ఉత్తరాయణం

సహేతుకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రదానం చేసిన ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డుల ఎంపిక, వర్గీకరణ సహేతుకంగా లేవనిపిస్తున్నది. ఉదాహరణగా చాగంటి కోటేశ్వరరావుగారు తమ ప్రతిభను దిగ్విజయం గా ప్రదర్శిస్తున్న ప్రవచన రంగాన్ని కాకుండా ‘అవధానం’ విభాగంలో ప్రకటించి, ప్రదానం చేయడాన్ని తీసుకో వచ్చు.
- జయ కాకినాడ

కోదండరామ్‌ను విమర్శించడం తగదు
తెలంగాణ ఉద్యమ భీష్మాచార్యుడంతటి గౌరవ అధ్యాపకుడైన ప్రొఫెసర్ కోదండరామ్‌ను విమర్శించడం ‘ఏరు దాటి’ అనే సామెతను గుర్తుకు తెస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంతోనే టిజెఏ రద్దయందా? అలాగే అయతే తెలంగాణ ఆవిర్భావంతోనే ఆ పార్టీ తెరాస రద్దుకావాలన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. ఇల్లు అలకగానే పండుగ కాదు.
- ప్రొ. కె. నాగరాజారావు, సికిందరాబాద్
నూతన అంశాలపై శిక్షణ ఇవ్వాలి
2015-16 ఆర్థిక సంవత్సరంలో 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాల్లో సిలబస్ మార్చారు. ఒక ఏడాది గడిచింది కూడా. నూతన పాఠ్యాంశాలపై ఉపాధ్యాయు లకు శిక్షణ ఇస్తే బాగుండేది. ఒకవేళ స్థాయని మించిన పాఠాలు ఉన్నా, పాఠ్యాంశాల్లో పొరపాట్లు ఉన్నా తద నుగుణంగా సవరించడానికి వీలుండేది. ఈ విషయాలను అధికారులు దృష్టిలో ఉంచుకోవాలి.
-సిరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఏది నిబద్ధత?
ఉముద్రగడను నిబద్ధత గల నేతగా పత్రికలు ప్రస్తావిస్తున్నాయగాని ప్రస్తుత ఆందోళనలో ఆయన సాధారణ స్వార్థనేతగానే కనిపిస్తున్నారు. ఏ కులాన్నైనా రిజర్వేషన్ పరిధిలోకి తేవాలంటే సంబంధిత కమిషన్ విచారణ జరిపి సిఫార్సు చేయాలి. అలా కాక ప్రభుత్వం నేరుగా జివో ఇస్తే కోర్టు రద్దు చేస్తుందని ఆ నిబద్ధ నేతకు తెలియదా? ఆందోళనకు కర్తకర్మ క్రియ తానే కాబట్టి అరెస్ట్ చేసి వారిని వదిలేయండి అనడం, సొంతజాతి కోసం చస్తాననడం నిబద్ధ రాజకీయం కాదు. రైలు దహనాన్ని ఆయన ఖండించనూ లేదు. ప్రజలకు క్షమాపణ చెప్పనూలేదు. పైగా విద్రోహుల్ని వదిలేయ మంటున్నాడు. ఇది నిబద్ధతా?
- సాహిత్యదీప్తి, రమణయ్యపేట

ఫీజులను నియంత్రించాలి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులు దారుణంగా ఉంటు న్నాయ. పేద, మధ్య తరగతులవారు అప్పులు చేసి అతికష్టంమీద ఫీజులు చెల్లిస్తున్నారు. దీనికితోడు బిల్డింగ్ ఫీజు పేరుతో మరింత డబ్బులు గుంజుతున్నారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్న బస్సులకైతే నిర్ణీత రుసుం కన్నా ఎక్కువగా సంబంధిత యాజమాన్యాలు ముక్కుపిం డి మరీ వసూలు చేస్తున్నాయ. ఇంత జరుగుతున్నా ప్రభు త్వాలు చోద్యం చూస్తున్నాయ. తమిళనాడు, రాజస్థాన్ ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు పలు చర్యలు చేప ట్టడంతో ఆ రాష్ట్రాల్లో పరిస్థితి సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు అవసరమైన చట్టాలు తీసుకొని రావాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
సభలు, సమావేశాలను నిషేధించాలి
వేసవిలో ముఖ్యంగా వారాంత దినాలలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా వుంటుందని దర్శనంకోసం భక్తులు 25-30 గంటలు వేచి చూడవలసి వుంటుందని, వసతి, నీరు, భోజనాలకోసం తిరుగు ప్రయాణాలకోసం భక్తులు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని తెలిసి కూడా చిత్తూరు జిల్లా వాసి అయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి తెలిసి కూడా ఈ నెల 27,28,29 (శుక్ర, శని, ఆదివారాల)లలో తిరుపతిలో మహానాడును నిర్వహించడం బాధ్యతా రాహిత్యం. ఈ మహానాడుకు విచ్చేసి విఐపిలు, ఇతర ప్రముఖులవల్ల తిరుమలకు వచ్చే నిజమైన భక్తులకు కలిగే ఇబ్బందుల గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత మన ప్రభుత్వ నేతలకు వుండదా? ఇకనైనా శని, ఆది, సోమవారాలు, సెలవులు, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి పరిసరాల్లో ఎటువంటి మహాసభలు, సదస్సులు, సమావేశాలు జరుగకుండా ప్రభుత్వం మరియు టిటిడివారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. భక్తుల పట్ల నిబద్ధత లేని నేతలకు భగవంతుని ఆశీస్సులు కూడా వుండవని అందరూ గ్రహించాలి.
- అహోబలరావు, హైదరాబాద్
సచివాలయానికి దారేది?
ఇటీవల కురిసిన సాధారణ వర్షాలకు (తుఫాను సందర్భంగా) అమరావతిలో ప్రత్యేక బస్సులో వెలగపూడి వెళ్ళగా ఆ బస్సు మోకాలి బురదలో దిగబడింది. వచ్చే వర్షాకాలంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుందనుకోలేము. కట్టిన బిల్డింగులు ఏ తుఫాను షెల్టర్లుగానో వాడుకొని రాజధానిని గుంటూరునుండి ప్రకాశం ఇల్లా వెళ్ళే దారిలో నిర్మించడం శ్రేయస్కరం. అది ముఖ్యమంత్రి గారికి, ప్రజలకు హితవౌతుందేమో ఆలోచించాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం