ఉత్తరాయణం

కాంగ్రెస్‌లేని భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్‌కు పగ్గాలు అప్పచెబితే ఎలా ఉంటుందో ఎంవిఆర్ శాస్ర్తీగారు ఈ నెల 4న రాసిన ఉన్నమాటలో చక్కగా విశే్లషించారు. కాంగ్రెస్ లేని భారతం రాహుల్‌కి పట్టం కట్టగానే సంభవం అన్నది పచ్చి నిజమవుతుంది. మరి భాజపా వారికి కాంగ్రెస్ వైపునుండి ఏవిధమైన ప్రతిఘటన ఉండదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
మైనారిటీలుగా మారిపోతున్న హిందువులు
దశాబ్దాల క్రితం ‘మదర్లాండ్’ అనే పేరుగల జర్నల్‌లో బాబూరావ్ పటేల్ ధైర్యంగా ఈవిధంగా రాశారు. ‘కాంగ్రెస్ క్రమంగా ముస్లింల ఓటుబ్యాంకుకు దాసోహమంటోంది. ఒకనాటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్ నుండి అసోం, బెంగాల్ రాష్ట్రాల్లోకి వెల్లువెత్తుతున్నారు. కేవలం మైనారిటీ స్థాయికి దిగజారిన తర్వాతనే హిందువులు తమ హక్కులకోసం పోరాడతారు’ అనేది ఆయన రాసినదాంట్లోని సారంశం. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవాలు కాబోతున్నాయి. అసోంలో ప్రస్తుత ముస్లింల జనాభా 35%. అసోంను, హిందువులను కాపాడాలన్న ఉద్దేశంతో బాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి ఓటు చేసిన వారు మైనారిటీ స్థాయికి దిగజారిపోతున్నారు. కేరళలో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎకు 10.5 శాతం ఓట్లు లభించాయి. 1951లో కేరళలో హిందువులు 67% వరకు ఉన్నారు. ప్రస్తుతం 52% ఉన్న వారు త్వరలోనే 50%కు తగ్గిపోతారు. అప్పుడిక ప్రస్తుతం మైనారిటీలుగా పరిగణిస్తున్న వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దీన్ని గుర్తించిన హిందువుల్లో 20 శాతం మంది భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చేశారు. ఇక ముందు కేరళలో హిందువుల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. రెండో ప్రపంచయుద్ధం కాలంలో గొప్ప రాజనీతిజ్ఞుడుగా పేరుపొందిన విన్‌స్టన్ చర్చిల్ ఈవిధంగా రాశారు..‘‘రక్తపాతం లేకుండా తేలిగ్గా విజయం సాధించే పరిస్థితి ఉన్నప్పుడు, విజయం తథ్యమని తేలినప్పుడు, మీ హక్కులకోసం పోరాటం సలపకపోతే, ఒకనాటికి మీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే స్థితిలో, గెలుపుదారులన్నీ మూసుకుపోయిన దశకు చేరుకోవచ్చు. ఇంకా దారుణమైన స్థితి ఏమంటే, గెలిచే అవకాశం ఎంతమాత్రం లేని సమయంలో మీరు యుద్ధం చేయాల్సి రావచ్చు. అప్పుడు ఓడి బానిసలుగా బతికేకంటే మరణించడమే మేలు.’’ ప్రస్తుతం భారత్‌లోని హిందువులు చర్చిల్ చెప్పిన మాటలను స్ఫురణకు తెచ్చుకోవాలి. తమ మాతృభూమిలో తామే మైనారిటీలుగా మారిపోయి దుస్థితిని ఎదుర్కొనేందుకు ఏకం కావాలి.
-డా.టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
అనవసర ఆర్భాటాలు
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ, కరువుకాటకాలతో నవ్యాంధ్ర ఒకవైపు సతమతమవుతుంటే, మరోవైపు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా వెచ్చించి సంబరాలు చేయడం ఎంతవరకు సబబు? మంత్రుల విదేశీయానాలు, ఆడంబర విన్యాసాల పోకడలతో సరదా కాలక్షేప వ్యవహారం మాదిరిగా సాగిన ఈ వ్యవహారం ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగకరం కాదని అర్థమవుతోంది. ఒక్కసారి ఆత్మవిమర్శ అవసరం.
-కోవూరు వెంకటేశ్వరరావు, కందుకూరు
స్ఫూర్తిదాయకం
సినిమా ప్రపంచంలో తెలుగువారి ఘనత తక్కువేమీ కాదు. రాశిలోను వాసిలోను గొప్పవారున్నారు. తమిళులు సుబ్రహ్మణ్య భారతిపై సినిమా తీసారో లేదో కాని ఇక్కడ ఘట్టమనేని కృష్ణగారు మహాకవి శ్రీశ్రీ టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. మహానటి సావిత్రిపై కూడా సినిమా నిర్మాణం ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇవన్నీ తెలుగు జాతీయతకు నిదర్శనాలు. శ్రీశ్రీ తెలుగు కవి మాత్రమే కాదు..అంతర్జాతీయ కవి...ఆయనకు ఆయనే సాటి.. అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన కృష్ణగారికే ఈ ఘనత దక్కింది. తెలుగువారికి ఇది స్ఫూర్తిదాయకం.
- పెన్మత్స సరోజిని, కొమ్మర, ప.గో. జిల్లా

అతీ గతీ లేని ఫైలు
ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో ఆర్జిత శెలవులను నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ఫైలు, కాంగ్రెస్ ప్రభుత్వలోని ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడం వల్లనో, రాష్ట్ర విభజన కారణం వల్లనో మరుగునపడిందో, అటకెక్కిందో తెలియడంలేదు. రెండేళ్లుగా ఈ ఫైలు ఆమోదానికి ఎదురుచూస్తున్నాం. మరి ఈ ఫైలు పరిష్కారానికి మేం వెంటపడలేదు. అధికారులూ స్పందించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి వెళ్లినట్టు లేదు. వెళ్లివుంటే మానవతా దృక్పథంతో స్పందించి ఉండేవారేమో.
-ఆశం సుధాకరరావు, గూడలి, నెల్లూరు జిల్లా
అహింసా సిద్ధాంతం పుట్టిన భూమి
మనుధర్మ సూత్రాలు నిత్యజీవితంలో ఇమిడి ఉన్నాయి. ఎందరో మహనీయులు మన హిందూ ధర్మంలో జన్మించారు. అహింసా సిద్ధాంతం కూడా ఇక్కడనే పుట్టింది. హిందూ ధర్మం నుంచే బౌద్ధ, జైన మతాలు ఉద్భవించాయి. పెద్దలను, స్ర్తిలను గౌరవించాలన్న సూత్రాలు శాశ్వతమైనవి. రాజ్యాంగ కర్తలు మనుధర్మ శాస్త్రంలోని మంచి సూత్రాలనుప్రవేశపెట్టలేదు. అందువల్లనే హింసాకాండ పెచ్చరిల్లిపోతున్నది.
-ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం