ఉత్తరాయణం

నిస్సిగ్గు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యన ఎమ్మెల్యేలు ఒక పార్టీలోనుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు వేస్తున్నారు. అంటే వీరు ఒక విధమైన కప్పలన్నమాట. అసలు ఒక పార్టీలో ఇమడలేని వాడు మరో పార్టీలో ఇమడగలడా? అనేది ఆశ్చర్యమే. ఇది రాజకీయ వ్యభిచారం తప్పించి మరేం కాదు. ఈ కప్పగెంతుల్ని ప్రోత్సహించేది ముఖ్యమంత్రులే కావడం వల్ల ముక్కుమీద వేలు వేసుకోవాల్సి వస్తున్నది. ఇలా పార్టీలు మారేవాళ్లకు విలువేముంటుంది? విలువలతో పని లేదనుకున్న వాడే అసలు సిసలైన రాజకీయవేత్త. వీళ్లు మళ్లీ నెగ్గుతారనేది అనుమానమే. కాని వారు నిస్సిగ్గుగా పోటీలోకి దిగుతారు. ఓడిపోడం ఖాయమని తెలిసి కూడా. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో రాజకీయ విలువలు చాలా గొప్పగా ఉండేవి. రానురాను పలుచబడి పోతున్నాయ. నేటి రాజకీయాల్లో డబ్బు ప్రధానపాత్ర వహిస్తున్నది. డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోవడంతో ప్రారం భమై ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొనడం దాకా వచ్చింది. ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వచ్చామనేవారు రాజకీయ అవినీతిలో కూరుకుపోవడం పరిపాటైంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రెంటికి చెడిన రేవడులయ్యా రు. రాజకీయాలను జూదంలా మార్చేశారు. ఈ విధంగా పార్టీలు మారడం, మూడు పువ్వులు ఆరు కాయలుగా కాక, మూడు గొడవలు, ఆరు కొట్లాటలుగా తయార య్యాయ. పార్టీలు మారిన వారు తమను ఎన్నుకున్న ప్రజలకు ముఖం ఎట్లా చూపగలుగుతారో అర్థం కాదు. నిస్సిగ్గు రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయ మరి.
- కె.వి. రమణమూర్తి, కాకినాడ
మొక్కుబడి వ్యవహారం
ఈసారి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ముం దుగానే (మే నెలలో) ప్రవేశిస్తాయని ప్రకటించినా ఆ తరు వాత అలా జరగలేదు. అందుకు గల కారణాలను వివ రించడం వాతావరణశాఖకి ‘ఓ మొక్కు బడి వ్యవహారం లా’ మారింది. ఏటా ఇదే తంతు. ఇందువల్ల ప్రజలకు ఆ శాఖ పట్ల కొంత అపనమ్మకం ఏర్పడింది. కాబట్టి పత్రికా ప్రకటనలు చేయకుండా ఆయా ప్రభుత్వాలకు మాత్రమే తెలియపరుస్తుండడం మంచిదేమో. రైతులను ఆశాభం గం నుంచి కాపాడవచ్చు.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
నిజాం పాలనలో ఉన్నామా?
పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందుగా ఆఫీసునుంచి వెళ్లిపోవడానికి అనుమతించారు. ముస్లిం ఉద్యోగులు ప్రతి శుక్రవారం ప్రార్థ నల్లో పాల్గొనేందుకోసం రెండుగంటల ముందే ఆఫీసును వదలి వెళ్లిపోతున్నారు. మరి అటువంటి సదుపాయం ముస్లిమేతర ఉద్యోగులకు లేదు. ఇక మరో విషయం. పోలీసు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లుగా ఎంపికైన ముస్లిలకు శిక్షణా కాలంలో అవసరమైన పుస్తకాల కొనుగోలుకు రూ.1000, వసతి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1500 చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈ నిధులను తెలంగాణ స్టేట్ ఫండ్ ఫర్ మైనారిటీ డెవలప్ మెంట్ నుంచి అందజేస్తారు. మరి ఇటువంటి సదుపాయమే ముస్లిమేతరులకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కలుగజేయదు? వారు చేసిన పాప మేంటి? మనమేమన్నా నిజాం పాలనలో ఉన్నామా? నిజాంపాలనలో 90 శాతం ఉద్యోగాల్లో వారే ఉండేవారు. మైనారిటీ సంక్షేమం ముసుగులో హాజ్ సబ్సిడీలు, ఉర్దూ యూనివర్సిటీ, ఉర్దూ అకాడమీలతో పాటు ముస్లిం పాలకులు హిందువులపై విధించిన జిజియా పన్ను కూడా విధిస్తారా?
- టి.హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
తెలుగును పట్టించుకోండి
మన చుట్టుపక్కలగల తమిళనాడు, కర్నాటక మరియు మహారాష్టల్ల్రో రాష్ట్ర స్థాయివరకు పరిపాలనలో అక్కడి ప్రాం తీయ భాషల్లోనే నడుస్తూ న్యాయస్థానాల్లో, కోర్టు తీర్పులు కూడ ప్రాంతీయ భాషల్లోనే వెలువడుతూ సామాన్య ప్రజలు కూడ అన్ని రంగాల్లో అభివృద్ధిచెందుతుంటే, మన తెలుగువారు మన భాషను పట్టించుకోరు. మన రాజకీయ నాయకుల తీరు అంతకన్నా అధ్వాన్నం. మన తెలుగువారు హైదరాబాద్‌లో ఇతరులు మాట్లాడే ఇంగ్లీషు, హిందీల ప్రాధాన్యాన్ని చూసి తెలుగు వాడడానికి చిన్నతనంగా భావిస్తూ తమకు రాకున్నా ఎంతో కష్టపడైనా పరాయి భాషలనే ఆదరిస్తు న్నారు. రాజకీయ నాయకులను తెలుగు భాషలో పరిపాలన మాతృభాషలో విద్యాబోధన అమలుచేయించాలని నిలదీయాలి. అధికార కార్య కలాపాల్లో తెలుగును అమలు చేయాలి. మాతృభాషకు ప్రాధాన్యమిస్తే అన్యభాషలు నేర్చుకోవడం తేలిక. దీన్ని గుర్తించాలి. అప్పుడే తెలుగుజాతి మంచి పురోభివృద్ధిలో వుండి కీర్తిప్రతిష్ఠలు పొందుతుంది. లేకపోతే తెలుగుజాతి నశించడం ఖాయం.. జాగ్రత్త.
- బెలిదె వీరశంకరు, హైదరాబాద్