ఉత్తరాయణం

కాంగ్రెస్ నేతకు మినహాయంపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అభిమాని రామకోటి లాగ నరేంద్ర మోదీ పేరు షేర్వాణీ నిండా వచ్చేట్టు నేయించి దాన్ని మోదీకి బహుమతిగా ఇస్తే మోదీ దాన్ని ధరించి తర్వాత వేలంలో దాన్ని అమ్మేసి ఆ సొమ్ము మహిళా సంక్షేమానికి విరాళంగా ఇచ్చేశారు. ఆ షేర్వాణీ ఐదారు లక్షలు ఖర్చుతో తయారైంది. దాంతో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ బాబా మోదీ ప్రభుత్వం సూటూ బూటుప్రభుత్వం అని ఎద్దేవా చేయడం మొదలుపెట్టాడు. ఈమధ్యనే నాసిక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బంగారు నాణాలతో చొక్కా తయారుచేయించుకున్నాడు. దాని ఖరీదు కేవలంఒక కోటి రూపాయలు. అత్యంత ఖరీదైన చొక్కాగా అది గిన్నిస్ రికార్డు సాధించింది. మన రాహుల్ బాబా కిక్కురుమంటే ఒట్టు! కోటి రూపాయల షర్ట్ ధరించింది కాంగ్రెస్ నేత మరి!!
- ప్రభాస్, గాంధీనగర్
రిజర్వేషన్ వికృత రూపం
అంబేద్కర్ దీనజనోర్ధరణకోసం ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానం రానురాను వికృతరూపం దాలుస్తోంది. పేద, వెనుకబడిన తరగతుల వారిలో ఈ సౌకర్యం ముందు లభించిన వారికే తిరిగి లభిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించి 68 సంవత్సరాలు పూర్తయినా వెనుకబడిన తరగతులవారు ఇంకా వెనుకబడే వున్నారు. దళితులలో కోటీశ్వరులు ఇంకా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక వివిధ రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్లను తమ రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాలలో రాజకీయ ప్రాబల్యం కలిగిన కొన్ని వర్గాలు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలోవున్నా రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి తమ కోర్కెలను సాధించుకుంటున్నాయి. ఈ రకమైన రాజకీయం కాంగ్రెస్ 5 దశాబ్దాలపాటు అప్రతిహతంగా కొనసాగించగా, బిజెపి కూడా అదే బాటన పట్టింది. గుజరాత్‌లో పాటీదార్లు, రాజస్థాన్‌లో గుజ్జర్లు, హర్యానాలో జాట్లు ఇలా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో వున్న వర్గాలు తమను ఆర్థికంగా వెనుకబడినవారిగా నోటిఫై చేసి వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ జాట్ల రాజకీయాలలో తాను ఇతర పార్టీలవలె ఒకే తానులో ముక్కలమని బిజెపి రుజువుచేసుకుంది. రాజకీయ పార్టీలు నెమ్మదిగా ఒబిసిల నిర్వచనం మార్చేస్తుండడం బాధాకరం. నిజంగా ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలు పరచాల్సి వస్తుందేమో? అప్పుడిక రిజర్వేషన్లకు అర్ధమేంటి?
- ఎం.కనకదుర్గ, తెనాలి
వెటర్నరీ డిప్లమో వారు చేసిన పాపమేంటి?
తెలుగు రాష్ట్రాల్లోని పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లమో పూర్తిచేసిన వారికి బి.వి.ఎస్.సి. చదివే అవకాశం లేకుండాపోయింది. దీంతో వారంతా డ్రాపవుట్లుగానే మిగులుతున్నారు. లేటరల్ ఎంట్రీ కింద వారికి ప్రవేశపరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి బి.వి.ఎస్.సిలో ప్రవేశం కల్పించాలి. ఇలాచేస్తే తప్ప వారికి న్యాయం జరగదు. కాగా వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లమో పూర్తిచేసిన వారికి అగ్రిసెట్ పరీక్ష నిర్వహించి కృతార్థులైనవారికి బిఎస్సీ (ఎజి)లో చేర్చుకుంటున్నారు. అయితే వెటర్నరీ డిప్లమో అభ్యర్థులకు ఇలాంటి అవకాశం కల్పించకపోవడం అన్యాయం. ఈ విషయమై రాష్ట్ర పశుసంవర్ధకశాఖ చర్యలు చేపట్టి న్యాయం చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
అయోమయం-గందరగోళం
చేతి రికార్డుల స్థానంలో ఆన్‌లైన్ సిస్టం అమలుచేయబోతున్నాం అని పోస్ట్ఫాసులు బ్యానర్లు కట్టాయి. థింగ్స్ టేక్ ఎ డిఫరెంట్ షేప్ వెన్ పుట్ టు ప్రాక్టీస్ అని ఆంగ్లంలో సామెత. ఆర్డి, సేవింగ్స్ పాసు పుస్తకాలు చూపించేది ఒక ఫిగర్. కంప్యూటర్ చూపించేది మరోటి. సాలుసరి వడ్డీ ఒక పుస్తకంలో వేస్తారు. మరో పుస్తకంలో వెయ్యరు. నెట్ పనె్జయ్యటం లేదంటారు. ఒకటికి పదిసార్లు తిరగాల్సొస్తున్నది. పై అధికార్లకు రాసినా ప్రయోజనం శూన్యం. ప్రజాఫిర్యాదులు బుట్టదాఖలౌతున్నాయో ఏమో? మదుపర్లు కూడ యింకా రోడ్లెక్కి ధర్నాచేయాల్సిన సమయం ఆసన్నమైంది. దటీజ్ ది ఓన్లీ లాంగ్వైజ్ ది గవర్నమెంట్ అండర్‌స్టాండ్స్ అన్నాడొకాయన. నిజమే. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ఏం పోస్టల్ యూనియన్ తమ డిమాండ్ల పరిష్కారానికి స్ట్రెయిక్ నోటీసుఇవ్వలేదా?
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
పాల కేంద్రాలు అవసరం
రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో పాల కేంద్రాలను ఏర్పాటుచేయవలసిన అవసరం ఉంది. మహిళా పొదుపు సంఘాలకు ప్రభుత్వం పాడి గేదెల కొనుగోలుకు సబ్సిడీ ఋణాలు ఇస్తుంది. ప్రతి మండల కేంద్రంలో పశువుల దవాఖానాలు ఉన్నాయి. పాల వినియోగం ప్రతిరోజురోజుకు పెరుగుతోంది. శిశువులనుండి వృద్ధుల వరకు నిద్రలేచిన నుండి పడుకునే వరకు ప్రతి ఆహార పదార్థాల్లో పాల వినియోగం పెరిగింది.