌరసత్వం లభించవచ్చు. కానీ పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్‌లోను మిగిలి ఉన్న హిందువుల మాట ఏమిటి? ఈ అభాగ్యులకు అధిక సంఖ్యాకులతో పాటు సమాన ప్రతిపత్తి లభించేది ఎప్పుడు? మన ప్రభుత్వం ఈ విషయమై ఏమి చేయగలదు?