వీరాజీయం

తగుమాత్రం తిని తరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరలేని తిండి కుక్క తిండి
పప్పు లేని తిండి పాడుతిండి-
అన్నాడు మహాకవి వేమన్‌జీ- ఆయనగారి రోజుల్లో కూడా ఉల్లిపాయ, పొటేటో- అంటే బంగాళ దుంపకి టొమేటో తగిలించి ముద్దకూర చేస్తే పప్పు ధప్పళం ఊసెత్తేవారు కారేమో, గానీ యివాళ సదరు కందిప్పప్పు దప్పళం లేదా, మన బ్రదర్ అరవ్వాడి సాంబార్ కూడా కొండెక్కి కూర్చున్నాయ్!
‘అల్లుడికి నెరుూ్య లేదు- అతనితో వచ్చిన వాడికి నూనే లేదు’- అన్నట్లు ధరల రాక్షసుడు సామాన్యుల మీద ముప్పేట దాడి చేశాడు. ప్రొద్దునే్న లేవంగానే పేపర్లందుకుంటే అది మండిపోతున్నట్లు అనిపించింది. హెడ్ లైన్స్ అన్నీ- ఉల్లిపాయ ధర; టొమేటో రేటు, ఆపైన ఎన్నడూ ఎరుగని ఘాటులేని పొటేటో ఘాటు! ఆమాటకొస్తే రుూమధ్య ఏ వార్త ఏ సందర్భం వచ్చినా, ‘‘రెండు తెలుగు రాష్ట్రాలు’’అంటూ జమిలిగా మాట్లాడేసుకుంటున్నాం. అదో ‘తుత్తి’-ఇప్పుడూ అంతే. దేశం మొత్తంమీద, ‘ఆంధ్రా’- రామ ములక్కాయల ఉత్పత్తికి పెట్టింది పేరు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ ‘మండీ’బాస్- అంటే మార్కెటింగ్ మ్యానేజర్ చెప్పాడు. ‘‘ప్రతిసారీ టమోటాలు సౌత్- అంటే మన దక్షిణాది రాష్ట్రాలనుంచి వచ్చేవి... కానీ రుూసారి యిక్కణ్నుంచి టమోటాలు అక్కడికి తోలుస్తాం’’అని. ఇక పప్పు్ధరలు ఎన్నిరకాల నాగ స్వరాలు వూదినా ఒక్క సెంటీమీటర్ కూడా దిగమంటున్నాయి. పూణే మార్కెట్‌లో ఒక హోల్‌సేల్ వ్యాపారి చెప్పాడు, ‘‘మహారాష్టల్రో క్రికెట్ మ్యాచ్‌లకే లేవు నీళ్లు. ప్రతిసారీ రుూపాటికి రోజుకి డెబ్భై ట్రక్కుల టమోటాలు వచ్చేవి. అలాంటిదిప్పుడు ఏడు ట్రక్కులు రావడానికి ఏడ్పించేస్తున్నాయ్.’’
ఎండలు మండిపోయాయి! నిజమే! కొన్ని రాష్ట్రాలలో కాటకం ఏర్పడ్డదీ అంటే అబద్ధంకాదు. కానీ లక్షల టన్నుల్లో ‘బఫర్’ (ఆపద్ధర్మ నిల్వలు) పెట్టుకుంటున్నాం’ అంటూ డబ్బాకొట్టిందే గవర్నమెంట్? ఆ ‘‘స్పేరు’’ సరుకు ఏదీ? ‘ఒకటి కొంటే రెండు ఫ్రీ’, ‘రెండుకొంటే మూడు ఫ్రీ’ అంటూ అడ్డమయిన సౌందర్య పోషక ద్రవ్యాలకీ, ప్లాస్టిక్ తట్టలనుంచీ రిఫ్రిజరేటర్స్ దాకా అడ్వర్‌టైజ్‌మెంట్లు దంచేస్తున్నారే- ‘ఓ కిలో కిందిపప్పుకి ఓ అరడజన్ ఉల్లిపాయలు ఉచితం’- అన్నారా?
అసలు జిందగీ కిస్‌లియే? అన్న కవి దానికి ఏ సమాధానం చెప్పాడు?’’ తిండి కోసమే ఎవరైనా బ్రతికుపోరాటం సాగించేది’’ అన్నాడు.
‘‘వానలకోసం ఎదురుచూస్తుంటే, ఆ దిక్కుమాలిన ‘రైన్స్’కొంచెం మొరాయించేసరికి యివతల వీళ్లు అర్జెంట్‌గా రేట్లు పెంచేసారు’’- అంటూ ఓ ఇల్లాలు తిట్టుకుంది గానీ, టమోటా పంటకి వర్షం అంత అవసరం కాదు. అది అరవై రోజుల పంట. కానీ రేట్లు పెంచడానికి ‘ఎండలు’ కారణం అంటే అది రైటు అనాలి మనం.
ఏదో ఒక సాకు కావాలి. ధరలకీ- మనిషి ‘రుచి’కీ, తిండికీ, ఆకలికీ ఉన్న సంబంధం లాంటిదే వున్నది.
ఒప్పేసుకుంది గవర్నమెంట్. పోయినసారికన్నా ధరలు- సైంటిఫిక్‌గ్గా చెప్పాలీ అంటే ద్రవ్యోల్బణం స్పీడందుకుంది. కాయగూరల ధరలు అన్ని నగరాలలోనూ - ఓ ‘మాట’అనుకున్నట్లు టమోటాలు కిలో ఎనభై దగ్గరా, బంగాళా దుంపలు డెబ్భై దగ్గరా, ఉల్లిపాయలు తొమ్మిది రూపాయల దగ్గర్నుంచీ యాభైఆరు దాకా, ఒకటే ప్రగతి సాధించాయి.
నిజానికి ఆంధ్రా టమోటాలు పోయినేడాది రుూ టైముకన్నా సుమారు ఆరువేల టన్నులు ఈ ఏడాది ఎక్కువే ఉత్పత్తి అయ్యాయిట. కాకపోతే కర్ణాటకాలో టమోటాలు ‘‘టాటా’’ చెప్పేశాయి. పప్పుల ధరలు పచ్చనోటుకు ఉలకడం మానేశాయి. చాలాకాలమైంది. గవర్నమెంట్ కొన్ని శాంపిల్స్‌గా కొన్ని జాగాల్లో అమ్మడమే కిలో నూట ఇరవై రూపాయల్ట! వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారికంగా చెప్పిన దాన్నిబట్టి టమోటాల ధర పోయినేడాదికీ, ఆ ముందుటేడాదికన్నా డబుల్ రేటుకి పెరిగాయి. 28 రూపాయల నుంచి 56 రూ.అంటున్నారు
(56కి ఎవడిస్తున్నాడు?) ‘‘నాకో పది కిలోలు పట్రా’’ అంటోంది టిఫిన్ సెంటర్ ఓనరు. కిలో 80 రూపాయలు. ‘‘ఏరుకుంటే చేతిలో పండ్లు లాక్కొని అవతలికి పొమ్మంటున్నాడు. ఓమారు మార్కెట్‌కి పోయొస్తే తెలుస్తాయి రేట్లు- అంటూ యిళ్లదగ్గర కోప్పడుతున్నారు మగాళ్లని మగువలు!
అసలు టమోటా లేనిదే బంగారు తెలంగాణాలో ముష్టివాడు కూడా ముద్దముట్టడు. ‘‘ఉల్లిపాయా’’అంటే వెనుదిరిగి చూస్తారు ఆబాలగోపాలం.
‘‘ఇంకా నయం, శనివారం ఉల్లిపాయ తినకూడదూ’’అని పెట్టారు మన పూర్వీకులు ఆంక్ష. శనివారం ఉల్లిపాయలు ఆదాఅవుతాయి అంటున్నాడో ‘పూర్’ సీనియర్ సిటిజన్.
- ‘‘ఎక్కడున్నారు సామీ, మీరూ? హైదరాబాద్‌లో మాత్రం 99 పర్సెంట్ అంతా ‘‘నాన్‌వెజ్’’. ఉల్లిపాయకి శలవులు వుండవు యిక్కడ’’- అన్నదో కాలేజీ పాప.
కూడబలుక్కున్నట్లు ఇలా ఆ మిగిలిన ఆ ఒక్క శాతం- లేదా, ఆంధ్రాలో ఆ మిగిలిన ఆరుశాతం జనాల మీద యింత క్రూరంగా ఒకేసారి ‘ఉటపో’ రేట్లు మేఘాలమీద షైర్లు చేస్తూ వుంటే ఎలా?
‘‘డోన్ట్ వర్రీ!’’ అన్నాడు ఆశావాది. గవర్నమెంట్‌ని నమ్మండి. ఉల్లిపాయలు కుళ్లిపోకుండా మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో అదనంగా 38వేల టన్నుల ‘ఆనియన్స్ స్టోరేజీ’కి సన్నాహం చేస్తున్నారు. అదెప్పుడు? వాన వెలిశాక గొడుగు తెచ్చినట్లు- దాచనూ వద్దు, కుళ్లబెట్టనూ వద్దు. బజార్లో పోసెయ్యండి. కావాలీ అంటే నట్టింట ఆరబోసుకుంటాం. లేదా, అపురూపంగా ఫ్రిజ్‌లో ఎట్టేసుకుంటాం’’ అన్నాడో ‘‘మసాలా’’ప్రియుడు.
రాజధానిలో గవర్నమెంటు రథసారధులు - ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఉల్లి, టమోటా, రెండూ అరుణవర్ణమేనండోయ్. తిండి మంత్రి పాశ్వాన్, వ్యవసాయ మంత్రి రాధామనోహర్‌సింగ్, రవాణాశాఖామాత్యుడు నితిన్‌గడ్కారి, వాణిజ్య మంత్రి సీతారామన్‌లు- తలలు ఏకం చేస్తున్నారు. ‘టమోటాసూప్, ఆలూటిక్కీ, ఆనియన్ దోసై’లు వాళ్లమధ్య ప్లేట్లలో వున్నాయో? లేదో ‘తెల్వదు’కానీ తెగ మంతనాలు చేస్తున్నారు. ‘‘మైన్మార్ (బర్మా)నుంచీ, ఆఫ్రికానుంచీ దిగుమతి చేసుకుందారి’’, అనుకుంటున్నారు. ఈలోగా పదివేల టన్నుల పప్పుదినుసులు ఆపద్ధర్మంగా రిలీజ్ చేస్తున్నారుట! పప్పు్ధరలు 31.6% మేరకు పెరిగాయిట. ఐతే రుూసారి రుూ ‘‘రేటుపోటు’’ ఆగస్ట్, సెప్టెంబర్ దాకా ఎడాపెడా వుంటుంది అని ప్రభుత్వం అంచనావేసింది. సో... తగుమాత్రం తినుడు- తరించుడు.
రిలాక్స్ అండ్ వెయిట్ ఫర్ గుడ్ డేజ్?