ఉత్తరాయణం

ద్రవిడ వర్సిటీ వారికో విన్నపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ 2007-08, 2008-09 బ్యాచ్‌ల పిహెచ్‌డి ఆఫ్ క్యాంపస్ స్కాలర్లు 2011లో సమర్పించిన థీసెస్‌ల ప్లాగియారిజమ్ పరిశీలించబడ్డాయని మే 2016న వర్సిటీవారి వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. అన్ని సబ్జెక్టులవారు కలిపి నాలుగువందల ఇరవైఏడు మంది ఈ టెస్టులో పాస్‌కాలేదని తెలపడం జరిగింది. ఇది ఎలా అయిందనుకున్నారు? ఎన్నో వందల లేఖలు స్కాలర్లు యూనివర్సిటీ వారికి రాయగా, రాష్ట్ర విద్యామంత్రి గంటా శ్రీనివాసరావుగారు విసిల మీటింగుల్లో ఆదేశించగా, కొంతమంది స్కాలర్లు ప్రధానమంత్రికి, చాన్సలర్‌కు (గవర్నరు) కేంద్ర, రాష్ట్ర మంత్రులకు రాయగా, కుప్పం నియోజకవర్గ సభ్యుడైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని స్వయంగా కొంతమంది కలసి అర్ధించగా, కొత్త విసిగారైన ప్రొఫెసర్ సత్యనారాయణగారు ప్రత్యేకశ్రద్ధ తీసుకోగా జరిగిన పరిణామమిది. అయితే ఈ ప్లాగియారిజమ్ టెస్ట్ పాసైనవారి థీసెస్‌లను మూల్యాంకనకు పంపారో లేదో తెలియదు. పంపినా ఆయా ఎగ్జామినర్లు నిర్దేశించిన సమయంలో మూల్యాంకన ఫలితాలను పంపుతున్నారో లేదో కూడా తెలియదు. ఇప్పటికే ఆరేడు సంవత్సరాల విపరీత జాప్యం జరిగింది. కొసమెరుపేమిటంటే వంద మందికి పైగా స్కాలర్లకు పిహెచ్‌డి డిగ్రీలు ప్రదానం చేసేశారుట. ఇదెలా సాధ్యమయిందో వర్సిటీ వారికే ఎరుక. వర్సిటి వారికో విన్నపం. అర్హులైన స్కాలర్లకు రేపు ఆగస్టు నెలలోపే అన్ని ప్రక్రియలు పూర్తిచేసి పిహెచ్‌డి పట్టాలను ప్రదానం చేసి పుణ్యం కట్టకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పాముగతి ఏమయిందో?
పామును చూపిస్తూ బెదిరించి పలు అకృత్యాలకు పాల్పడి జైలుశిక్షలకు గురైన స్నేక్ గ్యాంగ్ గతి సరేసరి. అయితే సదరు పామును ఏమి చేశారు? చంపేశారా? జంతు ప్రదర్శనశాలకి పంపించారా? లేక అడవులలో వదిలేశారా? అన్నది ఒక సందేహం. మనుషుల బుద్ధిలేనితనం వల్ల జంతువులు, పశువులు, చేపలు, పక్షులు ఇంకా ఇతర జీవులు భయంకరమైన హింసను అనుభవిస్తున్నాయి.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
డిప్యుటేషన్లు రద్దు చేయాలి
నెల్లూరు జిల్లాలో స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు కాంట్రాక్టు సిబ్బందిని ఆ పని చేయనీయకుండా, రెగ్యులర్ కోర్టులకు డిప్యుటేషన్‌పై పంపుతున్నారు. ఈవిధంగా వీరిని డిప్యుటేషన్ల పేరుతో జిల్లా సరిహద్దులకు పంపడం అన్యాయం. తక్షణం ఈ డిప్యుటేషన్లను రద్దు చేయాలి. ఇందుకోసం సంబంధిత న్యాయమూర్తులు తగిన చర్యలు తీసుకోవాలని మనవి.
-జె. సురేఖ, నెల్లూరు
నిషేధం గాలికే!
పబ్లిక్ ప్లేసుల్లోనూ, కార్యాలయాలలో, రైళ్ళు, బస్సుల్లోనూ పొగత్రాగడం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాని ఇది అతి పాక్షికంగానే అమలు అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడక్కడ పబ్లిక్ ప్రదేశాల్లోనూ, హోటళ్ళలో, విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో ఇంకా పొగ రాయుళ్ళు యదేచ్ఛగా తమ పని తాము కానిస్తున్నారు. పొగ త్రాగడం ఎంత అనారోగ్యకరమో తెలిసి కూడా ఇలా చేయాలా? పొగ త్రాగేవారి కంటే పీల్చేవారికే ఆరోగ్యపరంగా ఎక్కువ నష్టదాయకమని వారికి తెలియదా? ఆ మాత్రం సంస్కారం అయినా లేదా? ప్రభుత్వం ధూమపాన నిషేధాన్ని పటిష్టంగా అమలుచేయాలి. పబ్లిక్ ప్రదేశాలలో పొగ త్రాగుతూ పట్టుబడ్డవారికి విధించే జరిమానా భారీగా పెంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
బస్సులు నడపండి
గద్వాల డిపోవారు అనేక మార్గాలలో బస్సులు నడపటం లేదు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. మంచి రోడ్డు సౌకర్యంవున్న గ్రామాలకు సైతం బస్సులు నడపటం లేదు. జిల్లా కేంద్రానికి చాలా తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. కొన్ని రైళ్ళ సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపితే సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్నూల్-1 డిపో బస్సులు తిరగడం లేదు. ఆ లోటును సైతం గద్వాల డిపోవారు పూడ్చవల్సిన అవసరం వుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని గద్వాల డిపోవారు స్పందించి బస్సులు నడిపితే ఆదాయం మాత్రమే కాదు, ప్రజలకు సౌకర్యం కూడా.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్