సబ్ ఫీచర్

విద్యార్థిపై మానసిక శాస్త్ర ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటుచేసుకున్న తరువాత చాలాసార్లు సైకాలజిస్టు బి.వి.పట్ట్భారామ్‌తో మీటింగులలో కలిశాం. మీటింగ్‌లలో ఆయనతో కలిసి ఉండటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. తరగతి గదిలో అడుగు పెట్టకముందే మానసిక శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.
సమాజాన్ని మార్చదలుచుకున్నవారు మొదట తాను మారాలి. ఉపాధ్యాయులు పిల్లల్ని ఏ గమ్యస్థానానికి తీసుకుపోదలుచుకున్నారో, ఏ విధంగా లక్ష్యం వైపుకు మళ్లించదలుచుకున్నారో ఆ అవగాహనను వారిలో కల్పించాలి. ఇలాంటి పరిజ్ఞానం ఉపాధ్యాయుడు పొంది ఉండాలి. ఉపాధ్యాయుడు తన నడవడికను పరీక్షించుకోవటానికి 4 ప్రధాన సూత్రాలు చెప్పటం జరిగింది.
1. సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి?
2. పిల్లలను ఎలా ప్రభావితం చేయాలి?
3. సవాళ్లను స్థిరత్వంతో ఎలా ఎదుర్కోవాలి?
4. సమస్యను పరిష్కరించేందుకు అవలంభించే పద్ధతులు ఎలా ఉండాలి?
ఇందులో ‘డి’డైమెన్షన్, రెండవది ‘ఐ’ డైమెన్షన్, మూడవది ‘ఎస్’డైమెన్షన్స్, నాల్గవది ‘సి’డైమెన్షన్‌లు అంటారని పట్ట్భారామ్ విశే్లషించి పలు సభల్లో చెప్పేవారు. ఈ డైమెన్షన్‌తో ఉపాధ్యాయుణ్ణి కొలమానం చేసి కొలవవచ్చును. అదే విధంగా పిల్లల ఆలోచనలను కూడా అంచనావేయవచ్చును. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయుడు తన మైండ్‌లో ఏర్పరచుకుంటే తను తరగతి గదిని సరిగా నడిపించగలుగుతాడు. తరగతి గదిని ఆకళింపు చేసుకున్నవాడే పాఠాన్ని అర్థవంతంగా చెప్పగలుగుతాడు. ఒక్కొక్క అంశానికి ఇతర అంశాలతో ఎలా సంబంధం ఉంటుందో ‘డి’కి ‘ఐ’తో ఎలాంటి సంబంధమో ‘ఐ’అన్నది ‘సి’పై ఎట్లా ఆధారపడి ఉంటుందో సమగ్రంగా తెలుసుకోవాలి. పిల్లలందరిలో అన్ని విషయాలు ఒకే నిష్పత్తిలో ఉండవు. నిర్ణయాలు అవగాహన ఒకే రకంగా ఉండదు.ఉపాధ్యాయునికి మానసిక శాస్త్రం (సైకాలజీ) ద్వారా తరగతి గది దశ తెలుస్తుంది. తరగతి గదికి మానసికశాస్త్రం,ఉపాధ్యాయులు జోడెద్దుల్లాంటివారు. టీచింగ్ లేకుండా సైకాలజీ, సైకాలజీ లేకుండా టీచింగ్ ఉండదు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించాలన్న దానికి ఉపాధ్యాయుడు ఒక సాధనం.
పిల్లల మానసిక ప్రవృత్తులపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకున్న ఉపాధ్యాయుడు వారికి అనుగుణమైన బోధన చేయగలుగుతాడు. దీనివల్ల ఆయా విద్యార్థుల్లో విషయావగాహన పెరుగుతుంది. తాను తెలుసుకున్న విషయాలను చక్కగా మరింత అధ్యయనం చేయడానికి అవసరమైన ఆసక్తి కలుగుతుంది. అదే ఉపాధ్యాయుడికి విద్యార్థి మనోవృత్తులపై అవగాహన లేకపోతే ఇది సాధ్యం కాదు. అంటే విద్యార్థికి పాఠ్యాంశంపై అవగాహన కలగాలంటే ఉపాధ్యాయుడికి సైకాలజీపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే తాను బోధించే పాఠ్యాంశానికి, విధ్యార్థులకు న్యాయం చేయగలడు. ఇక్కడ సైకాలజీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం విద్యార్థికి పాఠ్యాంశంపై ఆసక్తి కలగడం. అంటే అతని ఆసక్తి అంతటితో ఆగదు. మరింత విషయావగాహనకోసం అతడిని ప్రేరేపిస్తుంది. ఆవిధం గా ప్రేరేపించబడిన విద్యార్థి, భవిష్యత్తులో దేశానికి ఎంతగానో ఉపయోగపడే బాధ్యత కలిగిన పౌరుడిగా రూపొందుతాడు. అప్పుడు మాత్రమే ఉపాధ్యాయు లక్ష్యం నెరవేరినట్టు. విద్యార్థిని సక్రమ మార్గంలో మలచినట్టు కాగలదు.

- చుక్కా రామయ్య