సంపాదకీయం

విద్యకు వనె్న...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్ట్భద్ర స్థాయి కళాశాలలలో ప్రవేశించదలచిన వారు అఖిల భారత స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్న ప్రతిపాదన విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదం చేసింది. ఉన్నత విద్యా విధాన అధ్యయన సంఘం వారు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని ఈ ప్రతిపాదన-ఆలస్యంగా అయినా అంకురించడం అద్భుతమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులయ్యేసరికి విద్యార్థులు పనె్నండు తరగతులను పూర్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి విద్యా ప్రణాళికననుసరించి పనె్నండవ తరగతి చదివిన వారు ఉన్నత పాఠశాలలలో ప్రవేశానికి అర్హులవుతున్నారు. ఇలా ఇంటర్మీడియెట్ చదివినవారికి, పనె్నండవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయిన విద్యార్థులకు ఆయా పరీక్షలలో వచ్చిన మార్కుల ప్రాతిపదికగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం లభిస్తోంది. అయితే కేంద్ర రాష్ట్రాల పాఠ్య ప్రణాళికల మధ్య,వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్య ప్రణాళికల మధ్య ప్రమాణాలలోను, బోధన పద్ధతులలోను, పరిజ్ఞాన విస్తృతిలోను, పరీక్షా స్వభావంలోను అంతరాలు కొనసాగుతున్నాయి. అందువల్ల పనె్నండవ తరగతి పరీక్షలోను, దానితో సమానమైన ఇంటర్మీడియెట్ తదితర పరీక్షలలోను ఉత్తీర్ణులైన విద్యార్థులకు జాతీయ స్థాయిలో సమాన పరీక్ష నిర్వహించి ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ప్రాతిపదికగా డిగ్రీ కళాశాలల్లో వారికి ప్రవేశం కల్పించాలన్నది అధ్యయన సంఘం చేస్తున్న ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అమలు జరిగితే వృత్తి విద్యా కళాశాలలలో చేరవలసిన విద్యార్థుల వలెనే బిఏ, బిఎస్‌సి, బికామ్ వంటి కోర్సులను చదవదలిచిన వారు కూడ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఇలా ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కేంద్రప్రభుత్వం మళ్లీ నడుం బిగిస్తుండడం హర్షణీయం. జాతీయ విద్యా విధాన రూపకల్పన కోసం ఏర్పడిన అధ్యయన సంఘం వారు సమర్పించిన నివేదికలోని ప్రధాన ఇతివృత్తం ఇలా ప్రమాణాలను మెరుగుపరచడం. పట్టాలు కాక ప్రతిభ గీటురాయిగా విద్యాస్థాయిని నిర్ణయించాలన్న అధ్యయన సంఘం వారి ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడం లాంఛనం కావచ్చు! అధ్యయన సంఘం వారు సమర్పించిన నివేదికలోని కొన్ని ప్రధాన అంశాల మధ్య పరస్పరం పొంతన కుదరకపోయినప్పటికీ విద్యావేత్త టిఆర్‌ఎస్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం రూపొందించిన ఈ విధాన పత్రం సంస్కరణ పథంలో మరో ప్రగతి పదం...
ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పాఠ్య ప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పాఠ్య ప్రణాళికను పనె్నండవ తరగతి వరకు అభ్యసించిన వారికి ఈ పరీక్ష కఠినంగా ఉండవచ్చు. ఈ ప్రవేశ పరీక్షను సిబిఎస్‌ఇ-కేంద్రీయ ఉన్నత పాఠశాలల విద్యామండలి-వారి పాఠ్య ప్రణాళికను అనుసరించి నిర్వహిస్తారా? అలా నిర్వహించినట్టయితే పనె్నండవ తరగతి-ఇంటర్మీడియెట్-వరకు ప్రాంతీయ పాఠ్య ప్రణాళిక-స్టేట్ సిలబస్-ప్రాతిపదికగా చదివినవారు వివక్షకు గురి అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రణాళికల మధ్య సమన్వయాత్మకమైన పాఠ్యాంశాలు ప్రాతిపదికగా మాత్రమే ఈ జాతీయ ప్రవేశ పరీక్షను నిర్వహించాలి. అందుకు అవసరమైన విధి విధానాలను నివేదికలో వివరించలేదు. ఈ జాతీయ ప్రవేశ పరీక్షలో విద్యార్థులందరికీ సమానమైన పాఠ్యాంశాలు రూపొందించవలసి ఉంది. అందువల్ల కనీసం పదకొండవ పనె్నండవ తరగతులలో దేశంలోని అన్ని పాఠశాలలలోను, జూనియర్ కళాశాలలోను ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక అమలు జరగాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయ సాధన అనివార్యం. ఇలా పాఠశాల స్థాయిలో సమాన పాఠ్య ప్రణాళిక అమలు జరగనిస్తే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో దేశమంతటా సమాన పాఠ్య ప్రణాళిక రూపొందడానికి ఎనే్నళ్లు పడుతుందో? ప్రాంతీయ భాషలు మాధ్యమంగా పనె్నండవ తరగతి వరకు విద్యనభ్యసించిన వారికి జాతీయ ప్రవేశ పరీక్షను ఏ మాధ్యమంలో నిర్వహిస్తారు? అన్ని భారతీయ భాషలలోను నిర్వహించడం న్యాయం. అలా నిర్వహించడం కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ప్రహేళిక పద్ధతి-పరీక్ష వల్ల సాధ్యవౌతుంది!
మన విద్యా వ్యవస్థ విదేశీయ దురాక్రమణ నాటి స్వరూప స్వభావాలనుండి విముక్తం కాకపోవడం జాతీయ వైపరీత్యం. బ్రిటిష్ సామ్రాజ్య వాదులు అమలు జరిపిన విద్యావిధానం భారతీయ విద్యావంతులను పాశ్చాత్య భావ నిబద్ధం చేసింది. ఈ భావ దాస్యం నుండి విముక్తి వౌలికమైన మాధ్యమం సంస్కృత భాషను అభ్యసించడం. ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో సంస్కృత భాషను స్వతంత్ర పాఠ్యాంశంగా బోధించాలని అధ్యయన సంఘం వారు చేసిన ప్రతిపాదన భావదాస్య విముక్తికి దోహదం చేయగలదు. అయితే స్వతంత్ర పాఠ్యాంశం-ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్-అని అంటే ఏమిటన్నది స్పష్టం కావడంలేదు. నిర్బంధ పాఠ్యాంశం-కంపల్సరీ సబ్జెక్ట్స్-ఐచ్ఛిక పాఠ్యాంశం-ఆప్షనల్ సబ్జెక్ట్స్-అన్న విభజ మాత్రమే బోధనా ప్రణాళికలో ఇంతవరకు ప్రసిద్ధమైన అంశాలు. సిబిఎస్‌సి పాఠ్య ప్రణాళికలో భాగంగా సంస్కృత భాషను ఒకటవ తరగతినుంచి పనె్నండవతరగతి వరకు మొదటి భాష -్ఫస్ట్ లాంగ్వేజ్‌గా అధ్యయనం చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే హిందీని కాని ప్రాంతీయ భాషను కాని మాత్రమే విద్యార్థులు మొదటి భాషగా చదువుతున్నారు. సంస్కృత భాషను ఐదునుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే మూడవ భాషగా బోధిస్తుండడం సిబిఎస్‌సి అనుబంధ పాఠశాలలలో నడుస్తున్నతతంగం. రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళిక అమలు జరుగుతున్న చోట ప్రాచ్య పాఠశాలలలో మాత్రమే సంస్కృత భాషను చిన్నపిల్లలకు నేర్పిస్తున్నారు. కానీ ఈ ప్రాచ్య భాషా పాఠశాలలు-ఓరియెంటల్ స్కూల్స్-ఒకదాని తరువాత ఒకటిగా మూతపడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కాంపోజిట్ తెలుగు పేరుతో ఎనబయి మార్కుల పరీక్షకు తెలుగును, ఇరవై మార్కుల పరీక్షకు సంస్కృత భాషను బోధిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు లభించే సంస్కృత పాండిత్యం ఎంత? ఈఇరవై మార్కుల బోధనకు సైతం సున్న చుట్టడానికి రంగం సిద్ధమైందట...అందువల్ల స్వతంత్ర పాఠ్యాంశం అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఒకటవ తరగతినుంచి పనె్నండవ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు వలె నిర్బంధ పాఠ్యాంశంగా సంస్కృత భాషను బోధించినప్పుడు మాత్రమే విద్యావంతులలో మళ్లీ భారతీయత వికసించే అవకాశం ఉంది...
సంస్కృత భాషకు దూరమైన విద్యావంతులు భారతీయ సంస్కృతికి దూరమైపోయారు, ఇంకా ఇంకా దూరంగా జరుగుతున్నారు. ఈ దేశంలో అనాదిగా సంస్కృత భాషా సాహిత్య మాధ్యమంగా జాతీయ సంస్కృతి వికసించడం చరిత్ర! బ్రిటిష్ వారు ఈ చరిత్రను చెరిచిపోయారు. సంస్కృత భాషను క్రమంగా తొలగించారు. సంస్కృత భాష మాధ్యమంగా జరిగినవాటినన్నింటినీ ఆంగ్లమాధ్యమంగా జరపడం ఆరంభించారు. అది బానిసత్వం...మళ్లీ సంస్కృత భాష జాతీయ వ్యవహారాలకు మాధ్యమం అయినప్పుడు మాత్రమే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం...అందువల్ల ఇప్పుడైనా దేశమంతటా సంస్కృత భాషను పాఠశాలలలో తప్పనిసరిగా బోధించాలి.