ఉత్తరాయణం

జనరిక్ మందులు వాడవచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాండెడ్ అల్లోపతి మందుల ఖరీదు చాలా అధికమవడంతో వీటికి ప్రత్యామ్నాయంగా జనరిక్ మందులు అతి చవకగా మార్కెట్‌లోకొచ్చాయి. డాక్టర్లను జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయమని ప్రభుత్వం సూచనలు చేసింది. అయినా డాక్టర్లు జనరిక్ మందులను రాయటం లేదు. పైపెచ్చు రుూ మందులు వాడితే కిడ్నీలు, లివర్ కాలక్రమేణా పాడైపోతాయని భయపెడుతున్నారు. జనరిక్ మందుల మీద సమగ్రమైన వివరాలను ప్రచురించి ప్రజల అనుమానాలను, భయాలను తొలగించమని కోరుతున్నాను. జనరిక్ మందుల ధరలు తక్కువగా ఉండడంతో వీటిలోమందు ప్రభావాన్ని బాగా తగ్గించి వేస్తున్నారనే అపోహలు కూడా కలుగ చేస్తున్నారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పెరుగుతున్న ప్రమాదాలు
జాతీయ రహదారులు, మామూలు రహదారులపై రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, మరెంతో మంది క్షతగాత్రులు కావడం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బయటకు వెళ్ళారంటే ఇంటికి వచ్చే దాకా ప్రాణాలకు గ్యారంటీ లేదు. అతి వేగంగా వాహనాలను నడపడం, నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలను నడపడం ప్రమాద హేతువులవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతలివారి నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలకు గురికావలసి వస్తుంది. రహదారులపై నిరంతర పర్యవేక్షణ అవసరం. అతివేగంగా నడిపే వారిపై, మద్యం సేవిస్తూ, సెల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
రక్తదానాన్ని ప్రోత్సహించాలి
శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా వున్నందున, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా నెగెటివ్ గ్రూప్ రక్తం లభించడం దాదాపు అసాధ్యంగా మారింది. యాక్సిడెంట్లు, ఎమర్జన్సీ ఆపరేషన్ల సందర్భంలో మొత్తం శ్రీకాకుళం జిల్లాకు రెండుమూడు బ్లడ్ బ్యాంకుల నుండి రక్తం లభ్యతకోసం ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడ లభ్యత అరకొరగా వుండడం వలన విశాఖనుండి రక్తం తెప్పించడమో లేక పేషెంట్‌ను అక్కడికి పంపించడమో చేస్తున్నారు. ఈ ప్రక్రియలో విలువైన సమయం వృధాకావడంవలన పేషెంట్ల ఆరోగ్యాలకు ముప్పువాటిల్లుతోంది. కనుక ప్రభు త్వం స్వచ్ఛంద సంస్థల సహాయంతో జిల్లాలో మరిన్ని బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటుచేయాలి. రక్తదాన శిబిరాలను ముమ్మరంగా నిర్వహించాలి. రక్తదానం వలన ఉపయోగాలను గూర్చి యువతకు విస్తృత అవగాహన కల్పించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
చెట్లను కాపాడండి
తెలుగు రాష్ట్రాలలో అనేక పట్టణాలలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో రోడ్ల ప్రక్కన కనిపించే కొన్ని వేల చెట్లు సరైన నీరు పోషణ అందక కళావిహీనంగా, నీరు అందక కాండాలు పెళుసుబారి కొద్దిపాటి గాలులకే కూలిపోయి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం చెట్లవేళ్లకు నీరు అందకుండా నీటి మొదళ్లను పూర్తిగా కాంక్రీటు- సిమెంట్లతో దట్టించి వేస్తున్నారు. ఇందువల్ల వాటి ఎదుగుదలకు కావలసిన నీరు వేళ్లకు అందటం లేదు. ప్రతి చెట్టు చుట్టూ కనీసం ఒక అడుగు ఖాళీ వుంచటం, దానివైపు పరిసరాలనుంచి తగినంత వాలు ఏర్పాటుచేసి, ఆ పాదువైపు వాన నీరు పారే విధంగా ఏర్పాటుచేయడంవల్ల ఈ చెట్లకు తగినంత నీరు అందటమేకాక పాదులన్నీ ఒక మోస్తరు ఇంకుడు గుంటగా భూగర్భ జలాలను వృద్ధిచేయగలదు. రోడ్లు, ఫుత్‌పాత్‌లు నిర్మించే సమయంలో మున్సిపల్ హార్టికల్చర్ అధికారి/ నిపుణుడు అక్కడే వుండి చెట్లకు పాదులు వదలడం రోడ్డుకు వాలు ఏర్పాటుచేయడం వంటి విషయాలను స్వయంగా పర్యవేక్షించాలి. పారిశుద్ధ్య పనివారికి పాదుల సంరక్షణ బాధ్యతను కూడా అప్పగించాలి.
- అహోబలరావు, హైదరాబాద్
అవినీతిని నిర్మూలించాలంటే?
మన దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయాల్లో ఉన్నవారు, వ్యాపార రంగంలో ఉన్నవారు, సినీ రంగం, ప్రభుత్వ కార్యాలయాలు చివరకు న్యాయ వ్యవస్థలోను విలయతాండవం చేస్తున్నది ఈ అవినీతి. పవరులో ఉన్నంతకాలం దొరికింది దోచుకుని విదేశాల్లో కూడ దాచుకుంటున్నారు. స్థిరాస్తులు విపరీతంగా పెంచుకుంటున్నారు. పేరు బయటకొచ్చినా పట్టుబడిన సిగ్గుఎగ్గు లేకుండా బీరాలు పోతున్నారు. ఈ ప్రబుద్ధుల ఫొటోలను కూడ ప్రజలముందు పెట్టాలి. ఈ అవినీతి, మోసపూరిత పనులు భారతీయులంతా కలసి ఎదుర్కోవాలి.
- మిస్సుల గాయత్రీదేవి, శివరామకృష్ణ, అత్తాపూరు